లీవ్ అడిగితే లెక్చర్- ఆఫీసుల్లో బాసుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఒక రెడిట్ పోస్ట్ ఇప్పుడు భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో అగ్గి రాజేసింది. అత్యవసరం అని లీవ్ అడిగితే… జపాన్ మేనేజర్ ఆప్యాయంగా పలకరించి జాగ్రత్తగా ఇంటికి వెళ్లు అంటూ ప్రేమగా సెలవు మంజూరు చేశాడు. కానీ మన భారతీయ బాస్ ఎలా స్పందించారో తెలుసా? ‘నువ్వు ఎక్కువగా సెలవులు పెడుతున్నావు. నీ పని తీరుపై మేనేజ్మెంట్ అసంతృప్తితో ఉంది. సరేలే కానీ ఈసారికి సెలవు ఆమోదించాను… అయితే ఫోన్లో, మెయిల్‌లో అందుబాటులో ఉండు’ అని…

Read More

ఆకలిపై షాట్… షుగర్ ఔట్ – బరువుపై అమెరికా ఫార్మా కంపెనీ బ్రహ్మాస్తం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో కోరలు చాస్తున్న డయాబెటిస్, అధిక బరువు సమస్యలకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా నుంచి ఓ కొత్త అస్త్రం వచ్చింది. అదే… మౌంజారో! అమెరికన్ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన ఈ ఇంజెక్షన్… మన దేశంలో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే రూ.100 కోట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. కేవలం డయాబెటిస్ నియంత్రణకే కాదు… బరువు తగ్గించడంలోనూ అద్భుతాలు చేస్తూ దేశ ఫార్మా మార్కెట్‌లో రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. డయాబెటిస్…

Read More

క్రికెట్ క్వీన్స్… నేషన్ రన్స్ – ప్రపంచ కప్ తో పెరిగిన మహిళా క్రికెట్‌ క్రేజ్

సహనం వందే, న్యూఢిల్లీ:భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం ఒక స్ఫూర్తి తరంగం. ఈ నెల మొదటి వారంలో మహిళా జట్టు కప్పు కొట్టిన క్షణం దేశవ్యాప్తంగా లక్షలాది బాలికలను మైదానాల్లోకి పరిగెత్తించింది. గత కొన్నేళ్లుగా ఆడవాళ్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం రెట్టింపు అవుతోంది. చిన్న చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు ఎక్కడ చూసినా బ్యాట్ పట్టిన ఆడపిల్లలే కనిపిస్తున్నారు. ఈ క్రీడా విప్లవం…

Read More

కటిక నేలపై అప్పల’నాయకుడు’ – పుట్టినరోజు రాత్రి హాస్టల్లో నిద్ర

సహనం వందే, విజయనగరం:విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన జన్మదిన వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకుని ఆదర్శంగా నిలిచారు. ఆర్భాటం, ఆడంబరాలకు దూరంగా ఉన్నారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్లలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. వారితో పాటు భోజనం చేశారు. అంతేకాక రాత్రి విద్యార్థుల కటిక నేలపైనే నిద్రించడం విశేషం. సేవను ఒక పండుగగా భావిస్తూ పిల్లల నవ్వుల్లో…

Read More

దళిత్ రాక్స్… బీహార్ షేక్స్! – బీ’హోర్’లో ఓటింగ్ సునామీ!

సహనం వందే, పాట్నా:మొదటి దశ పోలింగ్ సందర్భంగా బీహారులో పల్లెల నుంచి పట్నాల వరకు ఒక అద్భుతం జరిగింది. ఏడు దశాబ్దాల బీహార్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. సాయంత్రం చివరి బ్యాలెట్ పడే సమయానికి మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 64.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది బీహార్ చరిత్రలోనే అత్యధిక శాతం. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని 2020 పోలింగ్‌తో పోల్చి చూసినప్పుడు… మొదటి…

Read More

‘నంబర్ వన్‌’ భ్రమ – నెంబర్ కేవలం సమాజం సృష్టించినదే

సహనం వందే, హైదరాబాద్:ప్రతిచోటా నంబర్ వన్‌ గా ఉండాలి. ఉద్యోగంలో టాప్ ప్లేస్‌లో… ఇంట్లో అప్యాయమైన తల్లిగా… భార్యగా… ఇలా అన్ని పాత్రల్లో నూటికి నూరు శాతం అద్భుతంగా ఉండాలనే లక్షణం ఈ తరం మహిళలకు పెద్ద భారంగా మారింది. ఈ ఒత్తిడి పతాక స్థాయికి చేరి చివరికి ఏం చేస్తుందో తెలుసా? రచయిత్రి అమండా గోయెట్జ్ జీవితంలో జరిగిన విషాదమే ఉదాహరణ. అన్నింటా సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలని పరుగులు తీసిన ఆమె… ఒక రోజు తీవ్రమైన…

Read More

రక్తం కోరిన రాజ్యం – సుడాన్‌ను గడగడలాడిస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్

సహనం వందే, సుడాన్:సుడాన్‌ను గడగడలాడిస్తున్న పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) క్రూరత్వం మరోసారి ప్రపంచానికి బహిర్గతమైంది. గత నెలలో ఎల్‌-ఫాషర్ నగరంలో జరిగిన భయంకరమైన మారణకాండ వివరాలను అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఈ దాడిలో 2 వేల మందికి పైగా పౌరులు చనిపోయి ఉండవచ్చని అంచనా. ‘చూడండి… ఇదే మా పని… ఇదే జెనోసైడ్’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ ఫైటర్లు తొమ్మిది శవాల పక్కనుంచి వెళ్తూ ఉల్లాసంగా నవ్వుతూ వీడియోలు తీయడం వారి కర్కశత్వానికి పరాకాష్ట. యుద్ధ…

Read More

మా ‘కంత్రి’ కుటుంబం – మాగంటి మృతిపై అతని తల్లి సంచలనం

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్న తరుణంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె కుటుంబం నుంచే బిగ్ షాక్ తగిలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వంపై కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం చుట్టూ ముసలం ముదిరి అది ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. ఉపఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే రెవెన్యూ అధికారుల విచారణకు ఈ వివాదం దారితీయడం బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన నింపుతోంది. మాగంటి కుటుంబంలోని ఈ కలహాల ప్రభావం ఈ…

Read More

‘జుకర్’ జూదం… లక్ష కోట్ల మోసం – ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మోసపు ప్రకటనలు

సహనం వందే, హైదరాబాద్:మెటా అధినేత జుకర్ బర్గ్ ప్రపంచాన్ని లూటీ చేస్తున్నాడు. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సోషల్ మీడియాల్లో మోసపూరిత ప్రకటనలను అనుమతించడం ద్వారా ఏడాదికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు రహస్య నివేదికల ద్వారా వెల్లడైంది. ఈ ప్రకటనలు నకిలీ ఇ-కామర్స్ పథకాలు, అక్రమ పెట్టుబడి స్కీములు, అక్రమ ఆన్‌లైన్ కేసినోలు, నిషేధిత వైద్య ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించినవి. అత్యంత విశ్వసనీయ నివేదికల ప్రకారం… 2024 నాటికి మెటా తన మొత్తం వార్షిక ఆదాయంలో…

Read More

లెఫ్ట్ జోరు… రైట్ బేజారు – న్యూయార్క్ మేయర్ ఎన్నికలతో జోష్

సహనం వందే, యూరప్:అమెరికాలో… ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి పట్టుకొమ్మగా భావించే న్యూయార్క్ నగర మేయర్ రేసులో జోహ్రాన్ మామ్దాని విజయం సాధించడం ఐరోపా అంతటా లెఫ్ట్ వింగ్ పార్టీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కేవలం 34 ఏళ్ల వయసులోనే ప్రజాస్వామ్య సోషలిస్ట్ గా ప్రకటించుకున్న మామ్దాని… అద్దెల నియంత్రణ, ధనవంతులపై పన్ను విధిస్తాననే వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షించారు. ఆయన వాదనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ విజయం తమ దేశాలలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న రైట్…

Read More