‘ఆ నూనె వాడితే ప్రాణాలేం పోవు’ – వ్యాపారి వ్యాఖ్య

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో కాలం చెల్లిన బ్రాండెడ్ నూనె ప్యాకెట్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఒక వినియోగదారుడికి ఎదురైన చేదు అనుభవం ఈ దారుణమైన వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. నిర్మల్ లో గారెలు చేసుకుని తినాలని ఆశగా నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసిన అతనికి, ఇంటికి వెళ్లాక చూసేసరికి ఆ ప్యాకెట్ల గడువు గత మే నెలలోనే ముగిసిందని తెలిసి…

Read More

688 ఏళ్ల నాటి లండన్ హత్య కేసు – హత్య నిజా నిజాలు

సహనం వందే, లండన్:సుమారు 688 సంవత్సరాల క్రితం… సరిగ్గా 1337 మే సాయంత్రం.‌.. లండన్‌లోని ఓల్డ్ సెయింట్ పాల్స్ కేథడ్రల్ సమీపంలో జాన్ ఫోర్డ్ అనే పూజారి దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అతడిని చుట్టుముట్టి, గొంతు, కడుపులో పొడిచి ప్రాణాలు తీశారు. ఈ హత్య వెనుక ఎలా ఫిట్జ్‌పేన్ అనే ధనిక కుటుంబానికి చెందిన శక్తివంతమైన మహిళ హస్తం ఉందని చారిత్రక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసులో వ్యభిచారం, దోపిడీ,…

Read More

నెలకు 4 వేల ఫోన్ల ట్యాపింగ్..ఎన్నికల సమయంలో….

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పోలీసులు గత ప్రభుత్వ హయాంలో ఫోన్ల ట్యాపింగ్ స్కాండల్‌లో కూరుకుపోయారు. ప్రతినెల దాదాపు నాలుగు వేల ఫోన్లను ట్యాప్ చేశారు. ముఖ్యంగా 2023 సాధారణ ఎన్నికల సమయంలో ఒక్క నవంబర్ నెలలోనే 600కు పైగా ఫోన్లను ఏకకాలంలో ట్యాప్ చేసినట్లు తేలింది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వ్యాపారవేత్తలను, హవాలా ద్వారా డబ్బు తరలిస్తున్న వారిని ట్యాపింగ్ ద్వారా గుర్తించి వారిని పట్టుకునేవారు. ఈ దాడులను హవాలా డబ్బుగా చిత్రీకరించి మీడియాకు…

Read More

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై… సినీ హీరోల విలనిజం పోకడ

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై… సినీ హీరోల విలనిజం పోకడ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్రశ్రేణి హీరోలు, నిర్మాతలు, దర్శకులు డోంట్ కేర్ అన్న ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ, అదే సమయంలో రాయితీలు, అనుమతులు పొందడంలో మాత్రం ప్రభుత్వాలపై ఆధారపడుతున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వందలు, వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన కొందరు సినీ ప్రముఖుల కళ్లు నెత్తికెక్కాయని,…

Read More

బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన దావరి-బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో, దీనిని అడ్డుకోకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని…

Read More

ఆయిల్ ఫెడ్ బోర్డుకు బురిడీ… కోట్లు దోపిడి

సహనం వందే, హైదరాబాద్: సురేందర్… గతంలో ఆయిల్ ఫెడ్ కు ఎండీగా పనిచేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు… ఫ్యాక్టరీల నిర్మాణం… ఉత్పత్తి వంటి విషయాలపై అంచనాలకు అందనంత దూరంలో లెక్కలు వేసి ఆయిల్ ఫెడ్ బోర్డును బోల్తా కొట్టించారన్న విమర్శలున్నాయి. అందుకు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పూర్తిస్థాయి అండదండలు ఇచ్చారు. అందుకు 2023 ఏప్రిల్ 3వ తేదీన జరిగిన బోర్డు సమావేశమే నిలువెత్తు నిదర్శనం….

Read More

అమర్‌నాథ్ యాత్ర ‘నో ఫ్లై జోన్’ – జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం

సహనం వందే, జమ్మూ కాశ్మీర్:అమర్‌నాథ్ యాత్ర జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అత్యంత కీలకమైన భద్రతా నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన అన్ని మార్గాలను ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించింది. భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ కఠినమైన చర్యలు అమలవుతున్నాయి. డ్రోన్లు, బెలూన్లకు నో ఎంట్రీజమ్మూ కాశ్మీర్ హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం… లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్…

Read More

గోమాతకు అండగా ప్రభుత్వం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు. గోవుల సంరక్షణే లక్ష్యంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. సమగ్ర అధ్యయనానికి ఆదేశం!పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి…

Read More

దిల్ రాజు అట్టర్ ప్లాప్… స్టార్లను రప్పించడంలో ఘోర వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు… తన సొంత కార్యక్రమాలకు స్టార్ హీరోలను, ఇతర సినీ ప్రముఖులను సులభంగా రప్పించగల సత్తా ఉన్నవారు. అలాంటి దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గద్దర్ అవార్డు ఫంక్షన్‌ కు స్టార్ హీరోలను రప్పించడంలో చేతులెత్తేయడం విస్మయం కలిగిస్తోంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, బ్రహ్మానందం…

Read More

ఆయిల్ ‘ఫ్రాడ్’తో కోటీశ్వరులు – కోట్లకు పడగలెత్తిన అధికారులు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ లో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థను ఫణంగా పెట్టి కోట్లకు పడగలెత్తుతున్నారని అందులోని ఉద్యోగులే మండిపడుతున్నారు. తమ అధికారాలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పామాయిల్ మొక్కల్లో అక్రమాలు, నూనెల విక్రయాల్లో అవకతవకలు, నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్లలో గోల్మాల్… ఇలా అనేక రూపాలుగా అవినీతి పేరుకుపోయినట్లు చెప్తున్నారు. అందులోని కీలక స్థానాల్లో ఉన్నవారు సిండికేట్ అయ్యి సంస్థను నట్టేట ముంచుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం…

Read More