ఎమ్మెల్యే చేతిలో బీసీ భవితవ్యం – నియోజకవర్గం యూనిట్ గా రిజర్వేషన్లు

సహనం వందే, హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆశలు అడియాశలు అవుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మోక్షం లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుంచి ఏమాత్రం కదిలిక రాలేదు. దీంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినప్పటికీ పార్టీ పరంగానే 42% సీట్లను బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. నియోజకవర్గం యూనిట్ గా అమలు…

Read More

150 కోట్ల ‘కూలీ’… ఒక రోజు సెలవు

సహనం వందే, హైదరాబాద్:సూపర్‌స్టార్ రజనీకాంత్, యువ సంచలనం లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న కూలీ సినిమా ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద సంచలనంగా మారింది. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. రజనీకాంత్ క్రేజ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై ఉన్న నమ్మకం కలగలిపి అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి. ఖరీదైన కూలీ… భారీ పారితోషికాలుసాధారణంగా కూలీలు రోజుకి వందల రూపాయలు తీసుకుంటే, ఈ కూలీ మాత్రం ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నాడు. అవును రజనీకాంత్ ఈ…

Read More

నర్సింగ్ ఉద్యోగాల్లో లింగ వివక్ష – పురుష నర్సులకు ప్రమోషన్లు కరువు!

సహనం వందే, హైదరాబాద్:నర్సింగ్ వృత్తిలో మహిళలకు మాత్రమే అవకాశాలు ఉంటాయనే అపోహను దాటి, ఇప్పుడు పురుషులు కూడా ఈ రంగంలో రాణిస్తున్నారు. అయితే తెలంగాణలో పురుష నర్సులకు ప్రమోషన్లలో తీవ్ర వివక్ష ఎదురవుతోంది. సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి సేవలందిస్తున్నప్పటికీ పాత జీవోల కారణంగా వారికి పదోన్నతులు రావడం లేదు. పాత నిబంధనలను సవరించాలని తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఎదురవుతున్న వివక్ష…2005లో పురుష విద్యార్థులకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పించేలా జీవో 82ను…

Read More

ఫిల్మ్ ఫెడరేషన్ భగ్గు – వేతనాలు పెంచాల్సిందేనని డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:వేతనాలు పెంపు విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రమైంది. రోజుల తరబడి నిరసనలు చేస్తున్న సినీ కార్మికులు, తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు తమ నిరసనను ఉధృతం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే సోమవారం నుంచి అన్ని షూటింగులు బంద్ చేయాలని ఫిల్మ్ ఫెడరేషన్…

Read More

సూటు బూటు… దొంగ ఓటు – ఎన్నికల కమిషన్ అధికారుల లీలలు

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల కమిషన్ లో వాళ్లంతా సీనియర్ ఐఏఎస్ అధికారులు. సూటు బూటు వేసుకొని టై కట్టుకుని గొప్ప ఇంగ్లీషులో మాట్లాడతారు. గొప్ప చదువులు చదివారు కాబట్టి గొప్ప సూక్తులు కూడా చెప్తారు. దేశానికి తామే నిజమైన సేవకులు అన్నట్లు ఫోజులు కొడతారు. కానీ తెర వెనక మాత్రం చీకటి వ్యవహారాలు నడుపుతారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి డబ్బుకు అమ్ముడుపోతారు. స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన ఎన్నికల కమిషన్ ను కొందరు రాజకీయ నేతల వద్ద…

Read More

సూపర్ ఏజర్స్… సోషల్ జర్నీస్ – 90 ఏళ్లు వచ్చినా యూత్ ఐకాన్స్

సహనం వందే, అమెరికా:ఎనభై తొంభై ఏళ్లు వచ్చినా యువకుల్లా మంచి జ్ఞాపకశక్తితో ఉత్సాహంగా జీవిస్తున్న సూపర్ ఏజర్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? సుమారు పాతికేళ్లుగా నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అసాధారణ వృద్ధులపై అనేక అధ్యయనాలు చేశారు. వాళ్ళ తాజా పరిశోధనలో మనసుకు హత్తుకునే నిజాలు వెలుగుచూశాయి. సామాజిక సంబంధాలు, ఉల్లాసమైన మనస్తత్వమే ఈ సూపర్ ఏజర్ల వెనుక ఉన్న రహస్యమని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధాప్యాన్ని ఎలా ఉల్లాసంగా గడపాలో ఈ సూపర్ ఏజర్ల జీవితాలు…

Read More

నిర్మాతల కొర్రీ… కార్మికుల వర్రీ – కొలిక్కిరాని సినిమా కార్మికుల వ్యవహారం

సహనం వందే, హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల జీతాల పెంపు విషయంలో నెలకొన్న వివాదం సద్దుమణగలేదు. వేతనాల పెంపునకు నిర్మాతలు షరతులతో కూడిన ప్రతిపాదనలు ముందుకు తెచ్చినప్పటికీ, కార్మిక సంఘాల నాయకులు వాటిని తిరస్కరించారు. ఫలితంగా ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇకపై తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఫెడరేషన్ నేతలు ప్రకటించారు. నిర్మాతల షరతుల్లోని మెలికలు…నిర్మాతలు శనివారం మీడియా సమావేశంలో వేతనాల పెంపుపై తమ నిర్ణయాలను ప్రకటించారు. రోజుకు 2 వేల రూపాయల…

Read More

సేవా మార్గంలో ‘మణి’ కుమార్ – డాక్టర్లకు ఇస్టా డిజిటల్ మీడియా ద్వారా అవార్డులు

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా జీవితంలో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత చాలా మంది సుఖంగా గడపాలనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం తాము నిలదొక్కుకున్న తర్వాత సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని భావిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఇస్టా డిజిటల్ మీడియా వ్యవస్థాపకుడు మణి కుమార్. బీటెక్ పూర్తి చేసి, విజయవంతమైన మొబైల్ వ్యాపారంతో మంచి ఆదాయం, పేరు సంపాదించిన మణి… కేవలం డబ్బు సంపాదనకు పరిమితం కాకుండా, వైద్యులకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో…

Read More

ఉబర్ రైడ్… ఉమెన్ డేంజర్ – ప్రయాణంలో లైంగిక వేధింపులు

సహనం వందే, న్యూయార్క్:ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్-షేరింగ్ సంస్థ ఉబర్ … తన ప్రయాణీకులకు అత్యంత సురక్షితమైన సేవలు ఇస్తున్నట్లు చెబుతున్నా, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం… 2017-22 మధ్య కాలంలో లక్షలాది మంది ప్రయాణీకులు లైంగిక వేధింపులు, దౌర్జన్యాలకు గురైనట్లు తేలింది. అయినా ఈ సమస్యను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక వేధింపు…న్యూయార్క్ టైమ్స్ ప్రకారం… అమెరికాలో ఉబర్‌లో ప్రయాణిస్తున్న…

Read More

మెడిసిటీ విద్యార్థుల ‘మత్తు’ బిజినెస్ – దిక్కులు చూస్తున్న ప్రైవేట్ యాజమాన్యం

సహనం వందే, హైదరాబాద్:మేడ్చల్‌ మెడిసిటీ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యార్థులే గంజాయి బిజినెస్ చేస్తున్నారు. మూడేళ్లుగా కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థులు గంజాయిని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని హైదరాబాద్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రగ్స్‌పై ఈగల్‌ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో మెడిసిటీ వైద్య విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ టెస్టులో గంజాయి పాజిటివ్‌ వచ్చిన పలువురు విద్యార్థుల్ని డీ-అడిక్షన్‌ సెంటర్‌కు పంపించారు. సీనియర్‌ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేశారని,…

Read More