‘పదవులు మీకే… పైసలు మీకేనా’ – రేవంత్‌ రెడ్డి పై రగులుతున్న కోమటిరెడ్డి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్‌లో మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇస్తారనే హామీని విస్మరించడం, నియోజకవర్గానికి నిధులు రాకపోవడంపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనతో మాట్లాడాలని నిర్ణయించినప్పటికీ, రాజగోపాల్‌రెడ్డి తన దండయాత్రను ఆపడం లేదు. మంత్రి పదవి వివాదం.. విభేదాలకు కారణంరాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరే…

Read More

బెంగాల్ ‘టైగర్’తో ‘అగ్ని’హోత్రి – ‘బెంగాల్ ఫైల్స్’ కు సీఎం మమత ఝలక్

సహనం వందే, కోల్‌కతా:ప్రముఖ వివాదాస్పద దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కోల్‌కతాలో ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. తన తాజా చిత్రం ‘బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించగా అక్కడి పోలీసులు, థియేటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బెంగాల్ ముఖ్యమంత్రి టైగర్ మమతతో పెట్టుకోవడం అంత సులభం కాదని మరోసారి రుజువైంది. అగ్నిహోత్రి తన సినిమాలతో అగ్గి రాజేయడం అలవాటే కాబట్టి, బెంగాల్‌లో కూడా అదే జరుగుతుందని ఊహించవచ్చు. వివాదాస్పద సినిమాలు…వివేక్ అగ్నిహోత్రి గతంలో కశ్మీర్…

Read More

సరోగసి కేసులో 7 ఆస్పత్రులకు నోటీసులు

సహనం వందే, హైదరాబాద్:మేడ్చల్‌ సరోగసి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఏడు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డి పలు ఆస్పత్రులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు గుర్తించారు. సరోగసి ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సహకరించినట్లు అనుమానిస్తున్న హెగ్డే హాస్పిటల్, లక్స్ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవీఎఫ్ సెంటర్, ఫర్టి కేర్, శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య…

Read More

ధర్మస్థల సమాధుల్లో ఘోషిస్తున్న ఆత్మలు – 90 శాతం మంది మహిళలు…

సహనం వందే, బెంగళూరు:సహజంగా ధర్మస్థల అనే పదం ఎంతో సాత్వికంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పదం మారణకాండకు పర్యాయపదంగా గోచరిస్తుంది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల సామూహిక సమాధుల కేసు అంతర్జాతీయంగానే పెద్ద దుమారం రేపుతోంది. ఈ కేసులో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దశాబ్దాలుగా ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఒకరు ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు బయటపెట్టాడు. ఆలయ ఆదేశాలతో వందలాది సమాధులు…తాను, తన బృందం…

Read More

రాపిడో ‘ఓన్లీ’ ఫుడ్ డెలివరీ – స్విగ్గీ, జొమాటోలకు సరికొత్త సవాల్

సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో రైడ్-హెయిలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన రాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి దూసుకువచ్చింది. ‘ఓన్లీ’ (Ownly) అనే కొత్త యాప్‌తో స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ యాప్ సరసమైన ధరల్లో భోజనం అందించడం ద్వారా వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాపిడో ఈ కొత్త అడుగుతో భారతీయ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించనుంది. తక్కువ ధరలో రుచికరమైన భోజనం…రాపిడో…

Read More

బీపీ కొత్త లెక్కల షాకింగ్ – అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త గైడ్ లైన్స్

సహనం వందే, న్యూయార్క్:అధిక రక్తపోటును నియంత్రించడానికి కొత్త మార్గదర్శకాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కలిసి శుక్రవారం విడుదల చేశాయి. 2017 తర్వాత వచ్చిన ఈ తాజా సూచనలు, రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు, మధుమేహం, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి వాటిని నివారించవచ్చని స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త నియమాలు పాతవాటి కంటే చాలా కఠినంగా ఉండడమే కాకుండా, మద్యం వినియోగాన్ని పూర్తిగా మానేయాలని సిఫారసు చేస్తున్నాయి….

Read More

ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో 81% ఫెయిల్ – విదేశీ వైద్య విద్య డొల్ల…

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు భారతదేశంలో వైద్య వృత్తి కొనసాగించేందుకు నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) ఫలితాల్లో విద్యార్థులు బొక్క బోర్లా పడ్డారు. ఈ ఏడాది జూన్ నెలలో నిర్వహించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 81 శాతం మంది ఫెయిల్ కావడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి (ఎన్‌బీఈఎంఎస్) ప్రకటించిన ఫలితాల ప్రకారం 37,207 మంది ఈ పరీక్షకు హాజరైనప్పటికీ, కేవలం…

Read More

‘హైడ్రా’పై అవాస్తవాల దాడి – పుకార్లను నమ్మవద్దు

సహనం వందే, హైదరాబాద్:హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. కొందరు కావాలనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా, లేనిపోని అంశాలను హైడ్రాకు ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. అయినా హైడ్రా ఇవేవీ పట్టించుకోకుండా ప్రజలకు మంచి చేయడానికే కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణతో కూడిన నగర నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆరు చెరువులను అభివృద్ధి చేసింది. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. ఈ పనులను కేంద్ర బృందాలు కూడా సందర్శించి…

Read More

‘వార్’లో గెలిచిన ‘కూలీ’ – బాక్సాఫీస్ యుద్ధంలో బాషా విజయం

సహనం వందే, సినీ బ్యూరో హైదరాబాద్:భారతీయ సినీ చరిత్రలో ఇండిపెండెన్స్ డే వీక్‌లో జరిగిన బాక్సాఫీస్ యుద్ధం అభిమానులకు పండగలా మారింది. ఒకవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ యాక్షన్ చిత్రం కూలీ, మరోవైపు యువ సంచలనం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన స్పై థ్రిల్లర్ వార్ 2… ఈ రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో హైప్ మధ్య విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలలో కూలీదే పై చేయిగా కనిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్… లోకేశ్…

Read More

ఎన్టీఆర్ విలన్… చివరికి హీరో

(రేటింగ్: 2.5/5) సహనం వందే, హైదరాబాద్:వార్-2 సినిమా మొదటి గంట సూపర్ గా ఉంది. హృతిక్ రోషన్ యాక్షన్ ఎక్సలెంట్. సినిమా మొదలైన అర గంటకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన యాక్షన్ తో సినిమా హాల్లో కేక పుట్టించాడు. ఒక మనిషి ఇగోను కెలికితే ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఎన్టీఆర్ డైలాగ్ బాగుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ విలన్ అని అర్థం అవుతుంది. రా ఇంటిలిజెన్స్ వ్యవస్థలో ఉంటూ గ్యాంగ్ స్టర్లకు…

Read More