దిల్ రాజు అట్టర్ ప్లాప్… స్టార్లను రప్పించడంలో ఘోర వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు… తన సొంత కార్యక్రమాలకు స్టార్ హీరోలను, ఇతర సినీ ప్రముఖులను సులభంగా రప్పించగల సత్తా ఉన్నవారు. అలాంటి దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గద్దర్ అవార్డు ఫంక్షన్‌ కు స్టార్ హీరోలను రప్పించడంలో చేతులెత్తేయడం విస్మయం కలిగిస్తోంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, బ్రహ్మానందం…

Read More

ఆయిల్ ‘ఫ్రాడ్’తో కోటీశ్వరులు – కోట్లకు పడగలెత్తిన అధికారులు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ లో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థను ఫణంగా పెట్టి కోట్లకు పడగలెత్తుతున్నారని అందులోని ఉద్యోగులే మండిపడుతున్నారు. తమ అధికారాలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పామాయిల్ మొక్కల్లో అక్రమాలు, నూనెల విక్రయాల్లో అవకతవకలు, నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్లలో గోల్మాల్… ఇలా అనేక రూపాలుగా అవినీతి పేరుకుపోయినట్లు చెప్తున్నారు. అందులోని కీలక స్థానాల్లో ఉన్నవారు సిండికేట్ అయ్యి సంస్థను నట్టేట ముంచుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం…

Read More

మెడికోలను బెదిరిస్తున్న యాజమాన్యాలు…

సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ధర్నా చేస్తున్న మెడికోలను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ఇలా ధర్నాలు చేస్తే మీ డాక్టర్ డిగ్రీ ఎలా వస్తుందో చూడండని వార్నింగ్ ఇస్తున్నాయి. సోమవారం వికారాబాద్ లోని మహావీర్ మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమకు స్టైఫెండ్ ఇవ్వాలని కోరారు. దీంతో కాలేజీ యాజమాన్యం చెందిన ప్రతినిధి ఒకరు వారి…

Read More

గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ లో పెద్దలెక్కడ?

సహనం వందే, హైదరాబాద్:సినిమా పరిశ్రమకు తామే పెద్దలమని చెప్పుకుంటారు. కళామతల్లి బిడ్డలమని డబ్బా కొట్టుకుంటారు. పొద్దున్న లేస్తే నీతి కబుర్లు చెబుతుంటారు. పైనుంచి దిగివచ్చిన దేవదూతలుగా భావిస్తుంటారు. అలాంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ కు హాజరు కాకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో ఉంటూ… ఇక్కడి భూములపై రాయితీలు అనుభవిస్తూ… సినిమా టిక్కెట్లకు ధరలు పెంచుకుంటూ వందల వేల కోట్లకు పడగలెత్తిన మన కళామతల్లులు…

Read More

ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ అధికారాలకు కత్తెర

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి అధికారాలకు కత్తెర పడింది. అంతేకాదు ఆయనకు ఘోర అవమానం జరిగింది. తద్వారా కార్పొరేషన్ జీఎం పోస్టును డమ్మీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకునే దానికంటే సంస్థ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జనరల్ మేనేజర్ పోస్టు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఎండీ తర్వాత కీలకమైన బాధ్యతగా ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి…

Read More

కాళేశ్వరం డబ్బుతో థాయిలాండ్ లో కుమారుడి పెళ్లి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఇరిగేషన్ శాఖలో అవినీతి ఏ స్థాయిలో తిష్ట వేసిందో ఏసీబీ దర్యాప్తులు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కావడం, ఈ కేసులో ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారుల పాత్రపై సంచలనం సృష్టిస్తోంది. శ్రీధర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించగా, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాలను ధిక్కరించిన వైనం, ఇతర అధికారుల సహకారం ఈ అవినీతి…

Read More

మంత్రుల గుండెల్లో రేవంత్ రెడ్డి- శాఖల కేటాయింపు వెనుక వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్‌గా ఉంచారు. దీంతో పాత మంత్రులు…

Read More

వేణుస్వామి మైండ్ గేమ్ – సెలబ్రిటీల గోప్యతపై దాడి

సహనం వందే, హైదరాబాద్:ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సంఘటనను తాను ముందే చెప్పానని జ్యోతిష్యురాలు శర్మిష్ఠ చేసిన పిచ్చి వ్యాఖ్యలపై దేశం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జ్యోతిష్యం చెప్తున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అచ్చం అలాగే తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సెలబ్రిటీలతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. వారికి మానసిక వేదన కలిగిస్తూ కోట్లు గడుస్తున్నాడు. జోస్యం చెప్పి… దాని విరుగుడుకు యజ్ఞ యాగాల పేరుతో వసూళ్లు…

Read More

అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ – రాజకీయ రంగ ప్రవేశం

సహనం వందే, హైదరాబాద్:భారత క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 35 ఏళ్ల అసదుద్దీన్ గతంలో హైదరాబాద్ కోల్ట్స్, గోవా వంటి జట్లకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. తన రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నుండి అపారమైన స్ఫూర్తి పొందినట్లు అసదుద్దీన్ వెల్లడించారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం పట్ల, పార్టీ విలువల పట్ల కనబరుస్తున్న నిబద్ధత తనను ఎంతగానో…

Read More

ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ – ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి

సహనం వందే, హైదరాబాద్:పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ‘ప్రజాస్వామ్యం- పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వాలు వ్యతిరేక వార్తల పట్ల కొంత అసంతృప్తి చూపేవి కానీ ఇప్పుడు అసహనం నుంచి కక్ష సాధింపు వరకు వచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వాలు పూర్తిగా…

Read More