ఎన్నికల సంఘంతో కాంగ్రెస్ పోరాటం – వచ్చే నెల ఢిల్లీలో భారీ ర్యాలీ

సహనం వందే, న్యూఢిల్లీ:బీహార్ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర అంతర్మధనంలో ఉండిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం నిర్వాకమేనని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సంగతి తేల్చాలని… పాలక పక్షం పట్ల అది వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా వచ్చే నెల…

Read More

ఏఐని నమ్మితే నట్టేటే – సుందర్ పిచాయ్ షాకింగ్ కామెంట్స్

సహనం వందే, అమెరికా:ఏఐ విప్లవం ప్రపంచాన్ని చుట్టేస్తుంటే… గూగుల్ అధిపతి సుందర్ పిచాయ్ మాత్రం దాన్ని అంతగా నమ్మొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెర పరిచాయి. ‘ఏఐ అందించే సమాచారాన్ని కళ్లు మూసుకుని నమ్మొద్దు’ అని ఆయన వినియోగదారులకు సూచించడంపై టెక్నాలజీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ వ్యవస్థలు ఇప్పటికీ తప్పులు చేస్తున్నాయని… వాటిని కేవలం ఒక సమాచార వనరుగా మాత్రమే పరిగణించాలని గూగుల్ సీఈఓ పిచాయ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఏఐపైనే…

Read More

‘బొమ్మ’కు బ్రేక్… హీరోల ఖుష్ – ఐ బొమ్మ మూసివేతతో పైరసీ ముగిసినట్టేనా?

సహనం వందే, హైదరాబాద్:సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి రెండు కంపెనీలకు సీఈఓ స్థాయికి ఎదిగిన ఓ యువ మేధావి… చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆయనే ఐ బొమ్మ, బప్పం వంటి పైరసీ సైట్లకు సూత్రధారి ఇమ్మడి రవి. తన కంప్యూటర్ టెక్నాలజీ నైపుణ్యాన్ని సరైన మార్గంలో కాకుండా సినిమా పరిశ్రమను నాశనం చేసే పైరసీ దారికి మళ్లించాడు. రవి టెక్నాలజీ నైపుణ్యం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. అతనిని జైలుకు పంపించడంతో…

Read More

40 ఏళ్లు… 30తో వెళ్ళు – దక్షిణ కొరియాకు విదేశీ మహిళల క్యూ

సహనం వందే, సియోల్:ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మహిళలు ఇప్పుడు యవ్వనం కోసం దక్షిణ కొరియాకు పరుగెడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి గంగ్నాం ప్రాంతం బ్యూటీ టూరిజంకి కేంద్రంగా మారింది. అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాల నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నారు. కేవలం ముఖానికి మాత్రమే కాకుండా వెల్ ఏజింగ్ అనే సరికొత్త పద్ధతితో వయస్సు తక్కువ కనిపించేలా తయారు కావడం… వృద్ధాప్యాన్ని జయించడమే వారి ప్రధాన ఉద్దేశం. అమెరికాలో ఇలాంటి ఆధునాతన చికిత్సలు లేకపోవడం… ఇక్కడ ధరలు చాలా…

Read More

ల్యాబ్ పా’పాలు’… కృత్రిమ పాలు తయారు చేస్తున్న కంపెనీలు

సహనం వందే, అమెరికా:పాల పరిశ్రమను కుదిపేసే కొత్త విధానం ఒకటి అమెరికాలో మొదలైంది. ల్యాబ్లో కణాలతో పాలు తయారు చేస్తున్నారు. వీటిని నిజమైన పాలే అని శాస్త్రవేత్తలు చెబుతున్నా ఆరోగ్యం దృష్ట్యా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఆవు గడ్డి తిని, జీర్ణం చేసుకొని ఇచ్చే పాలలో ఉండే పోషకాలు… కృత్రిమంగా తయారైన ల్యాబ్ పాలల్లో ఉండవని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆవు పాలు తాగితే శరీరం బలపడుతుంది… కానీ ల్యాబ్ పాలు తాగితే ఏమవుతుందో ఎవరూ ఖచ్చితంగా…

Read More

వ్యూహం లేక మహా’ఓటమి’ – బీ’హోర్’లో ఆర్జేడీ, కాంగ్రెస్ బలహీన పోరాటం

సహనం వందే, పాట్నా:గెలుపులో వ్యూహాలు మాత్రమే ఉంటాయి. వీటిని వదిలేసి మిగిలిన విషయాలు ఎంత చెప్పుకున్నా వృధానే. ఎన్నికల సంగ్రామంలో వ్యూహం లేకపోతే విజయం దక్కదని అందరికీ తెలుసు. కానీ బీహార్ మహా కూటమి నేతలకు మాత్రం ఇది బుర్రకెక్కలేదు. ఓట్ల చోరీ… ఇతర పార్టీల ఓట్ల చీలిక వల్ల ఓడిపోయామని చెప్పుకుంటున్నప్పటికీ… అవతలిపక్షం వాళ్లకి అవన్నీ వ్యూహాల కిందే లెక్క. ఆ వ్యూహంలో భాగంగానే ఎన్డీఏ నాయకులు విజయం కోసం అస్త్రశస్త్రాలు సంధించారు. దీంతో బీహార్…

Read More

ఆంధ్రప్రదేశ్ ‘ముఖ్య’-మంత్రి – ప్రభుత్వంలో లోకేష్ నామజపం

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు మంత్రి లోకేష్ హవా నడుస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్నిచోట్లా లోకేష్ చక్రం తిప్పుతున్నారు. అంతేకాదు పార్టీ ఎంపీలను తనతో పాటు బీహార్ కు తీసుకువెళ్లి ఎన్డీఏ కూటమికి ప్రచారం కూడా చేసి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ పైన కూడా లోకేష్ పట్టు సాధిస్తున్నారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో…

Read More

అడుగు ‘గుండె’నడుగు – గుండె ఆరోగ్యానికి సింగిల్ డోస్ నడక బెస్ట్

సహనం వందే, హైదరాబాద్:ప్రతిరోజూ ఉదయం అడుగులు లెక్కపెడుతున్నారా? పది వేల అడుగులు దాటాయా లేదా అని ఫోన్లలో పదే పదే చూసుకుంటున్నారా? అయితే మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కాలంటే మీరు నడిచే విధానం మారాలి. కేవలం అడుగుల సంఖ్య పెరిగితే చాలదు… మీరు నడిచే తీరు ఆరోగ్యానికి కీలకం. ఇన్నాళ్లుగా అడుగులు లెక్కపెట్టిన మనం… ఇప్పుడు ఆ అడుగులను ఎలా వేస్తున్నాం అన్న దానిపై దృష్టి పెట్టాలని తాజా అంతర్జాతీయ పరిశోధన కరాఖండిగా తేల్చి చెప్పింది….

Read More

జగన్ దారి తేజస్వి బికారి – ఆంధ్రప్రదేశ్ వైసీపీ పరిస్థితి బీహార్ లో రిపీట్

సహనం వందే, పాట్నా:రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రజల తీర్పు ఊహించని విధంగా ఉంటుంది. అభిమానం పీక్స్ కు చేరితే ఎన్నికల ఫలితం ‘వార్ వన్ సైడ్’ వలే మారిపోతుంది. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి తగిలిన గట్టి షాక్‌ ఇప్పుడు బీహార్‌లో రిపీట్ అయ్యింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్… ఎన్డీఏ కూటమి ధాటికి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సరిగ్గా అలాంటి తీర్పు ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని…

Read More

ది గర్ల్‌’ట్రెండ్’ – హీరోల హవాకు తెర… హీరోయిన్ మనసే కథ

సహనం వందే, హైదరాబాద్:దశాబ్దాలుగా భారతీయ ప్రేమ కథా చిత్రాలలో హీరోదే అగ్రస్థానం. కథంతా అమ్మాయిని గెలవడానికి హీరో పడే తపన, అతని బాధ, విజయం చుట్టూనే తిరిగేది. హీరోయిన్ పాత్ర కేవలం కథను ముందుకు నడిపే సాధనంగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక ముఖ్యమైన మలుపు చోటుచేసుకుంది. ఆమెకు ఏం కావాలి? అనే ప్రశ్న చుట్టూ కథను అల్లుతూ కొత్త తరం దర్శకులు సంప్రదాయ ప్రేమ కథా నిర్మాణాన్ని సమూలంగా మారుస్తున్నారు….

Read More