
టీసీఎస్ లో ఉద్యోగాల ఊచకోత – నైపుణ్యం లేదంటూ12 వేల మంది బలి
సహనం వందే, న్యూఢిల్లీ:టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దేశ ఐటీ రంగంలో గొప్పలు చెప్పుకునే సంస్థ. కానీ ఇప్పుడు తన ఉద్యోగులను రోడ్డున పడేసే దుర్మార్గానికి ఒడిగట్టింది. 12,000 మంది ఉద్యోగులను అంటే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం మందిని ఏడాది కాలంలో తొలగించేందుకు ఈ కార్పొరేట్ కంపెనీ కత్తి సానబెట్టింది. క్లయింట్ డిమాండ్లు, ఆటోమేషన్, కొత్త టెక్నాలజీ అవసరాలను సాకుగా చూపుతూ మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగుల జీవితాలను చిదిమేస్తోంది. దశాబ్దాలుగా కంపెనీకి చెమటోడ్చి సేవలందించిన…