ముస్లిం ఓట్లు… బీజేపీకి సీట్లు – బిహార్ ఎన్నికల్లో ఓవైసీ శిఖండి పాత్ర

సహనం వందే, పాట్నా:బిహార్ ఎన్నికల రాజకీయాలు అసదుద్దీన్ ఓవైసీ వ్యూహంతో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోని మహాకూటమి ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం పోటీ పడడం పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చే అవకాశం కలిగించింది. మహాకూటమి ప్రధానంగా ఆధారపడిన ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారానే ఈ ప్రమాదం ఏర్పడుతోంది. 2020 ఎన్నికల్లో ఎంఐఎం పోటీ వల్ల ఐదు సీట్లు కోల్పోయిన మహాకూటమి… ఇప్పుడు 64 సీట్లకు…

Read More

లైక్ చేస్తే లూటీ – 30,000 మంది… రూ. 1,500 కోట్లు లూటీ

సహనం వందే, హైదరాబాద్:డిజిటల్‌ ప్రపంచంలో చిన్న లైక్‌ కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో సుమిత్ కుమార్ ఉదంతం నిరూపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చెఫ్ సుమిత్… ఒక ఆర్థిక సలహాదారు వీడియోకు లైక్ కొట్టగానే పది నిమిషాల్లోనే వాట్సాప్ సందేశం వచ్చింది. పెట్టుబడి కోసం ఎర వేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంత వేగంగా పకడ్బందీగా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ సభ్యులతో లాభాల ఊసేత్తుతూ తమ వలలో చిక్కుకున్న వ్యక్తికి ఆశ…

Read More

బీసీ బ్రాండ్… కృష్ణయ్య బౌండ్ – ఒక ఉద్యమకారుడి ఆవేదనతో కూడిన లేఖ

సహనం వందే, హైదరాబాద్:బీసీల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ దిక్సూచి ఆర్. కృష్ణయ్య ప్రస్తుత రాజకీయ ప్రస్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ అనే ఉద్యమకారుడు కృష్ణయ్యకు రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అగ్గి రాజేస్తోంది. గత చరిత్రను నెమరువేస్తూనే అపారమైన బీసీ నాయకుడి ఇమేజ్‌కు ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు ఏమాత్రం సరితూగవని ఆ లేఖ నిలదీసింది. రాజకీయ పక్షాలు బీసీ ఉద్యమాన్ని…

Read More

రక్తం చిందిన ‘కర్మ’ బంధం – నేను… తను… శూన్యం

కష్టమే శాశ్వతం… సమాజపు చిన్నచూపుజీవితం అనేది అనేక అనుభవాల రైలు ప్రయాణం లాంటిది. సుఖం అనేది కంటికి కనిపించని అందమైన దేవతా వస్త్రం లాంటిది. అది ఉన్నట్టే ఉంటుంది కానీ ఎక్కువ కాలం మనతో కొనసాగదు. కానీ కష్టం అనేది నిరంతరం మనల్ని వెంటాడుతుంది. కొందరు కొన్ని సమయాల్లో ఆప్తులుగా ఉన్నట్టే కనిపిస్తారు. కానీ కష్టం వస్తే ఎవరూ దొరకరు. మాస్టర్‌ డిగ్రీ చదివి బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఏరికోరి కుడిచేయి లేని దివ్యాంగురాలిని నేను పెళ్లి…

Read More

సెకండ్ హ్యాండ్ సినిమా సేల్ – పాత సినిమాల విడుదలపై ప్రేక్షకుల అసహనం

సహనం వందే, హైదరాబాద్:తెలుగు సినిమా రంగంలో రీ రిలీజ్ పరంపర ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ప్రేక్షకులను ఆకర్షించడం కాదు… అక్షరాలా దోచుకోవడమే! ఇప్పటికే ఓటీటీ వేదికల్లో ఉచితంగా అందుబాటులో ఉన్న కమర్షియల్ మసాలా సినిమాలకు ప్రేక్షకుడు మళ్ళీ టికెట్ కొని థియేటర్లకు వెళ్లాల్సి రావడం ఏంటి? సందేశాత్మక చిత్రాలు కావు. సామాజిక సమస్యలపై తీసినవి కావు. కేవలం పాత ఫార్ములా సినిమాలు. కానీ డబ్బు ఆర్జనకు మాత్రం సినీ పెద్దలు ఏ చిన్న అవకాశాన్నీ…

Read More

ఏఐ ఉండగా డాక్టర్ దండగ – తీరికలేని మానవ వైద్యులతో రోగుల ఇబ్బంది

సహనం వందే, న్యూయార్క్:ఆసుపత్రికి వెళితే డాక్టర్ ఉంటారో లేదో తెలియదు… ఎప్పుడు వస్తారో తెలియదు… ఒకవేళ ఉన్నా బిజీ బిజీగా ఉంటారు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ అంటూ వెళతారు. దీంతో రోగులు గంటల తరబడి డాక్టర్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఫలితంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు. ఇక కొన్ని ఆసుపత్రుల్లోనైతే డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రోగులందరినీ సకాలంలో చూసే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఏఐ యుగం నడుస్తుంది. ఏఐ చాట్…

Read More

ఉగ్రమరణం స్వర్గలోకం – మసూద్ ఆధ్వర్యంలో మహిళా జిహాదీ బ్రిగేడ్‌

సహనం వందే, న్యూఢిల్లీ:భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ నడ్డి విరిగినా ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కొత్త కుట్రకు తెర లేపాడు. తన ఉగ్ర ఎజెండాను కొనసాగించేందుకు ఏకంగా మహిళలనే జిహాదీ బ్రిగేడ్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బహవల్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ వ్యూహం రూపొందుతోంది. పాకిస్తాన్ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా ఈ ప్రమాదకర కుట్ర చేయడం అసాధ్యం. నిషేధించిన సంస్థలంటూ పదే పదే ప్రపంచానికి…

Read More

విదేశీ గడ్డపై ఫుడ్డు కోసం గడ్డి – స్విట్జర్లాండ్ లో భారతీయ పర్యాటకుడి కక్కుర్తి

సహనం వందే, స్విట్జర్లాండ్:స్విట్జర్లాండ్‌ హోటళ్ల వద్ద కొందరు భారతీయ పర్యాటకులు ప్రదర్శిస్తున్న చవకబారు బుద్ధి యావత్ దేశాన్ని తలదించుకునేలా చేస్తోంది. జ్యూరిచ్‌లోని ఓ హోటల్ బ్రేక్‌ఫాస్ట్ బఫేలో ఢిల్లీకి చెందిన ఒక కుటుంబం చేసిన పనిని అక్కడే ఉన్న ఓ భారతీయ వ్యక్తి కళ్లారా చూసి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం హోటల్‌కి ఖాళీ బాక్సులు తీసుకువచ్చి అందులో పండ్లు, ఉడికించిన గుడ్లు, పెరుగు వంటి వాటిని నింపుకొని వెళ్లిపోయింది. హోటల్ ప్రవేశ…

Read More

క్రికెట్ బాల్… క్యాబినెట్ ‘గోల్’ – నేడు స్టార్ క్రికెటర్ అజహర్ ప్రమాణ స్వీకారం

సహనం వందే, హైదరాబాద్:భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గ్రేస్‌ఫుల్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నారు. శుక్రవారం (నేడు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ పిచ్‌లపై మాయ చేసిన ఈ సెలబ్రిటీ ఇప్పుడు పరిపాలనలోకి అడుగు పెట్టడం రాష్ట్ర రాజకీయాలకు గ్లామర్ టచ్ ఇస్తోంది. ముస్లిం మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలనే కాంగ్రెస్ వ్యూహంలో…

Read More

భర్త ట్రాప్… ఫ్రెండ్స్ రేప్ – భార్యపై 51 మంది స్నేహితుల అత్యాచారం

సహనం వందే, ఫ్రాన్స్:ఒక మారుమూల గ్రామంలో బాహ్య ప్రపంచానికి ఆదర్శవంతమైన కుటుంబంగా కనిపించిన ఓ ఇంటిలో దాగిన దారుణ రహస్యం ఫ్రాన్స్‌లోని వ్యవస్థనే కుదిపేసింది. గిసెలె పెలికాట్ అనే 72 ఏళ్ల సాధారణ మహిళ..‌. తొమ్మిది సంవత్సరాల పాటు తన భర్త డొమినిక్ పెలికాట్ చేసిన అమానుషానికి బాధితురాలైంది. తన భోజనంలో, కాఫీలో తీవ్రమైన మత్తు మందులు కలిపి అపస్మారక స్థితిలోకి నెట్టి… ఆమె అనుమతి లేకుండా 51 మంది దుర్మార్గులతో అత్యాచారం చేయించిన ఆ ద్రోహం…

Read More