దివ్యక్షేత్రం బద్రీనాథ్ యాత్రకు శ్రీకారం

సహనం వందే, చమోలి: ఉత్తరాఖండ్ హిమాలయాల ఒడిలో కొలువై ఉన్న పవిత్ర బద్రీనాథ్ ధామ్, ఆరు నెలల నిరీక్షణ తర్వాత తన దివ్య ద్వారాలు తెరుచుకుంది. ఆదివారం ఉదయం వేద మంత్రాల దివ్య ధ్వనులు మారుమోగుతుండగా, మంగళకరమైన సంగీతాల నడుమ, 40 క్వింటాళ్ల సుగంధ భరిత పుష్పాల అలంకరణతో శోభాయమానంగా ఆలయ గర్భగుడి తలుపులు తెరిచారు. ఈ శుభ సందర్భంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొని తొలి పూజలు నిర్వహించారు. భక్తుల హృదయాలు…

Read More

జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

జడ్జీల సంఘం నేతలు మురళిమోహన్, ప్రభాకరరావు సంతాపం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఆమె మృతికి తెలంగాణ జడ్జీల సంఘం అధ్యక్షులు కె. ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.మురళి మోహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. న్యాయసేవల రంగంలో ప్రియదర్శిని చేసిన కృషిని వారు కొనియాడారు. ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు….

Read More

రాముడు ‘పురాణ పాత్ర’

సహనం వందే, ఢిల్లీ: అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాముడిని పురాణ పాత్రగా అభివర్ణించడం తీవ్ర దుమారం రేపింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక సిద్ధాంతాన్ని కలిగి ఉందని, రాహుల్ రామ వ్యతిరేకి అని విమర్శించారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన చర్చలో రాముడిని పురాణ పాత్రగా పేర్కొన్నారు. హిందూ జాతీయవాదం ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ యుగంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే లౌకిక రాజకీయాలను…

Read More

వీక్ “ఎండ్ ” మ్యారేజ్

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అయితే కెరీర్ కారణంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇప్పుడు మరింత ఆధునికత పెరిగింది. ఉమ్మడి కుటుంబాల సంగతి పక్కన పెడితే అసలు భార్యాభర్తలు కూడా కలిసి బతకలేని దుస్థితి ఏర్పడింది. వేర్వేరుచోట్ల పనిచేస్తూ వారాంతరంలో కలిసే దుష్ట సంస్కృతి ఏర్పడింది. దాన్నే వీకెండ్ మ్యారేజ్ అంటున్నారు. ఇలాంటి మ్యారేజ్ లు ఏ మేరకు నిలబడతాయో… ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో మిలియన్…

Read More

డోర్ డెలివరీకి డ్రోన్లు

సహనం వందే, బెంగళూరు: బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ ఇప్పుడు డ్రోన్ డెలివరీలకు చిరునామాగా మారింది. బిగ్‌బాస్కెట్, స్కై ఎయిర్ మొబిలిటీ కలిసి ఇక్కడ డ్రోన్ ద్వారా నిత్యావసర వస్తువులు, మందులు డెలివరీ చేసే సేవలను ప్రారంభించాయి. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ఆర్డర్లు నేరుగా వినియోగదారుల ఇంటికే చేరుతుండటంతో ఇది సంచలనం సృష్టిస్తోంది. ట్రాఫిక్‌కు చెక్ పెడుతూ, పర్యావరణహిత డెలివరీకి ఈ సేవ ఊతమిస్తోంది. డ్రోన్ డెలివరీ ఎలాగంటే?స్కై ఎయిర్ మొబిలిటీకి చెందిన డ్రోన్లు…

Read More

‘సర్జికల్ స్ట్రైక్‌లు ఎవరూ చూడలేదు’

సహనం వందే, ఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ 2019 సర్జికల్ స్ట్రైక్‌లపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సర్జికల్ స్ట్రైక్‌లకు సంబంధించిన సాక్ష్యాలను చూపాలని డిమాండ్ చేయడంతో పాటు, ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించి, చన్నీ సైన్యాన్ని అవమానించారని ఆరోపించింది. ఈ వివాదం రాజకీయ రగడకు దారితీసింది. సర్జికల్ స్ట్రైక్‌పై చన్నీ…

Read More

పాక్ మహిళతో రహస్య వివాహం

సహనం వందే, హైదరాబాద్: పాకిస్థానీ మహిళతో వివాహాన్ని దాచిపెట్టినందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తన జవాన్ మునీర్ అహ్మద్‌ను సర్వీసు నుంచి తొలగించింది. ఈ చర్య జాతీయ భద్రతకు హానికరంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మునీర్ అహ్మద్ సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్‌లో చివరిగా పనిచేశారు. దేశంలో అంతర్గత భద్రతకు నాయకత్వం వహిస్తున్న ఈ బలగంలో ఈ ఘటన సంచలనం రేపింది. పాక్ మహిళతో వీడియో కాల్ ద్వారా వివాహంమునీర్ అహ్మద్ పాకిస్థానీ మహిళ మెనాల్…

Read More

అమెరికా ఇళ్లల్లో ‘చైనా’ కష్టాలు

సహనం వందే, అమెరికా: అమెరికన్ల ఇళ్లల్లో చైనా ఉత్పత్తులు లేని జీవితాన్ని ఊహించలేం. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బొమ్మలు, ఫర్నిచర్ వంటి నిత్యవసరాల్లో చైనా వాటా అత్యధికం. అయితే కొత్త టారిఫ్‌ల కారణంగా వీటి ధరలు భారీగా పెరగడమే కాకుండా, కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అక్కడి మీడియా హెచ్చరించింది. ఈ మార్పులు అమెరికన్ ఇళ్లపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. చైనాపై తిరుగులేని ఆధారం…బొమ్మల్లో 97%, బూట్లలో 92%, ఎలక్ట్రానిక్స్‌లో 80% దిగుమతులు చైనా నుంచే…

Read More

జగదీశ్‌గా జాకీర్‌… సావిత్రిగా సబీరా

సహనం వందే, మథుర: ఉత్తరప్రదేశ్ లో మతమార్పిడి సంఘటన సంచలనంగా మారింది. మొఘలుల కాలంలో తమ పూర్వీకులు హిందువులని… అప్పుడు వారిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లింగా మార్చారని… అందుకే ఇప్పుడు తిరిగి హిందూ మతంలోకి తిరిగి వచ్చామని కుటుంబ సభ్యులు అంటున్నారు. తాము ముస్లింలం అయినప్పటికీ మనసులో హిందువులు గానే బతుకుతున్నామని కుటుంబ పెద్ద చెప్తున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మథురా జిల్లా జమునాపార్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం…

Read More

20… 29… 30 తేదీల్లో పుట్టిన వారు…

సహనం వందే, హైదరాబాద్: జ్యోతిష్యం విశ్వసిస్తే… మన జీవితంలో కలిసే ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. కొందరు వ్యక్తులు వారి పుట్టిన తేదీల ఆధారంగా మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 2, 11, 20, 29… అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వ్యక్తులు మన జీవితంలోకి ప్రత్యేక ఉద్దేశంతో వస్తారని వారు వివరిస్తున్నారు. వీరి రాక మన జీవితంలో సమతుల్యతను, జ్ఞానాన్ని,…

Read More