పవన్ ఓజీ… ఫ్యాన్స్ క్రేజీ – 25వ తేదీన బాక్సాఫీసును బద్దలే

సహనం వందే, హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా సినీ లోకం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మొదట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ప్రతీ అప్డేట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఓజీలో ఓజాస్ గంభీరంగా గర్జించనున్నారని చెబుతున్న పవన్, ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి…

Read More

సుబ్బిరామిరెడ్డి… రూ. 5,700 కోట్ల లూటీ – మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంకులు

సహనం వందే, హైదరాబాద్:సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. ఆయన కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్టు కంపెనీ దివాలా తీసిందన్న సాకుతో ఏకంగా రూ. 5,700 కోట్లను మాఫీ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన రాజకీయ నేతల అవినీతికి పరాకాష్ట. బ్యాంకులు కూడా ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుబ్బిరామిరెడ్డి కంపెనీ రూ. 8,100 కోట్లకు పైగా తీసుకున్న రుణంలో…

Read More

దీపికా ఓపిక లేదిక – దీపికా పదుకొనె వ్యవహారంపై అసహనం

సహనం వందే, హైదరాబాద్:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కెరీర్ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆమె భారీ చిత్రాలను వదిలేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి‌. కానీ దాని వెనుక సినిమా వర్గాల అసహనం, ఆమె అతి డిమాండ్లే కారణమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కల్కి 2898 ఏడీ, స్పిరిట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. గత ఏడాది భారీ విజయాలతో…

Read More

మీడియాపై నరమేధం – యెమెన్‌లో 31 మంది జర్నలిస్టుల మృతి

సహనం వందే, న్యూఢిల్లీ:మధ్యప్రాచ్యంలో జర్నలిస్టుల భద్రతకు మరోసారి పెనుముప్పు పొంచి ఉంది. యెమెన్‌లో ఒక వార్తాపత్రిక కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 31 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టుల రక్షణ కమిటీ (కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్) నివేదిక ప్రకారం… జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన అతి పెద్ద దాడి ఇదే. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఈ దాడిని హౌతీ తిరుగుబాటుదారుల మీడియా కేంద్రంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బందిని…

Read More

మాజీ సీఎంల మూగ నోము – అసెంబ్లీకి రాకుండా జగన్, కేసీఆర్ సాకులు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్… ఇద్దరూ ఒకే స్టైల్ రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్లడానికి వీరిద్దరూ విముఖత చూపటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోలేక గైర్హాజరు అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక స్థానంలో ఉన్న ఈ ఇద్దరు ప్రజల పక్షాన అసెంబ్లీ వేదికగా ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళని గెలిపిస్తే తమకు ఒరిగిందేంటని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఉంటే తప్పా…

Read More

లోటెక్ పోస్టులకు బీటెక్ డిమాండ్ – ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది పోటీ

సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్‌లో 53 వేల ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడటం విస్మయం కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తోంది. కేవలం పదో తరగతి అర్హతతో కూడిన ఈ పోస్టులకు 90 శాతం మంది డిగ్రీలు, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్ డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా యువత ఆకాంక్షలను అవమానపరిచేదిగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల…

Read More

ఫ్లిప్‌కార్ట్‌లో ‘బుల్లెట్’ ఆర్డర్ – ఆన్‌లైన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయం

సహనం వందే, ముంబై:మోటార్ సైకిల్ ప్రేమికులను ఆకర్షిస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌ తో జతకట్టి తమ 350సీసీ బైక్‌లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. సోమవారం నుంచి బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. క్లాసిక్ లుక్, గంభీరమైన ఇంజన్ సౌండ్‌తో ప్రసిద్ధి చెందిన ఈ బైక్‌లను ఇకపై మొబైల్ స్క్రీన్‌పై నుంచే కొనుగోలు చేసుకోవచ్చు. యువత ఆన్‌లైన్ షాపింగ్‌పై చూపుతున్న…

Read More

రాహుల్ జెన్ జెడ్ ప్రకంపనలు – నేపాల్ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా ట్వీట్

సహనం వందే, న్యూఢిల్లీ:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది. నేపాల్ తరహా జెన్ జెడ్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉండటంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. ఆయన ప్రత్యేకంగా జెన్ జెడ్ అని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇటీవల నేపాల్‌లో జెన్ జెడ్ యువత భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారు. ఆ నిరసనలు హింసాత్మకంగా మారి 50 మందికి పైగా ప్రాణాలు…

Read More

పట్టుచీరతో రాజకీయ ఎత్తు’గడ(ల)’ – బతుకమ్మ నీడలో పునః ప్రవేశం

సహనం వందే, హైదరాబాద్:కొన్నాళ్లుగా కనుమరుగైన ప్రజారోగ్య మాజీ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఈనెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొత్తగూడెంలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఎంపికైన బతుకమ్మలు పేర్చిన మహిళలకు రోజుకొకరికి పట్టుచీర గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. తద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని రకాలుగా ప్రజల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో కింగ్…గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖలో…

Read More

అప్పలనాయుడు… గిరిజన గుండెచప్పుడు – ఏజెన్సీలో విజయనగరం ఎంపీ పల్లెనిద్ర

సహనం వందే, విజయనగరం:విజయనగరం పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు గిరిజనుల మనసు గెలుచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో గిరిజన పల్లెల్లో రాత్రి బస చేశారు. తన జిల్లాలో పల్లెనిద్ర చేసిన మొదటి ఎంపీగా చరిత్రకెక్కారు. ఆయన కేవలం రాత్రి గడపడం మాత్రమే కాదు, పల్లెనిద్ర తర్వాత పొద్దున్నే లుంగీ కట్టుకుని పొలాల గట్లపై నడుస్తూ రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆయన సాధారణ జీవనశైలి గిరిజనులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పలనాయుడు… మాస్ లీడర్రాజకీయ హోదా, అధికారిక…

Read More