పోరాడి ఓడిన సివిల్స్ యోధుడు – దశాబ్ద కాలపు ప్రయాణం

సహనం వందే, న్యూఢిల్లీ:ఐఏఎస్ కావాలనేది లక్షలాది మంది యువత కల. అయితే ఆ కల కోసం ఒక దశాబ్దానికి పైగా ఒంటరి పోరాటం చేసిన ఓ వ్యక్తి ఉదంతం ఇప్పుడు ఎంతోమంది హృదయాలను కదిలిస్తోంది. కునాల్ ఆర్ విరుల్కార్ అనే అభ్యర్థి ఏకంగా 12 సార్లు సివిల్స్ పరీక్షలో విజయం సాధించడానికి శ్రమించారు. పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన ప్రయాణం 2012లో మొదలైంది. 7 సార్లు ప్రిలిమ్స్ అడ్డంకిని దాటి మెయిన్స్ వరకు చేరుకున్నారు. 5…

Read More

నైట్ డ్యూటీ… డబుల్ శాలరీ – ఉత్తరప్రదేశ్ మహిళలకు ప్రత్యేక సౌకర్యం

సహనం వందే, ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్‌లో ఇకపై మహిళలు కూడా రాత్రి వేళల్లో పనులు చేసేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం… మహిళలు ఇక నుంచి సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఈ వెసులుబాటు ప్రమాదకరమైన పరిశ్రమల్లోని 29 రకాల పనులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయంలో మహిళల అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం…

Read More

‘ఎగ్జిట్’ నాటకం… వెనుక కుతంత్రం – మాయాజాలం కాదు… మహా మోసం

సహనం వందే, హైదరాబాద్:ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు ఉత్కంఠను అమాంతం పెంచే ఎగ్జిట్ పోల్స్ కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే తీర్పు కాదు. ఇది రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పకడ్బందీగా అల్లిన అంకెల జూదం. వీటి ఉద్దేశం.. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు తమ ఆర్థిక వ్యూహాలను అమలు చేసుకోవడమే. అంతేకాదు కౌంటింగ్‌కు ముందు తమ ప్రేక్షకులను, పాఠకులను నిలుపుకునేందుకు మీడియాకు పనికివస్తాయి. అందుకే దీనిని కేవలం ఉత్కంఠ కోసమే అనుకుంటే పొరపాటే. గోడ దూకే నాయకులకు…

Read More

సెవెన్ రూల్… నాగ్ స్టైల్ – నాగార్జున యంగ్ మంత్ర

సహనం వందే, హైదరాబాద్:ఎప్పుడూ యవ్వనంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రత్యేక డైట్‌లు, ఖరీదైన సప్లిమెంట్లు అవసరం లేదని జీర్ణకోశ వ్యాధి నిపుణులు అంటున్నారు. చాలా సులువైన ఒకే ఒక్క సాధారణ నియమం పాటిస్తే సరిపోతుందని చెపుతున్నారు. ఆ రహస్యం మరేదో కాదు… రాత్రి భోజనాన్ని త్వరగా పూర్తి చేయడమే. 60 ఏళ్లు దాటినా తన యవ్వన శక్తితో ఆకట్టుకుంటున్న అగ్ర నటుడు నాగార్జున అలవాటు కూడా సరిగ్గా ఇదే కావడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే…

Read More

ఐదు కోట్ల వి’చిత్రం’ – అమెరికాలో ఒక ఆర్టిస్ట్ చిత్రాలకు క్రేజ్

సహనం వందే, అమెరికా:అద్భుతమైన ప్రకృతి చిత్రాలను గీసి తనదైన శైలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న దివంగత టీవీ హోస్ట్, చిత్రకారుడు బాబ్ రాస్ మాయాజాలం మరోసారి రుజువైంది. ఆయన చిత్రాలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ చూసి కళాలోకం ఆశ్చర్యపోతోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరిగిన వేలంలో బాబ్ రాస్ వేసిన మూడు చిత్రాలు కలిపి అక్షరాలా రూ. 5.28 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఎంతో సాధారణ ప్రకృతి చిత్రాలు రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఈయన…

Read More

టెర్రరిజం… ఢిల్లీ & హైదరాబాద్ – ఈ రెండు నగరాలే కేంద్రాలుగా ఉగ్రవాదం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశ భద్రతకు ఏళ్లుగా ఒకే రకమైన ముప్పు పొంచి ఉంది. అది ఉగ్రవాదం. 2000వ సంవత్సరంలో దేశ రాజధాని ఎర్రకోటపై లష్కరే తోయిబా కాల్పులు జరిపింది. ఢిల్లీ పోలీసులు పాకిస్తానీ ఉగ్రవాది అష్ఫాక్ అహ్మద్‌ను పట్టుకున్న నాటి నుంచి దేశంలో ఐఎస్ఐ విషపు కోరలు ఎంత లోతుగా పాతుకుపోయాయో ప్రపంచానికి తెలిసిందే. పాత ఢిల్లీలోని జామా మసీదు ప్రాంతం, హైదరాబాద్ పాతబస్తీ జిహాదీ కార్యకలాపాలకు, నకిలీ నోట్లు, పేలుడు పదార్థాలు దాచడానికి ప్రధాన కేంద్రాలుగా…

Read More

ఎడిట్ జీన్స్… డిజైన్ బేబీస్ – మీరు కోరుకున్నట్టు మీ బిడ్డ తయారు

సహనం వందే, అమెరికా:మీరు ఊహించినట్టుగానే మీ బిడ్డ ఉంటే ఎలా ఉంటుంది? చక్కటి ముక్కు… కాంతివంతమైన చర్మం… మంచి రంగు… ఒత్తయిన జుట్టు… ఆరడుగుల ఎత్తు… ఉన్నతమైన మేధస్సు – ఈ లక్షణాలన్నీ మీ ఇష్టానికి అనుగుణంగా ఎంచుకునే అవకాశం లభిస్తే? అదే ఇవాళ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేస్తున్న డిజైనర్ బేబీస్ కథ. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే కనిపించే ఈ అద్భుత సృష్టి… నేడు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘ప్రివెంటివ్’…

Read More

కామినేనికి ‘కోటి’తో చెంపపెట్టు – నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు

సహనం వందే, నల్లగొండ:నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లిలో ఉన్న కామినేని ఆసుపత్రి వైద్యులు చేసిన ఘోర నిర్లక్ష్యంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. డాక్టర్ల తప్పిదం కారణంగా బాలింత మరణించిన కేసులో మృతురాలి కుటుంబానికి ఏకంగా కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించడం సంచలనం అయ్యింది. డెలివరీకి వచ్చి ప్రాణాలు కోల్పోయి…నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన అస్నాల స్వాతి డెలివరీ కోసం 2018 జూలై 13న కామినేని ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆమెకు…

Read More

ఎగ్జిట్ హైప్… రిజల్ట్ డౌట్ – బీహార్ లో కమలం జోరు… కథ వేరు

సహనం వందే, పాట్నా:బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై నెలకొన్న ఏకపక్ష అంచనాలు విమర్శలకు తావిస్తున్నాయి. దైనిక్ జాగరణ్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్ సహా మొత్తం తొమ్మిది ప్రముఖ సర్వే సంస్థలు బీహార్‌లో ఎన్డీయేదే తిరుగులేని అధికారం అని ముక్తకంఠంతో చెప్పాయి. ఈ అంచనాల ప్రకారం సరాసరి ఎన్డీయే కూటమి సుమారు 157 స్థానాలు దక్కించుకుంటుంది. అంటే అధికార పీఠం దక్కించుకోవడానికి అవసరమైన 122 స్థానాల మెజారిటీని చాలా తేలికగా దాటేస్తుందన్న మాట….

Read More

బీహార్ ఎన్నికల్లో ఎర్రకోట పేలుళ్లు – ఢిల్లీ ఉద్రిక్తతతో దేశ వ్యాప్తంగా అలర్ట్

సహనం వందే, న్యూఢిల్లీ/పాట్నా:బీహార్ ఎన్నికలు జరగనున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడు దేశ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన ఎన్నికల సమయంలో భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చింది. మొదటి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిన బీహార్‌లో… ఈ పేలుడు ప్రభావం రెండో దశ ఓటర్లలో భయాన్ని నింపుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు….

Read More