Street Dogs Murder

కుక్కల సంహారం… గ్రామాల్లో గందరగోళం – తెలంగాణలో 500 కుక్కలు హతం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో కొన్ని గ్రామాల్లో కుక్కల సంహారం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు కుక్కల వేట మొదలుపెట్టారు. వీధి కుక్కల బెడద తీరుస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రక్తం చిందించారు. మూగజీవాలను రాక్షసంగా అంతమొందించారు. కుక్కలను విషపు ఇంజక్షన్లతో చంపేసి గుంతల్లో పాతేశారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దాన్ని ఇండియా టుడే మీడియా వెలుగులోకి తెచ్చింది. హామీ తీరింది… ప్రాణం పోయిందితెలంగాణలోని కామారెడ్డి,…

Read More
OS Group Founder Oscar 24 Years Young Entrepreneur

24 ఏళ్లు… 340 కోట్లు – చిన్న వయసులో బూట్ల వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్: వ్యాపారవేత్త కావడానికి అనుభవం కంటే ఆలోచన ముఖ్యమని నిరూపించాడు 24 ఏళ్ల అమెరికా యువకుడు ఆస్కార్ రాచ్‌మాన్స్కీ. అందరూ చదువుల వెంట పడుతుంటే తను మాత్రం స్పోర్ట్స్ షూస్ అమ్మకాలతో కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కేవలం ఐదేళ్ల క్రితం ఒక చిన్న గదిలో మొదలైన తన ప్రయాణం.. నేడు ఏటా వందల కోట్ల ఆదాయం గడించే స్థాయికి చేరింది. యువతకు ఇదొక స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ. అమెరికా కుర్రాడి అద్భుత ప్రయాణంన్యూజెర్సీకి…

Read More
Anil Ravipudi - Tollywood Most Wanted

టాలీవుడ్ ‘మోస్ట్ వాంటెడ్’ – అనిల్ రావిపూడి కోసం వేట

సహనం వందే, అమరావతి: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పటాస్ లా మొదలైన అనిల్ రావిపూడి విజయ యాత్ర… ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తీసిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో పీక్ స్టేజ్‌కు చేరింది. సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్లతో పాటు భగవంత్ కేసరితో సీరియస్ హిట్లు కొట్టిన అనిల్… తాజా చిత్రంతో నిర్మాతలకు ఆణిముత్యంలా మారారు. దీంతో ఆయనతో సినిమా కోసం నిర్మాతలు, హీరోలు క్యూలు కడుతున్నారు. విజయాలు…

Read More
Rohit Paul Singh Telangana Bar Council elections

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో యువ అడ్వకేట్ – జూనియర్ల ఆశాకిరణం రోహిత్ పాల్ సింగ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అడ్వకేట్ డి. రోహిత్ పాల్ సింగ్ ఒక శక్తివంతమైన గొంతుకగా అవతరించారు. అటు సీనియర్లు… ఇటు జూనియర్ల నుంచి ఆయనకు విశేష ఆదరణ లభిస్తోంది. అందుబాటులో ఉండే తత్వం, నిబద్ధత గల నాయకత్వంతో న్యాయవాదుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. మొదటి నుంచి అండగా…రోహిత్ పాల్ సింగ్ 2013లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు యువ న్యాయవాదులకు ఆయన ఒక…

Read More
Fidel Castro - Trump

ఫిడెల్… అమెరికా గుండెల్లో ధడేల్ – అగ్రరాజ్యాన్ని వణికించిన నాటి క్యూబా నేత

సహనం వందే, హైదరాబాద్: ఒక చిన్న ద్వీప దేశం.. ఆ చిన్నదేశంలో ఓ నాయకుడు అమెరికా సామ్రాజ్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మడురోను పట్టుకుని ఎత్తుకెళ్లామని అమెరికా ఈ రోజు గర్వంగా ప్రకటించుకుంటోంది కానీ ఇదే అమెరికా.. ఇదే సీఐఏ.. అదే సముద్రం అవతల క్యూబా అనే చిన్న దేశంలో మాత్రం ఒక మనిషి తలవెంట్రుకను కూడా పీకలేకపోయింది.. అతనే ఫిడెల్ క్యాస్ట్రో..! తలవంచని యోధుడు…అతను ఒక మనిషి కాదు.. ఒక తలవంచని…

Read More
Tourist Visa Scrutiny

విజిటింగ్ వీసా… ఊచల బాట! – పర్యాటక వీసాలపై వెళ్లి ఉద్యోగం చేస్తే జైలే

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై అడుగు పెట్టాలనేది కోట్లాది మంది భారతీయుల కల. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో చేసే చిన్న తప్పులు జీవితాంతం శాపంగా మారుతున్నాయి. తాజాగా అమెరికా ఎంబసీ జారీ చేసిన హెచ్చరికలు చూస్తుంటే నిబంధనల ఉచ్చు ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది. వీసా రావడం ఒక ఎత్తయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. నిబంధనల ఉచ్చు బిగుస్తోందిభారత్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం పర్యాటక వీసాదారులకు తాజాగా ముందస్తు…

Read More
Cow scam Jabalpur

పశువైద్యుల గో’మేత – క్యాన్సర్ ప్రాజెక్టు నిధులతో జల్సాలు

సహనం వందే, జబల్ పూర్: గోమాతను పూజించే దేశంలో ఆవు పేరిట భారీ దోపిడీకి తెరలేపారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేసే పరిశోధనల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులను కొందరు అధికారులు తమ విలాసాలకు వాడుకున్నారు. పరిశోధనలు పక్కన పెట్టి విలాసవంతమైన కార్లు, విమాన ప్రయాణాలతో ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా తగలేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లోని నానాజీ దేశ్‌ముఖ్ పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆవుల…

Read More
Prof.Jayashankar Agri.University Exam Paper Leak Scam

అగ్రి లీకేజీ… భారీ ప్యాకేజీ – వ్యవసాయ వర్సిటీ పేపర్ల దందాలో పెద్దలు

సహనం వందే, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమాల పుట్ట పగిలింది. అన్నదాతకు సాయం చేయాల్సిన ఏఈఓలే ఇప్పుడు కాపీ కొట్టి దొరికిపోయారు. తమ ప్రమోషన్ల కోసం ఏకంగా పేపర్లనే కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ప్రభుత్వ సొమ్ముతో చదువుకుంటూ అక్కడే సిబ్బందికి ఆశ చూపి పేపర్లను బయటకు తెచ్చారు. గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు బట్టబయలైంది. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు వివరాలు చూస్తే సామాన్యుడు విస్తుపోవాల్సిందే. భ్రస్టు…

Read More
Demand for High Value Homes

సిటీ డ్రీమ్… రిచ్ గేమ్ – కోటి దాటిన ఇళ్లనే కొంటున్న ధనవంతులు

సహనం వందే, హైదరాబాద్: భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఇతర ప్రధాన నగరాల్లో అమ్మకాలు తగ్గుతున్నా… హైదరాబాద్ లో మాత్రం ఇళ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ పెరగడంతో పాటు ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం నగర రియల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇళ్ల విక్రయాల జోరు…హైదరాబాద్ నగరం 2025 సంవత్సరంలో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది….

Read More
Surgeons met CM

సర్జన్ల భవనానికి సీఎం సహకారం – రేవంత్ రెడ్డిని కోరిన డాక్టర్ బొంగు రమేష్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్యను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని సర్జన్ల నైపుణ్యాలను మెరుగుపరచడానికి, యువ వైద్యులకు ప్రపంచస్థాయి శిక్షణ అందించడానికి ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మహత్తర ఆశయానికి ప్రభుత్వం నుంచి భూమి సహకారం కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించింది. ముఖ్యమంత్రితో భేటీ…అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏఎస్ఐ…

Read More