అప్పలనాయుడు… గిరిజన గుండెచప్పుడు – ఏజెన్సీలో విజయనగరం ఎంపీ పల్లెనిద్ర

సహనం వందే, విజయనగరం:విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గిరిజనుల మనసు గెలుచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో గిరిజన పల్లెల్లో రాత్రి బస చేశారు. తన జిల్లాలో పల్లెనిద్ర చేసిన మొదటి ఎంపీగా చరిత్రకెక్కారు. ఆయన కేవలం రాత్రి గడపడం మాత్రమే కాదు, పల్లెనిద్ర తర్వాత పొద్దున్నే లుంగీ కట్టుకుని పొలాల గట్లపై నడుస్తూ రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆయన సాధారణ జీవనశైలి గిరిజనులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పలనాయుడు… మాస్ లీడర్రాజకీయ హోదా, అధికారిక…

Read More

మోడీకి ఎంపీ కలిశెట్టి బర్త్ డే గిఫ్ట్ – ప్రధాని జన్మదినం సందర్భంగా పల్లెనిద్ర

సహనం వందే, విజయనగరం:ప్రధాని మోడీకి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ అంటే అదేదో వస్తువు అనుకునేరు. తన పుట్టినరోజు సందర్భంగా మోడీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గిరిజన గ్రామంలో ప్రత్యేకంగా పర్యటించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఎంపీ అప్పలనాయుడు ఒక గిరిజన గ్రామంలో బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు.ఆ తర్వాత గురువారం ఉదయం లుంగీ మీద పొలాల గట్లపై తిరుగుతూ రైతులతో సంభాషించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత…

Read More

యాపిల్ ‘ఎయిర్’… క్వాలిటీ ఫెయిల్ – అందమైన ఐఫోన్… కొన్నారో పరేషాన్

సహనం వందే, హైదరాబాద్:యాపిల్ సంస్థ ప్రతీ ఏటా కొత్త ఐఫోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. అంతకుముందు వెర్షన్లలో కొన్ని మార్పులు, కెమెరా అప్డేట్స్ వంటి వాటితోనే చాలావరకు సరిపెడుతుంది. కానీ ఈసారి అలా కాకుండా అత్యంత సన్నని డిజైన్‌తో కూడిన ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంది. ఇంత సన్నగా ఉండడం వల్లే ఎయిర్ మోడల్ గురించి చాలామంది ఆసక్తిగా అడుగుతున్నారు. మెరిసే టైటానియం ఫ్రేమ్,…

Read More

బెనిఫిట్ షో టికెట్ రూ. వెయ్యి – ధరల పెంపుతో ఓజీకి మార్గం సుగమం!

సహనం వందే, విజయవాడ:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షో , ఐదు రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనూహ్యంగా అనుమతులు లభించాయి. సాధారణంగా సినిమా టికెట్ల ధరల పెంపుపై అడ్డుకట్ట వేసిన గత ప్రభుత్వం… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే నిబంధనలను సడలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెనుక సినిమా పరిశ్రమ లాభాపేక్ష కంటే అధికార కూటమిలోని ఒక కీలక వ్యక్తి…

Read More

జెన్ జెడ్ గుండెల్లో జ్వాల – అవినీతి, అక్రమాలపై ఈ చిహ్నం బ్రహ్మాస్త్రం

సహనం వందే, న్యూఢిల్లీ:ఆసియా యువతరం తమ గొంతుకను వినిపించడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అది ఏ ఆయుధం కాదు, ఒక ప్రత్యేకమైన జెండా కాదు, కేవలం ఒక గుర్తు. ఇది వన్ పీస్ అనే జపాన్ మాంగాలో లూఫీ అనే కథానాయకుడి ట్రేడ్‌మార్క్ అయిన గడ్డితో అల్లిన టోపీ గుర్తు. ఇండోనేషియా, నేపాల్‌తో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు ఆసియా మొత్తం విస్తరించింది. అవినీతి, ప్రభుత్వ దమనకాండ, నిరంకుశత్వం, సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ఇది ఒక శక్తిమంతమైన…

Read More

తాత్కాలిక బదిలీల తిరకాసు – ఉద్యోగుల బదిలీలకు కఠిన నిబంధనలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లపై జారీ చేసిన మార్గదర్శకాలపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కన్నా నిరాశనే మిగుల్చుతోంది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు అంశాలు ఉద్యోగుల ఆశలకు అడ్డుకట్ట వేసినట్లు స్పష్టమవుతోంది. కఠినమైన అర్హతా నిబంధనలు, పరిమిత కాలపరిమితి, ఆర్థిక ప్రయోజనాల లేమి వంటివి ఉద్యోగుల మధ్య అసంతృప్తిని పెంచుతున్నాయి. అర్హత కన్నా అనర్హతలే ఎక్కువ…ప్రభుత్వం తాత్కాలిక బదిలీల కోసం…

Read More

హుస్సేన్‌సాగర్ నీటిపై క్రికెట్ స్టేడియం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి మరిన్ని కొత్త హంగులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్‌సాగర్‌ నీటిపై ఫ్లోటింగ్ గ్రౌండ్స్ (తేలియాడే మైదానాలు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీంతో పర్యాటక రంగం మరింత పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ వాసులు నీటిపైనే ఫుట్‌బాల్, బాక్స్ క్రికెట్ వంటి క్రీడలు ఆడుకునే అరుదైన అవకాశం దక్కుతుంది. ఇప్పటివరకు ఇలాంటివి సింగపూర్ వంటి విదేశాల్లోనే…

Read More

ఆన్‌లైన్ డెత్ గేమ్‌ – ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య

సహనం వందే, లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆన్‌లైన్‌ గేమ్‌ 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్రీ ఫైర్‌ గేమ్‌లో ఏకంగా రూ.13 లక్షలు పోగొట్టుకున్న ఆరో తరగతి విద్యార్థి యశ్‌ కుమార్‌… తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అతని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. మైనర్‌ పిల్లలు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో ఎలా పడిపోతున్నారో దీని ద్వారా మరోసారి రుజువైంది. ఫ్రీ ఫైర్‌ వంటి గేమ్‌లు పిల్లలను ఆకర్షించి, డబ్బులు ఖర్చు చేయమని ప్రేరేపిస్తున్నాయని…

Read More

పేదల వైద్యంపై పిడుగు – ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్ పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2500 కోట్లు, తెలంగాణలో రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవలను నిలిపివేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్టీఆర్ పథకం కింద ఉన్న ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం… పేదలకు శాపంప్రైవేటు ఆస్పత్రులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస స్పందన చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో…

Read More

భారత మగాళ్లకు అమెరికాలో డిమాండ్ – ఇండియన్ భర్త కోసం ఒక మహిళ ప్రయత్నం

సహనం వందే, అమెరికా:న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచానికి కేంద్ర బిందువు లాంటిది. అక్కడ విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ప్రజలు కనిపిస్తుంటారు. అలాంటి చోట ఒక అమెరికన్ మహిళ ‘భారతీయ భర్త కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డుతో నిలబడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధునిక కాలంలో డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్రేమ వ్యవహారాలకు వేదికగా మారుతున్నప్పుడు… ఆ మహిళ పాత పద్ధతిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది….

Read More