మరణమే లేకుండా… అధికారమే శాశ్వతంగా! – చైనాలో పుతిన్‌, జిన్‌పింగ్, కిమ్ సమాలోచన

సహనం వందే, చైనా:చైనాలో చారిత్రక తియాన్మెన్ చౌక్‌లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఓ రహస్య సంభాషణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచ రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వీరు ఇప్పటికే అనేక వ్యూహాలు రచిస్తుంటారు. అయితే ఈసారి వీరి సంభాషణ చావును జయించి శాశ్వతంగా అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే దానిపై జరిగినట్లు సీక్రెట్ చర్చ బయటపడింది. జీవశాస్త్ర సాంకేతికతతో అవయవ మార్పిడి ద్వారా…

Read More

అగ్రరాజ్యంగా చైనా – నాటి రష్యా పాత్రను పోషిస్తున్న డ్రాగన్ కంట్రీ

సహనం వందే, చైనా:ఒకప్పుడు కమ్యూనిస్ట్ రష్యా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని ప్రపంచానికి అండగా నిలబడింది. ఇప్పుడు అదే బాధ్యతను కమ్యూనిస్ట్ చైనా భుజానికెత్తుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికాపై విమర్శల వర్షం కురిపిస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టిస్తున్నారు. అమెరికా విధానాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ సుంకాల విధానాల వల్ల అనేక దేశాలు నష్టపోతున్నాయి. చైనా, భారత్‌ వంటి దేశాలను లెక్కచేయకుండా సుంకాలు విధిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంపై షీ…

Read More

కమ్యూనిస్టు కారులో మోడీ షికారు – చైనాలో హాంగ్చీ ఎల్5లో మోడీ ప్రయాణం

సహనం వందే, చైనా:షాంఘై సహకార సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సొంతంగా వాడే అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు హాంగ్చీ ఎల్5 లిమోసిన్‌లో ఆయన ప్రయాణించారు. ఈ కారు కేవలం ఉన్నత స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఎంపిక చేసిన విదేశీ అతిథులకు మాత్రమే కేటాయించేది. 2019లో జిన్‌పింగ్ భారత్‌క వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించారు. ఈ కారు కేవలం…

Read More

డ్రాగన్ ‘గోల్డ్’ రష్… డాలర్ ఫినిష్ – చైనా బంగారం వేట!

సహనం వందే, చైనా:అంతర్జాతీయంగా అమెరికా ఆధిపత్యానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటన్ ఇప్పుడు బితుకు బితుకుమంటూ కాలం వెళ్లదీస్తుంది. అలాగే ఒకనాడు సోవియట్ రష్యా అమెరికాతో ఢీ అంటే ఢీ అన్నట్లు శాసించి కనుమరుగైపోయింది. అలాగే అమెరికా కూడా ఇప్పుడు తన ఆధిపత్యాన్ని కొనసాగించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని డ్రాగన్ కంట్రీ చైనా కలలు కంటుంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ…

Read More

అమెరికా ఇళ్లల్లో ‘చైనా’ కష్టాలు

సహనం వందే, అమెరికా: అమెరికన్ల ఇళ్లల్లో చైనా ఉత్పత్తులు లేని జీవితాన్ని ఊహించలేం. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బొమ్మలు, ఫర్నిచర్ వంటి నిత్యవసరాల్లో చైనా వాటా అత్యధికం. అయితే కొత్త టారిఫ్‌ల కారణంగా వీటి ధరలు భారీగా పెరగడమే కాకుండా, కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అక్కడి మీడియా హెచ్చరించింది. ఈ మార్పులు అమెరికన్ ఇళ్లపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. చైనాపై తిరుగులేని ఆధారం…బొమ్మల్లో 97%, బూట్లలో 92%, ఎలక్ట్రానిక్స్‌లో 80% దిగుమతులు చైనా నుంచే…

Read More

అందాల వేదికపై ఎర్రజెండా

సహనం వందే, హైదరాబాద్: చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ప్రోత్సహిస్తుంటే… క్యూబా, ఉత్తర కొరియా కమ్యూనిస్టు దేశాలు మాత్రం వాటిని పాశ్చాత్య సంస్కృతిగా దూరంగా ఉంచుతున్నాయి. ఇండియా కమ్యూనిస్టులు సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ ఉనికికోసం చైనా తహతహ… చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయంగా తమ…

Read More