ఏఐలో మాతృ’ఘోష’ – ఇంగ్లీష్ కే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దాసోహం
సహనం వందే, హైదరాబాద్: మనం సృష్టించిన యంత్రాలు మనల్ని కాపాడతాయని నమ్మాం. కానీ ఆ మేధస్సు వెనుక ఒక దారుణమైన వివక్ష దాగి ఉంది. ఏఐ అందరికీ సమానమనేది ఒక భ్రమ మాత్రమేనని తేలిపోయింది. అక్షరాల మధ్య తేడా ప్రాణాల మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఇంగ్లీష్ రాని వాడు ఏఐని నమ్మితే అది నేరుగా ప్రమాదానికే దారి చూపిస్తుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు… ఒక అమానవీయ భాషా వివక్ష. మౌనంగా…