అలవెన్స్ లాక్… డాక్టర్ల షాక్ – టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ నరహరి ఆవేదన
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో నూతనంగా స్థాపించిన మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 10 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా… వాటిల్లో పనిచేస్తున్న వైద్యులకు ఇవ్వాల్సిన అదనపు అలవెన్స్ కేవలం 5 కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సంఘం నిప్పులు చెరిగింది. ప్రభుత్వమే విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులలో పది కళాశాలల ప్రస్తావన స్పష్టంగా ఉన్నప్పటికీ…