వ్యవసాయానికి అత్యాధునిక సాంకేతికత – జర్మన్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫెడరల్ మినిస్ట్రీ ఏషియా హెడ్ రెబెకా రిడ్డర్ ఆధ్వర్యంలోని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు 55 నుండి 60 శాతం వరకు ఉన్నారని,…