సీపీఎం నేత నర్రా రమేష్ మృతి

సహనం వందే, ఖమ్మం:ఖమ్మం జిల్లా సీపీఎం సీనియర్ నాయకులు నర్రా రమేష్ శనివారం తెల్లవారుజామున 2:40 గంటలకు మరణించారు. ఆయన ఎస్ఎఫ్ఐలో చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత పార్టీ ఉద్యమంలో పనిచేశారు. ఆయన భౌతికకాయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం కాల్వొడ్డు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read More

హైదరాబాదులో మార్వాడీపై దాడి – బీజేపీలో అంతర్గత గొడవలే కారణం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక మార్వాడీపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి కారణమని స్పష్టమవుతోంది. ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి, విజయ్ దేవడా అనే మార్వాడీపై దాడి చేశారు. ఆర్కేపురంలో విజయ్ దేవడా ఏర్పాటు చేసిన వినాయకుడి దర్శనానికి సరూర్ నగర్ బీజేపీ…

Read More

అవినీతి అనకొండ హరీష్ – శివాలెత్తిన కవిత… బావపై తీవ్ర ఆరోపణలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు ఒకవైపు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. మాజీ మంత్రి, తన బావ హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మూల కారణమని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారి స్వార్థం, అవినీతి వల్లే…

Read More

వ్యవసాయ విస్త’రణం’అధికారులు – ఏఈఓల ప్రమోషన్ల చిక్కుముడి

సహనం వందే, హైదరాబాద్:వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పదోన్నతులు అంతులేని చిక్కుముడిగా మారాయి. వ్యవసాయంలో డిగ్రీ (బీఎస్సీ అగ్రికల్చర్) పూర్తి చేసి నేరుగా ఏఈఓలుగా నియమితులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం ఆరోపించింది. మరోవైపు కేవలం డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవారు ఇన్-సర్వీస్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి సీనియారిటీని తొక్కేస్తున్నారని ఆ సంఘం మండిపడుతోంది. దీనివల్ల దాదాపు 750 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓలు తమ పదోన్నతుల కోసం తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని…

Read More

ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ – అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు బంద్

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 1300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ పరిణామం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు చేసినందుకు తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నెట్‌వర్క్ ఆసుపత్రులు చాలా…

Read More

కుర్చీ వదలని ఎంఎన్ జే డైరెక్టర్

సహనం వందే, హైదరాబాద్:ఎంఎన్ జే డైరెక్టర్ శ్రీనివాసులును వెంటనే రిలీవ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఈనెల 26వ తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రతిరోజూ ఆయన ఆస్పత్రికి వస్తూనే ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ పోస్టులో విధులు నిర్వహిస్తుండటంపై ఆసుపత్రి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం తప్పించినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి యంత్రాంగం ఆయనను ఎందుకు రిలీవ్ చేయడం లేదని…

Read More

స్మిత సబర్’వార్’ – రేవంత్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సెలవు నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఆరు నెలలపాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవడం వెనుక నిజమైన కారణాలు ఏంటనేది అంతుచిక్కడం లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగే సమయంలో సెలవు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో…

Read More

జీరో యూరియా దందా… వ్యాపారుల మాయ- ఫ్యాక్టరీల నుంచి నేరుగా తెచ్చి వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్:రైతుకు యూరియా కొరత నిద్రపట్టనివ్వడం లేదు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి గంటల తరబడి ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిల్చోవడం నిత్యకృత్యమైపోయింది. ఈ దుస్థితిని కొందరు డీలర్లు, వ్యాపారులు అవకాశంగా తీసుకుని యూరియా బ్లాక్ దందాకు తెరతీశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 270 విలువ గల 45 కిలోల యూరియా బస్తాను కొన్నిచోట్ల రూ. 500 పైగా అమ్ముతున్నారు. ఒక బస్తా కావాలంటే ఇతర సరుకులను కూడా కొనాలనే షరతులు, క్యాష్ అండ్ క్యారీ…

Read More

యూరియా సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యం – జాన్ వెస్లీ విమర్శ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, రైతులు నెలరోజులుగా యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బీజేపీ నాయకులు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమే కారణమని ఆరోపించారు. కృత్రిమ కొరత పేరుతో బీజేపీ…

Read More

అధికారుల తీరుతో అన్నదాత బలి – నాడు రుణమాఫీ… నేడు యూరియా

సహనం వందే, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంలో ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వ్యవసాయశాఖలో ఎవరైనా కోవర్టులుగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ పండితులు. అప్పట్లో రుణమాఫీ విషయంలోనూ… ఇప్పుడు యూరియా కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ యంత్రాంగ నిర్లక్ష్యమే నిదర్శనమని చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారును ఇరుకున పెట్టే విధంగా కొందరు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలతో కలిసి…

Read More