అమరావతికి కలిశెట్టి మొక్కులు – రైతులకు ఎంపీ అప్పలనాయుడు అండదండ
సహనం వందే, అమరావతి: అమరావతి రాజధాని కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం నేడు చారిత్రక ఘట్టానికి చేరింది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎదురించి ప్రాణాలను పణంగా పెట్టిన రైతుల కృషి ఫలించింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ విజయోత్సవంలో రైతులతో కలిసి పంచుకున్న భావోద్వేగ క్షణాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అరసవిల్లి మొక్కు తీరింది…రాజధాని చట్టబద్ధత కోసం నాడు రైతులు అమరావతి నుండి అరసవిల్లి వరకు పాదయాత్ర చేశారు. ఆ…