ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చీఫ్ అసంతృప్తి

సహనం వందే, హైదరాబాద్: మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని, వెంటనే తమ పనితీరును సరిదిద్దుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసిన ఆయన, ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లో మాట్లాడుతూ, పలువురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో…

Read More

రేపు హైదరాబాదుకు ప్రభాకర్ రావు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్ రావు రేపు రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. పాస్‌పోర్ట్ రద్దు కావడంతో ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్‌కు దరఖాస్తు చేసుకోగా, అది మంజూరైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఇండియాకు బయలుదేరనున్నారు. 8వ తేదీ అర్థరాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 9వ తేదీ ఉదయం…

Read More

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట

సహనం వందే, యాదాద్రి: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ సేవలు అందిస్తున్న తరహాలోనే తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన…యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు…

Read More

చంద్రబాబు సరికొత్త సంప్రదాయం

సామాన్యులకు సలహాదారు పదవులు సహనం వందే, అమరావతి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఎంతో మంది సీనియర్ నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరి అంచనాలకు అందని వ్యక్తులను సలహాదారులుగా నియమిస్తూ తనదైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ సలహాదారుగా ‘ఫారెస్ట్ మ్యాన్’ గా పేరొందిన జర్నలిస్ట్ అంకారావును నియమించడం తాజా ఉదాహరణ. అంకారావు నియామకంపై సీఎం ప్రకటించే వరకు ఆయనకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. నల్లమల అటవీ…

Read More

రోడ్‌షోలు అవసరమా..?

సహనం వందే, ముంబై: బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట, 11 మంది మరణం పట్ల భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయాలను పురస్కరించుకొని రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని, మనుషుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు….

Read More

ఇథనాల్ ఫ్యాక్టరీ హింసాత్మక ఆందోళనలు

సహనం వందే, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా రాజోలి మండలం పెద్ద ధనవాడలో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు హింసాత్మక ఆందోళనలకు దిగారు. ఫ్యాక్టరీ వద్ద గుడిసెలు, పరికరాలను ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం పెరుగుతుందని, నీరు కలుషితమవుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నారాయణపేట, దిలావర్‌పూర్‌లలోనూ ఇలాంటి ఆందోళనలు జరిగాయి.

Read More

వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు సహనం వందే, హైదరాబాద్: ప్రస్తుత వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం వర్షాకాల సన్నద్ధతపై…

Read More

తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలుపుతాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహనం వందే, హైదరాబాద్: తెలంగాణను 2047 నాటికి ప్రపంచ అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు…

Read More

నాగ’బాబు’కు హ్యాండ్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ… ఇప్పుడు ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ను చేర్చుకోవడంపై చంద్రబాబు నాయుడు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గ్లామర్ ముందు మంత్రి లోకేష్ వెలవెల బోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే…

Read More

ఆసుపత్రుల్లో కరెంట్ కష్టాలు

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో కరెంటు కష్టాలు రోగుల పాలిట శాపంగా మారాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరెంటు కోతతో వైద్యులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ల సాయంతో రోగులకు చికిత్స అందించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య ఆరోగ్యశాఖ స్పందించి, ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. అయితే,…

Read More