తెల్లకోటుకు గడ్డుకాలం – అందని జీతాలు… రోడ్డునపడ్డ బతుకులు
సహనం వందే, హైదరాబాద్: రోగులకు ప్రాణం పోసే వైద్యుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం దెబ్బకు తెలంగాణ గడ్డపై వైద్య వ్యవస్థ కునారిల్లుతోంది. అహోరాత్రులు శ్రమిస్తున్నా అందని జీతాలు… పదోన్నతులు లేని సర్వీసులతో డాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ దుస్థితిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సమరశంఖం పూరించింది. ఈ మేరకు శనివారం వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీతాల కోసం నిరీక్షణతెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో…