
ఆయిల్ పామ్ అక్రమాలపై డీఎన్ఏ కొరడా – నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన
సహనం వందే, హైదరాబాద్:కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో అశ్వారావుపేటలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన ఈ బృందం… పూర్తిస్థాయిలో ఈ మూడు రోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయమంది. ఆయిల్ పామ్ మొక్కల్లో జరిగిన అక్రమాలు… నాణ్యతా లోపాలపై ఈ బృందం లోతైన పరిశోధన చేయనుంది. అంతేకాదు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఏకంగా డీఎన్ఏ పరీక్షలు చేయాలని…