100 Notable Books

అక్షరాలు ఎటాక్ – ‘లిబరేషన్ డే’ బుక్ సంచలనం

సహనం వందే, అమెరికా: ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రచయితలు గొప్ప గొప్ప పుస్తకాలు రచించారు. వాటిల్లో వంద పుస్తకాలను న్యూయార్క్ టైమ్స్ లిస్ట్ చేసింది. అందులో నేటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా జార్జ్ సాయిమన్ రాసిన ‘లిబరేషన్ డే’ పుస్తకం భవిష్యత్తు భయాలను చిత్రించింది. ఇందులో టెక్నాలజీ – మానవత్వం మధ్య సంఘర్షణలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ రచనలు కేవలం సాహిత్యాన్ని మాత్రమే కాదు… సమాజాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తాయి. ఈ ఆసక్తికరమైన కథనం…

Read More
LIC hands of Adani & Ambani

ఇద్దరి గుప్పిట్లోకి సామాన్యుడి ‘లైఫ్’ – ఆదానీ, అంబానీ కాళ్ల దగ్గర ప్రజల సొమ్ము

సహనం వందే, న్యూఢిల్లీ: కోట్ల మంది సామాన్యుల జీవిత భద్రతకు నిలయమైన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వ్యవహారం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. గత మూడున్నర సంవత్సరాలుగా ఎల్‌ఐసీ తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలను పరిశీలిస్తే అత్యంత రహస్యమైన కుట్ర బయటపడింది. దేశాన్ని ప్రభావితం చేసే అదానీ, రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ ప్రతిపాదన తెచ్చినా ఎల్‌ఐసీ వాటికి ఏకపక్షంగా, ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్తి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని తీర్మానాలకు…

Read More
Diabetes

డయాబెటిస్… డోంట్ వర్రీస్ – అనవసర అపోహలతో ఆరోగ్య సమస్యలు

సహనం వందే, హైదరాబాద్: డయాబెటిస్ అంటేనే చాలామంది భయపడే పరిస్థితి. ముఖ్యంగా దీని చుట్టూ అల్లుకున్న అపోహలు మరింత గందరగోళానికి గురిచేస్తాయి. ‘పంచదార తింటేనే డయాబెటిస్ వస్తుంది’ అనేది చాలా మందిలో ఉన్న బలమైన నమ్మకం. నిజానికి ఇది పూర్తి నిజం కాదు. టైప్-2 డయాబెటిస్ అనేది జన్యువులు, ఇన్సులిన్ నిరోధకత, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి వాటి కలయిక వల్ల వస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు నేరుగా డయాబెటిస్‌ను కలిగించకపోయినా… అవి బరువు…

Read More
Sarpanch Suicides

సర్పంచుల సమాధిపై పల్లెప్రగతి! – 60 మంది ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల వేళ గత ఐదేళ్ల పాలనలో జరిగిన దారుణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పల్లెప్రగతి పేరుతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సర్పంచులపై పెట్టిన తీవ్ర ఒత్తిడి ఫలితంగా కనీసం 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల మాట పక్కన పెడితే ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఇంత పెద్ద సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళనకరం. గ్రామపంచాయతీ…

Read More
AI Dolls to Elderly People

అమ్మమ్మకు ‘ఏఐ’ బొమ్మ… వృద్ధాప్యంలో తోడు – వయసు పైబడిన వారికి మాట్లాడే బొమ్మలు

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఇప్పుడు వృద్ధుల మానసిక ఆరోగ్యం ఒక పెద్ద సమస్యగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలలోకెల్లా ఇక్కడే వృద్ధులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజూ సుమారు 10 మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరియా వేగంగా అతి-వృద్ధ సమాజంగా మారిపోయింది. దేశ జనాభాలో దాదాపు ఐదో వంతు 65 ఏళ్లు పైబడిన వారే. దీంతో కుటుంబ…

Read More
Sandeep Sandilya IPS

‘చెత్త’ వాడితో ఐపీఎస్ దోస్తీ – ఢిల్లీలో మారువేషంలో ఏడు రోజులు

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా నడుపుతున్న భారీ నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ బృందం, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఛేదించాయి. ఈ మెగా ఆపరేషన్ విజయానికి ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఐపీఎస్ చేపట్టిన సాహసోపేతమైన అండర్‌కవర్ మిషన్. ఈ డ్రగ్స్ దందా మూలాలను వెలికితీయడానికి ఆయన ఏకంగా ఏడు రోజులపాటు మారువేషంలో నైజీరియన్ల డ్రగ్స్ అడ్డాలోనే మకాం వేశారు. ఈ బృందం స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా…

Read More
ED Rides on Medical Colleges

మెడికల్ కాలేజీలపై ఈడీ దెబ్బ- దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో దాడులు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా ఝులిపిస్తుంది. మెడికల్ కాలేజీల అనుమతులు, సీట్ల సంఖ్య పెంపు కోసం ఎన్‌ఎంసీలోని కొందరు ఉన్నతస్థాయి అధికారులు కోట్లకు కోట్లు లంచం తీసుకున్నారన్న అనుమానంతో గురువారం ఈడీ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద వైద్య విద్యా సామ్రాజ్యాలు ఈ దాడుల్లో చిక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌మనీ…

Read More
Billionaires Leaves India

దేశం విడిచిపోతున్న ధనలక్ష్మి – విదేశాలకు వెళ్లిపోతున్న బిలియనీర్లు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత ధనవంతులు… బిలినియర్లు… పారిశ్రామికవేత్తలు కట్టకట్టుకుని ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు? ఈ ప్రశ్నకు ఆర్థిక సలహాదారు అక్షత్ శ్రీవాస్తవ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వీరు పన్నుల నుంచి తప్పించుకోవడానికో ఇంకేదో కాదు. తమ కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసమే విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశానికి ఇది నిజంగా సిగ్గుచేటు. వ్యవస్థలోని లోపాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశ ఆర్థిక భవిష్యత్తుకు…

Read More
Online platform Food Safety Inspection

ఆన్ లైన్ లో సరు’కుళ్లు’- బ్లింక్ ఇట్, జెప్టో, జొమాటోల నాసిరకం సప్లై

సహనం వందే, హైదరాబాద్: ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో మనం నిత్యం కొనే సరుకులు ఎంతవరకు సురక్షితం? తాజా తనిఖీల్లో వెల్లడైన వివరాలు వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ జియోమార్ట్, జెప్టో, బ్లింక్ ఇట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల స్టోరేజ్ సెంటర్లు, గోదాముల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఎంత దారుణంగా ఉల్లంఘనకు గురవుతున్నాయో ఈ దాడులు బట్టబయలు చేశాయి. గడువు ముగిసిన, నాణ్యత లేని సరుకులను అమ్ముతూ ఈ సంస్థలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయనే…

Read More
Chennai-Based Visa Scam Exposed

వీసమెత్తు పనికిరానివారికి వీసా – అమెరికాలో హైదరాబాద్ పరువు గంగపాలు

సహనం వందే, హైదరాబాద్/చెన్నై: అమెరికా వెళ్లేందుకు తీసుకునే వీసా ప్రక్రియలో భారీగా మోసాలు జరిగాయని ఒక దౌత్యవేత్త సంచలన ఆరోపణలు చేశారు. భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా వ్యవస్థలోని అక్రమాలను ఒక అమెరికన్-భారతీయ దౌత్యవేత్త మహ్వాష్ సిద్ధిఖీ బట్టబయలు చేశారు. వీసాల కోసం వచ్చే దరఖాస్తులలో దాదాపు 70 నుంచి 90 శాతం వరకు నకిలీవి అని… ఈ వ్యవస్థ ఒక కుంభకోణంగా మారిందని మహ్వాష్ సిద్ధిఖీ ఆరోపణలు చేశారు. ఏమాత్రం నైపుణ్యం లేనివారు, నకిలీ…

Read More