మహావీర్ గుప్పిట్లో ఎన్ఎంసీ -లంచం తీసుకున్నందుకు కృతజ్ఞతాభావం
సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) దారి తప్పిపోయింది. లంచాల రుచికి మరిగిన ఎన్ఎంసీ బృందాలు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. దేశంలో అనేక చోట్ల సీబీఐ కేసులు పెడుతూ కొందరిని అరెస్టు చేస్తున్నా… ఎన్ఎంసీ అధికారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ముడుపులు తీసుకుని ముందే కమిట్మెంట్లు ఇవ్వడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చెట్టాపట్టాల్ వేసుకొని దర్జాగా తిరుగుతూనే ఉన్నాయి. అందుకు నిలువెత్తు ఉదాహరణ వికారాబాద్ లో ఉన్న మహావీర్…