
ఆ రిపోర్టులోనే… ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల బాగోతం
సహనం వందే, హైదరాబాద్:ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి… ఆయిల్ ఫెడ్ కు కొద్ది నెలలపాటు ఎండీగా పనిచేశారు. ఆయన ఉన్న కొన్ని రోజుల్లోనే కార్పొరేషన్ ను గాడిలో పెట్టాలని ప్రయత్నించారు. అంతకు ముందు జరిగిన అక్రమాలపై దృష్టి సారించారు. అందుకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక తయారు చేయించారు. ఆయిల్ ఫెడ్ ఎండీగా సురేందర్ పనిచేసిన కాలంలో చేపట్టిన కార్యక్రమాలు… అందులో జరిగిన అక్రమాలు ఈ రిపోర్టులో సమగ్రంగా పొందుపరిచారు. ఆ రిపోర్టు ప్రకారం కొందరిపై చర్యలకు…