భద్రాచలం శ్రీరామనవమికి సీఎంకు ఆహ్వానం

సహనం వందే, హైదరాబాద్: భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను ఆదివారం కలిసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్…

Read More

దక్షిణాదిపై ఢిల్లీ కుట్ర…

  డీలిమిటేషన్ పేరుతో పెను విధ్వంసం.. – చెన్నైలో కేటీఆర్ సంచలన ఆరోపణలు! సహనం వందే, హైదరాబాద్ చెన్నై వేదికగా జరిగిన డీలిమిటేషన్ సదస్సులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై ఢిల్లీ కుట్ర పన్నుతోందని, ఇది కేవలం పార్లమెంటు సీట్లకు మాత్రమే పరిమితం కాదని, ఆర్థిక విధ్వంసానికి కూడా దారితీస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం…

Read More

ప్రపంచ సుందరి సౌరభంతో మెరిసే భాగ్యనగరం

– తెలంగాణ సంస్కృతి సుగంధం! సహనం వందే, హైదరాబాద్ ముత్యాల సౌరభంతో కళకళలాడే హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ 2025 వేడుకలకు సర్వసన్నద్ధమైంది. మే 7 నుంచి ప్రపంచ నలుమూలల నుండి అందాల తారలు ఈ నగరానికి చేరుకోనున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ అందాల పర్వంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక వైభవం విశ్వవేదికపై వెలుగులీననున్నాయి. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యే ఈ వేడుకలు, కేవలం అందాన్ని, ప్రతిభను…

Read More

రైతులకు 24 గంటల్లోనే నగదు జమ: మంత్రి నాదెండ్ల మనోహర్

సహనం వందే, గుంటూరు ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రైతులు పండించిన ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి…

Read More

దక్షిణాది దెబ్బకు ఢిల్లీ పీఠాలు దద్దరిల్లాల్సిందే..

   33 శాతం సీట్ల కోసం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. – బీజేపీపై దక్షిణాది సీఎంల భీకర యుద్ధం… చెన్నై వేదికగా గళం – తదుపరి దక్షిణాది సీఎంల సమావేశం హైదరాబాదులో నిర్వహిస్తామని ప్రకటన సహనం వందే, హైదరాబాద్‌ లోక్‌సభ సీట్ల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఠాలను కదిలించేలా గర్జించారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ‘న్యాయమైన పునర్విభజన’ జాయింట్…

Read More

రాష్ట్రవ్యాప్తంగా ‘దావత్ ఏ ఇఫ్తార్’

ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం సహనం వందే, హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా ‘దావత్ ఏ ఇఫ్తార్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు నిధుల…

Read More

వాకింగ్ చేస్తుండగా రోడ్డు ప్రమాదం – అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి

సహనం వందే, హైదరాబాద్ హైదరాబాద్: డిజిపి కార్యాలయంలో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న టి.ఎం. నందీశ్వర బాబ్జీ శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం 4:40 గంటల సమయంలో హనుమాన్ ఆలయం సమీపంలోని లక్ష్మారెడ్డి పల్లెంలో నందీశ్వర బాబ్జీ నడకకు వెళ్లి రోడ్డు దాటుతుండగా, అబ్దుల్లాపూర్‌మెట్ నుండి హయత్ నగర్ వైపు వేగంగా వస్తున్న…

Read More

ట్రబుల్ షూటర్… డబుల్ గేమ్

సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ వెనుక మతలబు ఏంటి? – గత పాలనలో అక్రమాలను కప్పిపుచ్చేందుకేనా… సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ రంగస్థలంలో హరీష్ రావు తన “లాలూచీ రాజకీయం”తో సందడి చేస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన 15 నిమిషాల మీటింగ్ రాష్ట్రంలో రాజకీయ గాసిప్‌ల సుడిగాలిని రేపింది. “సీతాఫల్‌మండి కళాశాల పనుల కోసం కలిశాను” అని హరీష్ రావు సీరియస్‌గా చెప్పినా, బీఆర్ఎస్ శ్రేణులు “అబ్బా! ఇది కాళేశ్వరం…

Read More

సౌత్ పై నార్త్ ఇండియా కంపెనీ పాగా

దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం… ఇక్కడి సొమ్ము తరలించకపోతున్న వైనం – సౌత్ ఇండియాలో ఐదు కోట్ల మందికి పైగా నార్త్ ఇండియన్స్ – నేడు జరగబోయే చెన్నై సమావేశంతో స్టాలిన్ కొత్త అధ్యాయం – డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఐక్య పోరాటం సహనం వందే, హైదరాబాద్/చెన్నై: దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది ఆధిపత్యం రోజురోజుకు పెచ్చిమీరుతోంది. నార్త్ ఇండియా కంపెనీ వివిధ రూపాల్లో సౌత్ లో పునాది వేసుకుంది. తద్వారా లక్షల కోట్ల రూపాయలు నార్త్ కు తరలిపోతున్నాయి….

Read More

జస్టిస్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు – న్యాయవ్యవస్థలో సంచలనం!

సహనం వందే, హైదరాబాద్: జస్టిస్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగు చూడడం న్యాయవ్యవస్థలో సంచలనంగా మారింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో హోలీ పండుగ రోజున జరిగిన అగ్నిప్రమాదం న్యాయవ్యవస్థను కుదిపేసింది. మంటలార్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఆయన ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు కట్టలు లభ్యమయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యాయమూర్తి ఇంట్లో బయటపడిన ఈ నగదు వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి చేరడంతో,…

Read More