
ఇండియా కూటమి బీసీ నినాదం – ముఖ్యమంత్రి రేవంత్ చొరవ
సహనం వందే, హైదరాబాద్:ఇండియా కూటమి పార్టీలలో బీసీ చర్చను లేవనెత్తేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. కూటమి పార్టీల ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదింప చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అయినందున… దాని అధినేత రాహుల్ గాంధీ అనుమతి తీసుకుని సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున…