వర్షంలోనూ ఆయిల్ పామ్ తోటల పరిశీలన

సహనం వందే, అశ్వారావుపేట:ఆయిల్ పామ్ తోటల్లో జన్యపర లోపం ఉన్న మొక్కలను, ఆఫ్-టైప్ మొక్కలను గుర్తించేందుకు ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి తిరిగి పరిశీలన ప్రారంభించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చెట్టుచెట్టుకూ తిరిగి పరిశీలించినందుకు ఆయిల్ పామ్ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షుణ్ణమైన పరిశీలన వల్ల అశ్వారావుపేట ఆయిల్ పామ్ నర్సరీలో జరిగిన మోసాలకు, తద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రైతుల తోటల్లో ఆఫ్-టైప్, జన్యపర లోపం…

Read More

ఆయిల్ పామ్ అక్రమాలపై డీఎన్ఏ కొరడా – నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో అశ్వారావుపేటలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన ఈ బృందం… పూర్తిస్థాయిలో ఈ మూడు రోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయమంది. ఆయిల్ పామ్ మొక్కల్లో జరిగిన అక్రమాలు… నాణ్యతా లోపాలపై ఈ బృందం లోతైన పరిశోధన చేయనుంది. అంతేకాదు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఏకంగా డీఎన్ఏ పరీక్షలు చేయాలని…

Read More

‘కాంపౌండర్ల వైద్యంతో కాటికే’ – నకిలీ వైద్యులతో ప్రాణాలు హరి

సహనం వందే, రంగారెడ్డి జిల్లా:రంగారెడ్డి జిల్లా షాబాద్, హైతాబాద్ ప్రాంతాల్లో డాక్టర్లుగా చెలామణి అవుతున్న కాంపౌండర్లు, నకిలీ వైద్యుల గుట్టు రట్టైంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం నిర్వహించిన తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ ఎయిడ్ బోర్డులు పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా అల్లోపతి దవాఖానాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించారు. కాంపౌండర్ గా పనిచేసి పెద్ద డాక్టర్లుగా చెప్పుకుంటున్నట్లు…

Read More

పారాక్వాట్ తో పొలాలు వల్లకాడు -రైతుల్లో పార్కిన్సన్స్ వ్యాధి

సహనం వందే, హైదరాబాద్:భారత్, అమెరికా దేశాల్లో విస్తృతంగా ఉపయోగించే ప్రమాదకరమైన పారాక్వాట్ హెర్బిసైడ్‌ (గడ్డి మందు) వల్ల పార్కిన్సన్స్ వ్యాధి సంభవిస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. దీనివల్ల రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాషింగ్టన్ పోస్టులో ప్రచురితమైన కథనం ప్రకారం… పారాక్వాట్ వాడకం వల్ల అమెరికన్ రైతులు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇదే సమస్య భారత దేశంలోనూ తీవ్రంగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో పారాక్వాట్ విష ప్రభావం…పారాక్వాట్ కలుపు నివారణకు…

Read More

బైక్ ట్యాక్సీ లతో బేజారు-ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?

సహనం వందే, హైదరాబాద్: కర్నాటకలో బైక్ ట్యాక్సీ లపై విధించిన నిషేధం ఇప్పుడు హైదరాబాద్‌కూ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ వీటిని నిషేధించాలంటూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ రవాణా శాఖను డిమాండ్ చేస్తోంది. త్వరలో ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ నిషేధం అమలైతే, హైదరాబాద్ రోడ్లపైనా బైక్ ట్యాక్సీలు కనుమరుగు కానున్నాయి. వ్యక్తిగత బైక్‌లతో భద్రత ఎలా?హైదరాబాద్‌లో సుమారు 70 వేల బైక్ ట్యాక్సీలు…

Read More

నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కి మంత్రులు -తుమ్మల సమీక్ష

సహనం వందే, సిద్దిపేట:తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లాలో పామాయిల్ సాగు, నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మంత్రుల బృందం కొహెడ మండలం సముద్రాల గ్రామంలోని కోమురరెడ్డి పామాయిల్ తోటను సందర్శించి సాగు చేస్తున్న రైతులతో నేరుగా మాట్లాడారు. అనంతరం నంగునూరు…

Read More

తెలంగాణ ఆయిల్ ఫెడ్ నర్సరీలలో కేంద్ర బృందం

సహనం వందే, అశ్వారావుపేట: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాల మేరకు భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు గురువారం అశ్వారావుపేట, దమ్మపేటల్లో పర్యటించారు. నర్సరీలు, జన్యు లోపం ఉన్న మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందం పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. ఐఐఓపీఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఎంవీ ప్రసాద్, రామచంద్రుడు సహా ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ అడపా కిరణ్, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే అశ్వారావుపేట ఆయిల్…

Read More

దంతవైద్యులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఝలక్

హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీలపై నిషేధం సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలోని దంతవైద్యులకు (డెంటిస్టులకు) తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) ఒక పెద్ద షాకిచ్చింది. ఇకపై దంతవైద్యులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ వంటి కాస్మెటిక్ ప్రొసీజర్‌లు నిర్వహించడానికి అనుమతి లేదని టీఎంసీ స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) మార్గదర్శకాల ఆధారంగా టీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓరల్, మాక్సిలోఫేషియల్…

Read More

సోషల్ మీడియా నెత్తుటి మడుగులో ‘అమ్మ’ -ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్..

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ నగరం రక్తపు మరకలతో నిండిన ఓ దారుణ నేరానికి సాక్ష్యంగా నిలిచింది. కన్న కూతురే తల్లిని కడతేర్చిన ఘటన తెలుగునాట పెను సంచలనం సృష్టించింది. మానవ సంబంధాల పవిత్రతను ఛిన్నాభిన్నం చేస్తూ, సామాజిక మాధ్యమాలు విషపు కోరలు ఎలా పరుచుకుంటున్నాయో ఈ హత్య స్పష్టం చేసింది. ప్రేమ, అక్రమ సంబంధాలు, డిజిటల్ ప్రపంచపు మాయాజాలం మనుషుల నైతికతను ఎలా కాలరాస్తున్నాయో ఈ ఘోరం కళ్ళ ముందుంచింది. సమాజం ఎటు పయనిస్తోంది? ఈ నీచపు…

Read More

యూరియా కొరత తీర్చండి – కిషన్ రెడ్డికి తుమ్మల లేఖ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో యూరియా లభ్యతపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రం నుండి రాష్ట్ర వాటాగా రావాల్సిన యూరియాను త్వరగా తెప్పించేలా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల ఈ లేఖలో కోరారు. ప్రస్తుత యూరియా లభ్యత వివరాలు, అలాగే కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన యూరియా పరిమాణాన్ని లేఖలో స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల అవసరాల కోసం కేంద్రం నుండి రాష్ట్రానికి…

Read More