Acid Attack at Warangal

నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

సహనం వందే, వరంగల్:నర్సింగ్ విద్యార్థినిపై మంగళవారం ముగ్గురు దుండగులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. హనుమకొండలోని కాలేజీ నుంచి ద్విచక్ర వాహనంపై అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఆమెపై హెల్మెట్లు ధరించిన దుండగులు యాసిడ్ చల్లారు. ఈ దాడిలో విద్యార్థినికి నడుము, ఎడమ కాలిపై గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ఎన్డీటీవీ సోర్స్: https://www.ndtv.com/india-news/telangana-nursing-student-attacked-with-chemical-substance-suffers-injuries-9734317

Read More
PG Medical Seats

కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613,…

Read More
Health Insurance Claim rejected

లక్షల బిల్లు… బీమాకు చిల్లు – హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల మాయాజాలం

సహనం వందే, హైదరాబాద్: ఆయన పేరు రఘునందన్… హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారం రోజులపాటు ఉన్నందుకు,,,, ఆయనకు చికిత్స చేసినందుకు ఆ ఆసుపత్రి 8 లక్షల రూపాయలు బిల్లు వేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న ధీమాలో ఆ ఉద్యోగి ఉన్నాడు. బిల్లు చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి బీమా కంపెనీ కొర్రీలు పెట్టింది. మీరు చేయించుకున్న చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని బాంబు పేల్చింది….

Read More
Sexual Content Hacking

బెడ్‌రూమ్స్ హ్యాకింగ్ – ఇళ్లల్లో అమర్చుకున్న కెమెరాల హైజాక్

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఓ భయంకరమైన సైబర్ నేరం వెలుగు చూసింది. తమ ఇళ్లలో, ఆఫీసుల్లో భద్రత కోసం అమర్చుకున్న లక్షా 20 వేలకు పైగా ఐపీ కెమెరాలు హ్యాకింగ్ అయ్యాయి. సీసీటీవీకి ప్రత్యామ్నాయంగా చవకగా దొరికే ఈ హోమ్ కెమెరాలను అడ్డుపెట్టుకుని కొందరు దుండగులు ప్రజల వ్యక్తిగత జీవితాలను రికార్డ్ చేశారు. లైంగికపరమైన కంటెంట్‌ను దొంగిలించి వాటిని అమ్ముకుంటూ డబ్బు దండుకున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న వ్యాయామ సెంటర్లు, గైనకాలజిస్ట్…

Read More
Kula Gharshana

శవంతో వివాహం… రక్తంతో సింధూరం – హత్యకు గురైన ప్రేమికుడితో పెళ్లి

సహనం వందే, మహారాష్ట్ర: నారాయణీ నదీ తీరాన నగరమంతా నిద్రపోతున్న వేళ… నాందెడ్‌లో కులాంతర ప్రేమకు మరణశాసనం లిఖించారు. 25 ఏళ్ల సాక్షాం తేట్, 21 ఏళ్ల అంచల్ మామిద్వార్… మూడేళ్ల వారి పవిత్ర ప్రేమను… అంచల్ కుటుంబం కులం పేరుతో చిదిమేసింది. సాక్షాంది మరాఠా (ఓసీ) కాగా… అంచల్‌ది మహార్ (ఎస్సీ). ఈ జాతి భేదం అంచల్ తండ్రి గణేష్ మామిద్వార్, అన్నదమ్ములు హిమేష్, సహిల్‌లు పరువు పేరుతో రగిలిపోయారు. గత నవంబర్ 27న జూనా…

Read More
CAS Twist

10 ఏళ్ల రూల్‌కు డీఎంఈ గ్రీన్ సిగ్నల్

సహనం వందే, హైదరాబాద్:కంటిన్యూయస్ అకడమిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) అమలుపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల కోరిక మేరకు డీఎంఈ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. 10 ఏళ్ల సర్వీస్ నిబంధన విషయంలో 2006 నవంబర్ ప్రామాణికంగా తీసుకుని అప్పటికే అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్నవారికి ఈ ప్రయోజనం వర్తిస్తుందని ప్రకటించారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏసీఆర్‌ల విషయంలో క్లారిటీ…ఇప్పటికే…

Read More
Sky Walk inn Vizag

దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన -కైలాసగిరి పర్వత శిఖరంపై అద్భుత నిర్మాణం

సహనం వందే, విశాఖపట్నం: భారతదేశంలోనే అతి పొడవైన గాజు ఆకాశ వంతెన (గ్లాస్ స్కైవాక్) ఇప్పుడు సాగర తీరం విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. కైలాసగిరి పర్వత శిఖరంపై రెండు కొండల మధ్య నిర్మించిన ఈ వంతెన పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. సుమారు 120 మీటర్ల పొడవున్న ఈ గాజు వంతెన కింద నీలి సముద్రం కనిపిస్తుంటే సందర్శకులకు ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతోంది. సాహసాలను, అద్భుతమైన దృశ్యాలను కోరుకునే యువతకు ఇది ఓ కొత్త గమ్యస్థానం….

Read More
Lead Actors

హీరో కాదు లీడ్ యాక్టర్ – సినీనటులను హీరోలని పిలవకూడదు

సహనం వందే, పల్నాడు:సినీ నటులను హీరోలు అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పదాన్ని వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. హీరో అనే పదం డ్రగ్స్ కంటే ప్రమాదకరమైందని, బాల్యం నుంచే యువత భవిష్యత్తును ఇది నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులు లేదా అన్నం పెట్టే రైతుల కంటే, తల్లిదండ్రుల కంటే కూడా సినీ నటులనే…

Read More
World AIDs Day

టార్గెట్ 2030… ఎయిడ్స్‌ ఎండ్ – ఐదేళ్లలో వ్యాధి పూర్తి నిర్మూలనే లక్ష్యం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశం గత పదిహేనేళ్లలో హెచ్‌ఐవీ నియంత్రణలో విజయం సాధించింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు దేశ ఆరోగ్య రంగానికి పెద్ద బూస్ట్‌ ఇచ్చాయి. 2010 నుంచి 2024 మధ్య కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసుల్లో ఏకంగా 48.7 శాతం తగ్గుదల కనిపించింది. అలాగే ఎయిడ్స్ కారణంగా చనిపోయే వారి సంఖ్య 81.4 శాతం క్షీణించడం మరో గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు. సరైన…

Read More
వందేళ్ళ వైపరీత్యం

వందేళ్ళ వైపరీత్యం – పురుడు పోసుకుంటున్న నాటి వినాశనాలు

సహనం వందే, హైదరాబాద్: వైపరీత్యాలు ప్రతీ వందేళ్ళకోసారి పునరావృతం అవుతాయని అంటుంటారు.1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ప్రపంచంలో 50 కోట్ల మందిని ప్రభావితం చేసింది. కోట్ల మంది చనిపోయారు. దాదాపు అటువంటి వైరసే 2019లో వచ్చిన కరోనా. దీనివల్ల ఎన్ని కోట్ల మంది చనిపోయారో అందరికీ తెలుసు. అది సృష్టించిన మానవ విలయం ప్రతి కుటుంబానికి అనుభవంలోకి వచ్చిందే. అలాగే ఈ ఏడాది వాతావరణంలో వచ్చిన అసాధారణ పరిస్థితులు వందేళ్ళ రికార్డులను తిరగరాస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల…

Read More