sahanamvande@gmail.com

IIM Bangaluru

బెంగళూరు ఐఐఎం ప్లేస్‌మెంట్స్ కుంభకోణం – పీజీ స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్ కమిటీ నిర్వాకం

సహనం వందే, బెంగళూరు: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. 20 మంది సభ్యులున్న విద్యార్థి ప్లేస్‌మెంట్ కమిటీ మొత్తం ఒక్కసారిగా రాజీనామా చేయడంతో 2026 నాటి నియామక ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 10న ఈ సామూహిక రాజీనామా జరిగింది. అసలు ఈ రాజీనామాలకు కారణం ఏమిటంటే… నియామక ప్రక్రియలో ఓ ముఖ్యమైన నిబంధనను కమిటీ సభ్యులకు అనుకూలంగా ఉండేలా…

Read More
Ramdev Baba Karam

రాందేవ్ బ్రాండ్ కారంతో రోగం – పురుగుమందుల మోతాదు అధికం!

సహనం వందే, న్యూఢిల్లీ: దేశీయ ఉత్పత్తులు, ఆరోగ్యం అంటూ డబ్బా కొట్టుకునే బాబా రాందేవ్ యాజమాన్యంలోని పతంజలి ఫుడ్స్ కంపెనీకి లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్ యూనిట్‌లో తయారు చేసిన పతంజలి ఎర్ర కారం పొడి శ్యాంపిల్స్‌లో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావు జాదవ్ స్వయంగా వెల్లడించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీపై లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయాన్ని…

Read More
Australia Beach attacks

యూదులు లక్ష్యం… చారిత్రక శతృత్వం – ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడి వెనక కారణం అదే

సహనం వందే, ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో బాండీ బీచ్‌లో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మృతి చెందారు. ఉల్లాసంగా ఉన్న వాతావరణంలోకి తుపాకీ గుళ్లు దూసుకురావడం… చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ఊచకోత కోయడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాల్పులకే పరిమితం కాకుండా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు దొరకడం ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందనడానికి నిదర్శనం. ఇది కేవలం ఆవేశంలో చేసిన దాడి కాదు… యూదులు పై విధ్వంసం సృష్టించడానికి…

Read More
Bapatla incident

భార్య శవంతో బైకుపై పోలీస్ స్టేషన్‌కు..! – హత్య చేసి లొంగిపోయిన భర్త

సహనం వందే, బాపట్ల: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపిన ఓ హంతకుడు చేసిన పని ఉలికిపాటుకు గురిచేసింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి హతమార్చిన భర్త వెంకటేశ్వర్లు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆ మృతదేహాన్ని తన బైకుపై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ దృశ్యం చూసి పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక మనిషి ఇంత దారుణంగా వ్యవహరించడం సమాజంలో పెరిగిపోతున్న…

Read More
One Sperm Hundreds of Kids

వందలాది పిల్లలకు తండ్రి అయ్యే ఛాన్స్ – ప్రపంచవ్యాప్తంగా వీర్య దానం కోట్ల వ్యాపారం

సహనం వందే, లండన్: ప్రపంచవ్యాప్తంగా వీర్య దానం ఇప్పుడు వేల కోట్ల వ్యాపారంగా వృద్ధి చెందుతోంది. ఒకే వ్యక్తి స్పెర్మ్ ద్వారా వందల మంది పిల్లలు పుడుతున్న సంచలన విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘బీబీసీ’ న్యూస్ ఛానల్ (https://bbc.in/48SL4MG) ఇటీవల నిర్వహించిన పరిశోధనలో ఒక దాత వీర్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యు మార్పు ఉన్నట్లు తేలింది. ఈ వ్యక్తి వీర్యాన్ని ఏకంగా 14 దేశాలకు పంపించి దాని ద్వారా కనీసం…

Read More
Sanskrit in Pakistan

పాకిస్తాన్ కోటలో సంస్కృత పాఠాలు – అక్కడి యూనివర్సిటీలో భాష బోధన

సహనం వందే, పాకిస్తాన్: ఏడు దశాబ్దాల తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశ విభజన తర్వాత ఏకంగా ఏడు దశాబ్దాలకు అక్కడ మళ్లీ సంస్కృత మంత్రాలు వినిపిస్తున్నాయి. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎల్ యూఎంఎస్) తొలిసారిగా సంస్కృత బోధనను పునరారంభించింది. ఇది కేవలం భాష కాదు ఇదొక సాంస్కృతిక వారధి అని అక్కడి ప్రొఫెసర్లు బల్లగుద్ది చెబుతున్నారు. భారత పాకిస్తాన్ ఉమ్మడి వారసత్వంలో సంస్కృతం కీలకమని… అందుకే పురాతన గ్రంథాలను…

Read More
Jagan Vs Sharmila

నా ఆస్తి నా ఇష్టం – షర్మిల వాటాకు జగన్ టాటా

సహనం వందే, హైదరాబాద్: తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అంటున్నాడు. రాజకీయంగా చెల్లెలు తనకు వ్యతిరేకంగా మారడంతో ఆమెకు ప్రేమతో ఇచ్చిన వాటాలను కూడా వెనక్కి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించిన జగన్… ఇప్పుడు ఏకంగా చెన్నైలోని జాతీయ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం ఆస్తి వివాదం కాదని… రాజకీయ వైరమే ప్రధాన కారణమని…

Read More
Indians to Foreign Countries

విదేశీ సిటిజెన్’చిప్ప’ కోసం… – భారత పౌరసత్వం వదులుకుంటున్న లక్షలాది

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంపై ప్రజలకు నమ్మకం సడలుతోంది. దేశంలోని పాలన, వ్యవస్థల పట్ల తీవ్రమైన నిరాశ, అసంతృప్తి పెరిగిపోతుంది. దీంతో అనేకమంది దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. దేశ పౌరసత్వాన్ని వదిలేసి విదేశాల్లో శాశ్వతంగా ఉండిపోతున్నారు. కోటీశ్వరులు మొదలు మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలు కూడా పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. నాణ్యమైన జీవనం కోసం వీరంతా విదేశీ బాట పడుతున్నారు. ఇక్కడ కష్టపడి చదువు పూర్తి చేసిన యువత ఉన్నత విద్య…

Read More
Swamynathan

‘దీపం’ మంటల్లో న్యాయమూర్తి – మద్రాస్ న్యాయమూర్తి స్వామినాథన్‌కు సెగ

సహనం వందే, న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలని కోరుతూ 100 మందికి పైగా ఎంపీలు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులతో సహా 50 మందికి పైగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ చర్య న్యాయమూర్తులను బెదిరించే ప్రయత్నమేనని… ఇది ప్రజాస్వామ్య మూలాలను, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీస్తుందని వారు…

Read More
Gorrelakunta Murders

ఐదేళ్ల నరమేధం… వీడని భయం – వరంగల్ జిల్లాలో సీరియల్ కిల్లర్ వ్యవహారం

సహనం వందే, వరంగల్: ఐదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాలను వణికించిన గొర్రెకుంట సీరియల్ కిల్లర్ వ్యవహారం ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంది. కేవలం ఒక అక్రమ సంబంధంతో మొదలైన ఈ దారుణం పది మంది హత్యకు దారితీసింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 2020 మే నెలలో జరిగిన ఈ సామూహిక హత్యల ఘటన నేరం ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో చూపించింది. పోలీసుల చర్యలతో నేరస్తుడికి ఉరిశిక్ష పడినా ఆ…

Read More