నకిలీ వైద్యంపై ఐఎంఏ ఉక్కుపాదం – రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
సహనం వందే, హైదరాబాద్: వైద్య రంగం నేడు కనీవినీ ఎరుగని కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆసుపత్రులపై నిబంధనల సంకెళ్లు. మరోవైపు అకారణంగా వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు. పల్లెల్లో నకిలీ వైద్యుల ప్రాణసంకటం. ఈ గడ్డు పరిస్థితుల్లో వైద్యుల పక్షాన నిలిచి పోరాడేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర యాక్షన్ కమిటీ కదనరంగంలోకి దూకింది. వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించిందని గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ కిరణ్ మాదల ఒక ప్రకటనలో…