ఈవీఎంలు హ్యాక్ అవుతాయి

పేపర్ బ్యాలెట్లే మేలన్న అమెరికా నిఘా చీఫ్ సహనం వందే, వాషింగ్టన్:ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) హ్యాకర్లకు సులువుగా చిక్కుతాయని అమెరికా దేశీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ హెచ్చరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా కాగితపు బ్యాలెట్లే సురక్షితమైన ఆమె అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక ముఖ్యమైన సమావేశంలో గబ్బార్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ మిషన్లలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని తమ కార్యాలయం సేకరించిన ఆధారాలను ఆమె సమావేశంలో అందజేశారు.”ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్…

Read More

భువనగిరి వైద్య శాఖలో అసంతృప్తి జ్వాలలు

సహనం వందే, భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులపై వైద్య ఉద్యోగులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్న వేధింపులు, విపత్కర సమయాల్లో డీఎంహెచ్ఓ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, పరిపాలనాపరమైన అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై జిల్లాలోని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఏకతాటిపైకి వచ్చారు. ఈ మేరకు వారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తమ ఆవేదనను, డీఎంహెచ్ఓ నిరంకుశ వైఖరిని వివరిస్తూ…

Read More

అమెరికాకు 15 లక్షల ఐఫోన్లు ఎయిర్‌లిఫ్ట్!

సహనం వందే, హైదరాబాద్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త దిగుమతి సుంకాలను తప్పించుకోవడానికి టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. సుమారు 600 టన్నుల యాపిల్ ఐఫోన్లను భారతదేశం నుంచి నేరుగా అమెరికాకు కార్గో విమానాల్లో తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇది దాదాపు 15 లక్షల యాపిల్ ఐఫోన్లని అంచనా. ట్రంప్ సుంకం వల్ల అమెరికాలో యాపిల్ ఐఫోన్ ధరలు పెరిగే పరిస్థితిని నివారించడానికి తోడ్పడుతుంది. అలాగే యాపిల్ ఉత్పత్తిలో భారతదేశం…

Read More

టెర్రరిస్టుగా డాక్టర్

సహనం వందే, న్యూఢిల్లీ:వైద్య వృత్తిని అభ్యసించి ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ ఉగ్రవాదిగా మారడం ఎంతటి విషాదమో కదా! 2008 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణా అటువంటి నేపథ్యం కలిగినవాడే. పాకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించిన ఈ కెనడియన్ పౌరుడు, దాదాపు పదేళ్లపాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో భారత అధికారులు రాణాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 64 ఏళ్ల రాణా…

Read More

కుల వ్యవస్థపై అవిశ్రాంత పోరాటం

నేడు జ్యోతి రావ్ ఫూలే జయంతి (కె.రాములు, ఎండీ, ఆగ్రోస్)భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థ ఒక చీకటి అధ్యాయం. ఈ దుర్మార్గమైన వ్యవస్థ సమాజంలో అసమానతలను, అణచివేతను సృష్టించిన కాలంలో దానిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన గొప్ప సంఘ సంస్కర్తలలో జ్యోతి రావ్ ఫూలే అగ్రగణ్యులు. ఆయన చేసిన సామాజిక పోరాటం, మహిళల విద్య కోసం ఆయన చేసిన కృషి నేటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. కుల వివక్షతో అణగారిన వర్గాల విముక్తి కోసం, స్త్రీ విద్య యొక్క…

Read More

నా బ్రాండ్ ‘యంగ్ ఇండియా’

సహనం వందే, హైదరాబాద్:‘ప్రతీ ముఖ్యమంత్రికీ ఒక బ్రాండ్‌ ఉంటుంది. రూ. 2కే కిలో బియ్యం ఎన్టీఆర్‌ బ్రాండ్.. ఐటీ అంటే చంద్రబాబు.. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ గుర్తుకు వస్తారు. కొంతమంది ఉద్యమాలే తమ బ్రాండ్‌ అని గొప్పలు చెప్పుకుంటారు.. యంగ్‌ ఇండియా స్కూల్‌ ఈజ్‌ మై బ్రాండ్‌’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని నేను విశ్వసిస్తున్నా. యంగ్ ఇండియా మా బ్రాండ్‌గా, తరగతి గదులను బలోపేతం చేస్తాం” అన్నారు….

Read More

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు

సహనం వందే, అమరావతి:మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. మహిళల పట్ల ఇలాంటి తప్పుగా మాట్లాడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. దీనిలో భాగంగా పార్టీ అధిష్టానం వెంటనే చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ…

Read More

సిద్ధు కామెడీ ఉన్నా.. కథలో ‘క్రాక్’ మిస్!

‘జాక్’ రివ్యూ: సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్:సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “జాక్ – కొంచెం క్రాక్” చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. “టిల్లు స్క్వేర్” వంటి హిట్ తర్వాత సిద్ధు నుండి వచ్చిన ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా కథాబలం లేకపోవడం వల్ల నిరాశపరిచిందని టాక్ వినిపిస్తోంది. సినిమా కథ విషయానికొస్తే…జాక్ అనే తెలివైన హ్యాకర్ రా ఏజెంట్ కావాలని…

Read More

మహారాష్ట్రలో మరాఠీ భాషోద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలోని డోంబివలిలో ఇంగ్లీషు భాష మాట్లాడినందుకు తాజాగా ఇద్దరు మహిళలపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా భాషా వివాదాలపై కొత్త చర్చను రేకెత్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశంలో భాషా ఉద్యమాలు తిరిగి ఊపందుకుంటున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. తమిళనాడులో హిందీ వ్యతిరేకత, మహారాష్ట్రలో నాన్-మరాఠీ వ్యతిరేక ఉద్యమాలు, దక్షిణ రాష్ట్రాల్లో ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు… ఎక్కడ చూసినా భాషా ప్రాముఖ్యత పెరుగుతోంది. గతంలో…

Read More