యూరియా సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యం – జాన్ వెస్లీ విమర్శ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, రైతులు నెలరోజులుగా యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బీజేపీ నాయకులు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమే కారణమని ఆరోపించారు. కృత్రిమ కొరత పేరుతో బీజేపీ…

Read More

1న పింఛన్ విద్రోహ దినం – సభా పోస్టర్ విడుదల చేసిన నేతలు

సహనం వందే, హైదరాబాద్:వచ్చే నెల 1వ తేదీన పింఛన్ విద్రోహ దినం సభను విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ నగర, జిల్లా శాఖలు మంగళవారం ఆర్థిక, గణాంకాల కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్లు శ్రీకాంత్, విక్రమ్, కన్వీనర్లు వెంకట్, కృష్ణ యాదవ్‌తో పాటు టీజీఓ, టీఎన్జీఓ వంటి ఇతర సంఘాల…

Read More

పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ నోటి దురుసు

సహనం వందే ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటి దురుసు ప్రదర్శించారు.‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. విమర్శలు హద్దులు దాటి పోవడం పరాకాష్ట. నారాయణ సహజంగానే తెగించి ఇష్టరాజ్యంగా మాట్లాడుతారన్న విమర్శలు ఉన్నాయి. సోమవారం ఒంగోలులో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మహాసభలో నారాయణ ప్రసంగించారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్…

Read More

అధికారుల తీరుతో అన్నదాత బలి – నాడు రుణమాఫీ… నేడు యూరియా

సహనం వందే, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వ్యవసాయశాఖలో ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అప్పట్లో రుణమాఫీ విషయంలోనూ… ఇప్పుడు యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ యంత్రాంగ నిర్లక్ష్యమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారును ఇరుకున పెట్టే విధంగా కొందరు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి…

Read More

‘సీఎంలు వాళ్లు.. రోడ్లపై నేను’ – వి. హనుమంతరావు భావోద్వేగం

సహనం వందే, కరీంనగర్:‘నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్, చంద్రబాబు నా దగ్గరే పని చేశారు. వాళ్లు సీఎంలు అయ్యారు. నేను మాత్రం రోడ్లమీద తిరుగుతున్నాన’ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రెండుసార్లు వచ్చినప్పటికీ ఆ పదవి తీసుకోలేదని చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన జనహిత పాదయాత్రలో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ మారని నేతపదవుల కోసం పార్టీలు మారిన నేతలు చాలామంది ఉన్నారని,…

Read More

ఎంఎన్ జే డైరెక్టర్ పై వేటు – డాక్టర్ శ్రీనివాసులుకు డీవోపీటీ షాక్!

సహనం వందే, హైదరాబాద్‌:ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయనను తిరిగి వెనక్కి పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన విభాగం తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ శ్రీనివాసులు చేసిన అభ్యర్థనను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వశాఖ (డీవోపీటీ) తిరస్కరించింది. 2017 జనవరి 17న జారీ చేసిన ఆ ఉత్తర్వులు…

Read More

ప్రజా నాయకుడి శరీరమూ ప్రజలకే అంకితం – మెడికల్ కాలేజీకి సురవరం భౌతికకాయం

సహనం వందే, హైదరాబాద్:సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి రెడ్ ఆర్మీ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఆయన భౌతికకాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గౌరవించింది. అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతిమయాత్రలో ముందు పోలీసులు అధికారిక గౌరవ వందనం సమర్పించగా, ఆ తర్వాత…

Read More

యూరియా కోసం రైతుల రాళ్ల దాడి

సహనం వందే, వనపర్తి:యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. కీలకమైన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో అధికారులను నిలదీస్తున్నారు. అందులో భాగంగా శనివారం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అన్నదాతలు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద అధికారులను నిలదీశారు. వారు స్పందించకపోవడంతో రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.‌ మరోవైపు కొందరు మార్క్…

Read More

డబ్బుల్లో బాబు… కేసుల్లో రేవంత్ – దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్

సహనం వందే, హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల సీఎంలు దేశంలో మొదటి స్థానాల్లో ఉన్నారు. ఒకరు డబ్బుల్లో, మరొకరు కేసుల్లో ముందున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిలియనీర్ గా టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 931 కోట్లు. అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ఆస్తి కేవలం రూ. 15 లక్షలు. భారతదేశంలోని 30 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసుల వివరాలను…

Read More

డబ్బుల్ పెండింగ్… ఆసుపత్రులు క్లోజింగ్ – ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల అల్టిమేటం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకంలో సేవలు అందిస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తామని తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఫర్ ఆరోగ్యశ్రీ (తాన్హా) అధ్యక్షులు డాక్టర్ వద్దిరాజు రాకేష్ హెచ్చరించారు. . ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్) లాంటి పథకాల్లో సేవలు అందించడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్…

Read More