విత్తనాల దందా… అధికారుల అండ – అధిక ధరలతో అన్నదాత లూటీ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరకు విక్రయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోయాబీన్ విత్తనాల కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం రూ. 2,400 మాత్రమే కాగా… కొందరు వ్యాపారులు రైతుల నుంచి రూ. 2,600 వరకు…

Read More

ఢిల్లీతో రేవంత్ రె’ఢ్డీ’ – బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతోనే కొట్లాట

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు…

Read More

‘సృష్టి’కి వైద్యాధికారి అండదండ… నకిలీ ఐవీఎఫ్ సెంటర్లకు అనుమతులు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ యూనివర్సల్ ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతకు హైదరాబాదుకు చెందిన ఒక కీలక వైద్యాధికారి అండదండలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమెపై అనేక ఫిర్యాదులు రావడం… కేసులు నమోదు కావడం జరిగింది. అయినప్పటికీ ఆ ఫెర్టిలిటీ సెంటర్ కు అన్ని విధాలుగా ఆ అధికారి అనుమతులు ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. ఆమె చేస్తున్న అక్రమాల్లో ఆయనకు కూడా వాటా ఉందన్న ప్రచారం జరుగుతుంది. సంతానం లేని దంపతులను మోసం చేస్తూ కోట్లు…

Read More

రాష్ట్ర జడ్జీల సంఘం ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర జడ్జీల సంఘం అధ్యక్షుడిగా జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. సంఘం ఎన్నికలు ఈ నెల 19న జరిగాయి. ఈ ఎన్నికలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా పర్యవేక్షించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తికావడంతో, విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికలు న్యాయవ్యవస్థలో నూతన నాయకత్వానికి మార్గం సుగమం చేశాయి. వారి నాయకత్వంలో తెలంగాణ…

Read More

యూరియా కోసం…. గడప దాటండి… ఢిల్లీ వెళ్లండి…

సహనం వందే, హైదరాబాద్:ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో పంటల సాగు ఊపందుతుంది. ఇంతటి కీలక సమయంలో యూరియా అత్యవసరం. అందుకోసం అన్నదాత ఎదురుచూస్తున్నారు. కానీ యూరియా అందుబాటులో లేకుండా పోయింది. దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉండటంతో సాగు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆరోపిస్తుంది. మంత్రి తుమ్మల…

Read More

ముఖ్యమంత్రికి విన్నవించినా…ఆగని ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల ఆగడాలు

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఆధ్వర్యంలో గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు సార్లు విన్నవించారు. అయినా ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. కొందరు సీనియర్ అధికారులు, కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన కీలక అధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,…

Read More

మహావీర్ గుప్పిట్లో ఎన్ఎంసీ -లంచం తీసుకున్నందుకు కృతజ్ఞతాభావం

సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) దారి తప్పిపోయింది. లంచాల రుచికి మరిగిన ఎన్ఎంసీ బృందాలు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదు. దేశంలో అనేక చోట్ల సీబీఐ కేసులు పెడుతూ కొందరిని అరెస్టు చేస్తున్నా… ఎన్ఎంసీ అధికారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ముడుపులు తీసుకుని ముందే కమిట్మెంట్లు ఇవ్వడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో చెట్టాపట్టాల్ వేసుకొని దర్జాగా తిరుగుతూనే ఉన్నాయి. అందుకు నిలువెత్తు ఉదాహరణ వికారాబాద్ లో ఉన్న మహావీర్…

Read More

బీసీల నెత్తిన టోపీ – 42 శాతం రిజర్వేషన్లపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాలను రాజకీయ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. అధిక సంఖ్యలో ఉన్న బీసీల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు నాటకాలు ఆడుతూనే ఉన్నాయి. అగ్రవర్ణ పార్టీల నాయకులు బీసీల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ వారిని మోసం చేస్తూనే ఉన్నాయి. అటువంటి వారిని కొందరు బీసీ నాయకులు నమ్ముతుండడం పరాకాష్ట. ఎక్కడైనా మేకలకు పులి రక్షణ ఇస్తుందా? అని బీసీ నేతలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు…

Read More

ప్రముఖులు జైళ్లలో అతిథులు – డబ్బుంటే జైళ్లు గెస్ట్ హౌస్ లే

సహనం వందే, రాజమండ్రి:‘జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటా’… ఈ వ్యాఖ్య చేసింది ఎవరో కాదు… తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. ధనికులకు చట్టం చుట్టం అవుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తప్పుచేసి జైలుకు వెళ్లినప్పటికీ వారికి రాచ మర్యాదలు కల్పిస్తారు. ఒకప్పుడు జగన్… తర్వాత రేవంత్ రెడ్డి..‌. చంద్రబాబు నాయుడు… కవిత.‌.‌. ఇప్పుడు మిధున్ రెడ్డి. వీళ్ళందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. జైళ్లు ఒకరకంగా ధనికులకు విశ్రాంతి కేంద్రాలుగా మారిపోవడం దురదృష్టకరం. ఎంత డబ్బు చెల్లిస్తే అన్ని…

Read More

ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి ఊట – ఐఐఓపీఆర్ బృందం పర్యటనలో వాస్తవాలు

సహనం వందే, అశ్వారావుపేట:ఆయిల్ పామ్ తోటలు తవ్విన కొద్దీ అవినీతి బండారం బయటపడుతుంది. ఇదొక వెబ్ సిరీస్ లాగా రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది. జన్యు లోపాలున్న మొక్కలతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే, ఆయిల్ ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం, కుమ్మక్కు రాజకీయాలు వారిని మరింత దిగజారుస్తున్నాయి. ఇటీవల ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ ప్రతినిధులు, ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు ఆసన్నగూడెం గ్రామంలో పర్యటించినప్పుడు వెలుగుచూసిన వాస్తవాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద…

Read More