స్మార్ట్ సర్జరీ.‌‌.. ‘బ్రెస్ట్’ రికవరీ- రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స

సహనం వందే, హైదరాబాద్:రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానాలను ఎంఎన్ జే క్యాన్సర్‌ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. రొమ్ము క్యాన్సర్‌కు పెరుగుతున్న ముప్పు, చికిత్సలో నూతన విధానాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పాత్రపై ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజీ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌ మాటూరితో ‘సహనం వందే’ ప్రత్యేక ఇంటర్వ్యూ… సహనం వందే: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? దీని పెరుగుదల ఆందోళన కలిగిస్తోందా? డాక్టర్ రమేష్: భారతీయ మహిళలకు…

Read More

గోల్కొండ వజ్రం… ఫ్రాన్స్ రక్తసిక్తం – రత్నం వెనుక శాపం…‌ రక్తపాతం… విప్లవం

సహనం వందే, పారిస్:ప్రపంచ ప్రసిద్ధి చెందిన రీజెంట్ వజ్రం చుట్టూ అల్లుకున్న రహస్యాలు… దాని భారతీయ మూలాల శాపం తాజాగా జరిగిన లూవ్ర్ మ్యూజియం దొంగతనంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కోట్ల విలువైన ఇతర ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు… గోల్కొండ గనుల నుంచి వచ్చిన ఈ రీజెంట్ రాణి వజ్రాన్ని మాత్రం తాకకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చరిత్రలోని ఈ అపురూప వజ్రం కేవలం రత్నం కాదు… రక్తపాతంతో మొదలైన ఒక శాపగ్రస్త కథకు…

Read More

పాలకుల ఆటలో ‘కోటా’కు బీటలు – రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీల మెగా ధర్నా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగారి పోతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం కోటా బిల్లు కోర్టుల కారణంగా ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ అన్యాయానికి నిరసనగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం (24న) ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌లు, ర్యాలీలు పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభ్యర్థనలను అణచివేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మహాధర్నా బీసీల…

Read More

ఆకలితో అమ్మ… చనిపోయెనమ్మా – మరణించన 70 ఏళ్ల వృద్ధురాలు

సహనం వందే, హైదరాబాద్:దేశమంతా దీపావళి వెలుగులు, ఆనందాల నడుమ మునిగి తేలుతున్న వేళ, హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలు ఆకలితో మరణించడం అత్యంత హృదయ విదారకరం. విశ్వనగరంగా పేరుగాంచిన నగరంలో గోపన్ పల్లి అక్షిత హాస్పిటల్ వద్ద 70 ఏళ్ళున్న ఒక నిస్సాయ మహిళ మృతదేహం దొరకడం గుండెలవిసేలా చేసింది. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా కనీసం పట్టెడన్నం లేక ఆకలి బాధలతో అలమటించి చివరికి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మరణం…

Read More

శ్రీలీలతో 150 కోట్ల యాడ్ – చైనీస్ బ్రాండ్ కు అట్లీ దర్శకత్వం

సహనం వందే, ముంబై:సాధారణంగా పెద్ద సినిమాలకు వందల కోట్లు ఖర్చు పెట్టడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందడం సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘చింగ్స్ దేశీ చైనీస్’ బ్రాండ్ కోసం ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ ప్రకటనను తెరకెక్కిస్తున్నారు. ఈ యాడ్‌ కోసం ఏకంగా సినిమా బడ్జెట్‌ను మించిన మొత్తాన్ని వెచ్చించడం విస్మయపరుస్తోంది. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కు బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన ఆకర్షణ…

Read More

‘కృష్ణయ్య’ లీలలు… కాషాయ ‘రంగులు’ – అడ్డమేసిన పార్టీ ఎంపీనే బీసీలకు అండనా?

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సంఘాలు ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ రాజకీయ విచిత్రాలకు నిలయంగా మారింది. రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని అందరికీ తెలిసినా… అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్. ‘కృష్ణయ్య’ ఈ బంద్‌కు ప్రధానంగా నాయకత్వం వహించడం హాస్యాస్పదం. ఆయనతోపాటు మరో బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతులు కలపడం… బీసీ బంధువుల్లోని శత్రువుల నాటకానికి అద్దం…

Read More

ఆడి కారు… సుమంత్ షికారు – ఏడాది క్రితం కాంట్రాక్టు ఉద్యోగిగా జీవితం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో సుమంత్ ఎదుగుదల అధికార దుర్వినియోగానికి, ప్రభుత్వంలోని లొసుగులకు నిలువెత్తు సాక్ష్యం. కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్టు పద్ధతిపై చేరిన ఈయన… మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఏకంగా ఆమె కార్యాలయంలోనే ఓఎస్‌డీగా డిప్యూటేషన్‌పై చేరాడు. కేవలం ఒక్క సంవత్సరంలోనే ఐఏఎస్ అధికారులకు సైతం ఆదేశాలు ఇచ్చే స్థితికి రావడం ఆయన చేతిలో మంత్రి కార్యాలయం మొత్తం బందీ అయిందనడానికి నిదర్శనం. అటవీ శాఖలో బదిలీలు, పదోన్నతుల్లో భారీగా లంచాలు వసూలు చేయడం,…

Read More

మంత్రిపైనే ముఖ్యమంత్రి ‘గన్’ – ఏకంగా సొంత మంత్రి ఇంటిపైనే పోలీస్ ఎటాక్

సహనం వందే, హైదరాబాద్:సహజంగా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి పోలీసులతో హల్చల్ చేయిస్తుంది. కానీ తెలంగాణలో సొంత మంత్రిపైనే పోలీసులతో అర్ధరాత్రి ఎటాక్ చేశారు. అది కూడా మహిళా మంత్రిపై ఈ దాడి జరిగింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చుట్టూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజకీయ తుఫాన్ వీస్తోంది. సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో మంత్రి ఇంటికి బుధవారం రాత్రి పొద్దుపోయాక టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది….

Read More

తెలంగాణ కలెక్టర్… ఏపీ మంత్రికి కనెక్ట్ – ఒక్క ఫోన్ తో పని చేసిపెట్టిన ఉన్నతాధికారి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మంత్రుల ఆదేశాలను పట్టించుకోకుండా అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా అధికారుల వైఖరిపై తీవ్ర చర్చకు దారితీసింది. సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి తన భూమి వివరాలు సరిచేయడానికి ధరణి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్ని రోజులు గడిచినా సొంత మంత్రి ఆదేశించినా స్పందించని కలెక్టర్… చివరకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి చేసిన ఒక్క…

Read More

ఏఐజీ ‘ఠాగూర్ సినిమా’ – శవాన్ని దాచి… డబ్బు దోచి

సహనం వందే, హైదరాబాద్:పేదల ప్రాణాల కన్నా చివరి పైసా వసూలే ముఖ్యమనే కార్పొరేట్ హాస్పిటల్స్ దురాశకు హైదరాబాద్‌లోని ఏఐజీ సాక్ష్యంగా నిలిచింది. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం వచ్చిన 40 ఏళ్ల మురళీధర్ అనే వ్యక్తి ప్రాణం పోయినా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి వరకు డబ్బు పిండుకుని చివరకు డెడ్ బాడీని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టిన దారుణ ఘటన ఇది. తమ కుటుంబ పెద్దను బతికించుకోవడానికి ఇల్లు అమ్ముకుని సర్వం కోల్పోయిన ఆ కుటుంబం…

Read More