మంత్రిపైనే ముఖ్యమంత్రి ‘గన్’ – ఏకంగా సొంత మంత్రి ఇంటిపైనే పోలీస్ ఎటాక్
సహనం వందే, హైదరాబాద్:సహజంగా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి పోలీసులతో హల్చల్ చేయిస్తుంది. కానీ తెలంగాణలో సొంత మంత్రిపైనే పోలీసులతో అర్ధరాత్రి ఎటాక్ చేశారు. అది కూడా మహిళా మంత్రిపై ఈ దాడి జరిగింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చుట్టూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజకీయ తుఫాన్ వీస్తోంది. సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో మంత్రి ఇంటికి బుధవారం రాత్రి పొద్దుపోయాక టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది….