అమెజాన్ అడవుల లీజుకు నిత్యానంత కుట్ర
4.8 లక్షల హెక్టార్ల భూమి వెయ్యేళ్ళు లీజుకు ఫ్లాన్ సహనం వందే, హైదరాబాద్: లైంగిక వేధింపులు, చిన్నారుల కిడ్నాప్ ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి మరోసారి అంతర్జాతీయ కుంభకోణానికి తెరలేపాడు. ఈసారి అతని గురి దక్షిణ అమెరికాలోని బొలీవియాపై పడింది. తన కల్పిత దేశం ‘కైలాస’ ముసుగులో అక్కడి ఆదివాసీ భూములను కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. వెయ్యేళ్ల లీజు డ్రామా... బొలీవియా ప్రభుత్వం నిత్యానంద ‘కైలాస’కు చెందిన 20 మంది అనుచరులను అరెస్ట్…