పటిష్ట వ్యూహంతో పదేళ్లు పాగా – మరో రెండు మార్లు సీఎం కుర్చీలో కర్చీఫ్

సహనం వందే, హైదరాబాద్:‘నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. హైదరాబాదును న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు ఆ సిటీలకు పోటీగా నిర్మించకూడదు? ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామ’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనూ… రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారాయి. తనకు మరో పదేళ్లు…

Read More

రైతు బలి… రఘునందన్ బదిలీ – రుణమాఫీ… యూరియా కొరత ఎఫెక్ట్

సహనం వందే, హైదరాబాద్:సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్ రావును తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్యదర్శి బాధ్యతల నుంచి తొలగించి బదిలీ చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎక్కువకాలం వ్యవసాయశాఖలో ఉన్నందున బదిలీ చేశారని కొందరు అంటుంటే… కీలకమైన పంటల సీజన్లో అకస్మాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు అంటున్నారు. అయితే ఆయన హయాంలో జరిగిన రెండు ప్రధాన వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రుణమాఫీ అమలులో గందరగోళం…కాంగ్రెస్ పార్టీ అధిష్టానం… ముఖ్యమంత్రి…

Read More

బీసీలకు అ’భయం’ – ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) సామాజిక న్యాయాన్ని అందించే దిశగా చారిత్రక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఈ రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. న్యాయపరమైన చిక్కులపై ఆందోళన…ఈ చారిత్రక నిర్ణయం…

Read More

‘స్తోమత లేకుంటే సినిమాకు రాకండి’ – హైకోర్టులో ‘ఓజీ’ తరపు లాయర్ వింత వాదన

సహనం వందే, హైదరాబాద్:‘ఓజీ’ సినిమా టికెట్ రేట్లపై శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ సినిమా నిర్మాత తరపున వాదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ‘సినిమా టికెట్ ధరలపై మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే రూ.100, రూ.150 పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. రూ.150 కూడా పిటిషనర్‌కు కష్టం అనుకుంటే సాధారణ రేటు ఉన్నప్పుడే సినిమా చూడాలి. పిటిషనర్ మొదటి రోజు సినిమా చూడాలంటారు. కానీ ఆయనకు…

Read More

సీపీఐలో పల్లాకు పెద్దపీట – జాతీయ కార్యదర్శిగా అత్యున్నత అవకాశం

సహనం వందే, హైదరాబాద్:చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ 25వ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం లభించింది. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి పల్లా వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా తప్పుకోవడంతో… నల్లగొండ నేత పల్లాకు జాతీయస్థాయిలో అత్యున్నత పదవి దక్కింది. దీంతో తెలంగాణకు చెందిన పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ నుంచి జాతీయ కార్యదర్శి వరకు…నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా…

Read More

డొనేషన్ల అడ్మిషన్… నోటీసుల పరేషాన్ – ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యంగా దందా

సహనం వందే, హైదరాబాద్:ఎప్పుడో పది ఇరవై సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ సీటు అంటే మెరిట్, ప్రవేశ పరీక్షల ర్యాంకుల మీద ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అగ్రశ్రేణి కాలేజీలు విద్యను వ్యాపార వస్తువుగా మార్చేశాయి. ఈ అక్రమాలకు పరాకాష్ఠగా ఇటీవల జరిగిన అడ్డగోలు యాజమాన్య కోటా సీట్ల అమ్మకాలు నిలిచాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి విద్యార్థుల మెరిట్‌ను పక్కకు పెట్టాయి. లక్షలకు లక్షలు డొనేషన్ల…

Read More

రోడ్డుపై ‘వందే భారత్’ – హైదరాబాదు నుంచి విశాఖకు 8 గంటలే

సహనం వందే, హైదరాబాద్:వందే భారత్ రైల్లో హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది.‌ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే రాత్రి 11:35 గంటలకు చేరుస్తుంది. ఇప్పుడు వందే భారత్ కు దీటుగా రోడ్డు పైనే కారు లేదా బస్సులో విశాఖకు చేరుకోవచ్చు. అందుకోసం వచ్చే సంక్రాంతి నుంచి కొత్త రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గబోతోందని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఇది నిజంగా ఓ మంచి…

Read More

‘షీ’ని వదిలేసిన ‘టీమ్స్’ – షీ టీమ్స్ ఉన్నా మహిళల భద్రత సున్నా

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నగర శివారులోని రాజేంద్రనగర్‌లో జరిగిన దారుణ ఘటన నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కనీసం మానవత్వం కూడా లేకుండా కొందరు మృగాలుగా మారి ఒక మహిళను అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన సమాజాన్ని కలవరపెట్టడంతోపాటు పోలీసుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. ఘోరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడమే తమ గొప్పతనంగా…

Read More

తల తిరుగుడు… బ్యాలెన్స్ తప్పుడు – అకస్మాత్తుగా కళ్లు తిరుగుతున్నాయా?

సహనం వందే, హైదరాబాద్:మీరు వాహనం నడిపేటప్పుడు ఒక్కసారిగా కళ్లు తిరిగినట్టుగా అనిపించిందా? కారు అదుపు తప్పి ఏదో ఒక వైపు వెళ్లినట్లుగా అనిపించిందా? స్టీరింగ్ మీద పట్టు కోల్పోయి ప్రమాదానికి గురైనప్పటికీ మీకు ఏం జరిగిందో అర్థం కాలేదా? ఇలాంటి సమస్యలు ఎదురైతే అది కేవలం అలసటనో, నిద్రలేమినో అనుకోవడానికి లేదు. మీ మెదడులోని సమతుల్యత (బ్యాలెన్స్) వ్యవస్థలో ఏదో లోపం ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్నే ‘మోటరిస్ట్ వెస్టిబ్యులర్ డిస్ఓరియంటేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు….

Read More

సుబ్బిరామిరెడ్డి… రూ. 5,700 కోట్ల లూటీ – మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంకులు

సహనం వందే, హైదరాబాద్:సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. ఆయన కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్టు కంపెనీ దివాలా తీసిందన్న సాకుతో ఏకంగా రూ. 5,700 కోట్లను మాఫీ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన రాజకీయ నేతల అవినీతికి పరాకాష్ట. బ్యాంకులు కూడా ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుబ్బిరామిరెడ్డి కంపెనీ రూ. 8,100 కోట్లకు పైగా తీసుకున్న రుణంలో…

Read More