తురకపాలెం… మరణ మృదంగం – 60 రోజుల్లో 30 మంది మృతి

సహనం వందే, గుంటూరు:గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలుగా కారణం తెలియని మరణాలు జనాన్ని వణికిస్తున్నాయి. ఆరోగ్యంగా కనిపించే వారు ఒక్కసారిగా సాధారణ జ్వరంతో చతికిలబడుతున్నారు. ఆసుపత్రికి వెళితే శవమై తిరిగొస్తున్నారు. కొందరు క్షేమంగా ఇంటికి వచ్చినా, కొన్ని రోజులకే పరలోకాలకు చేరుతున్నారు. 60 రోజుల్లో 30 మంది మరణించడంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. రోజూ ఎవరో ఒకరు చనిపోతున్న ఈ దుస్థితి ఊరిని భయంతో కమ్మేసింది. వైద్య పరీక్షల్లో నార్మల్ గానే రిపోర్టులు…విచిత్రం…

Read More

సీక్రెట్ రొమాన్స్… కార్పొరేట్ క్రాష్ – రహస్య ప్రేమాయణాలపై ఉక్కుపాదం

సహనం వందే, హైదరాబాద్:కార్పొరేట్ ప్రపంచంలో నైతిక ప్రవర్తనకు ఉన్న ప్రాధాన్యం మరోసారి రుజువైంది. నెస్లే వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఒక సీఈవో వ్యక్తిగత వ్యవహారం కారణంగా తన పదవిని కోల్పోయారు. సంస్థాగత నియమాలకు వ్యతిరేకంగా ఒక సబార్డినేట్‌తో రహస్య సంబంధం పెట్టుకోవడమే ఆయన పతనానికి కారణమైంది. ఈ ఘటన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా సంస్థ నిబంధనలను పాటించాలన్న కఠిన సందేశాన్ని ఇచ్చింది. సీక్రెట్ రొమాన్స్ తో ఏడాదిలోనే వేటు…39 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను విజయవంతంగా…

Read More

సీపీఎం నేత నర్రా రమేష్ మృతి

సహనం వందే, ఖమ్మం:ఖమ్మం జిల్లా సీపీఎం సీనియర్ నాయకులు నర్రా రమేష్ శనివారం తెల్లవారుజామున 2:40 గంటలకు మరణించారు. ఆయన ఎస్ఎఫ్ఐలో చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత పార్టీ ఉద్యమంలో పనిచేశారు. ఆయన భౌతికకాయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం కాల్వొడ్డు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read More

గురుశిష్యుల చెడుగుడు – కేసీఆర్, జగన్ లకు బాబు, రేవంత్ చుక్కలు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీలు ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీలు అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, మద్యం కుంభకోణం ఈ రెండు పార్టీల పతనానికి కారణమవుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు కేసీఆర్ కుటుంబం సీబీఐ విచారణల నీడలో చిక్కుకుంటే, మరోవైపు జగన్ చుట్టూ సిట్ విచారణల ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణాల పర్వం తెలుగు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తోంది….

Read More

రణబీర్, కత్రినా రహస్యాల రచ్చ – కత్రినా ‘కైఫ్’చ్చే ఫోటోలు బట్టబయలు

సహనం వందే, ముంబై:బాలీవుడ్‌లో సెలబ్రిటీల జీవితాలు ఎప్పటికీ ఓ బహిరంగ పుస్తకమే. వారి వ్యక్తిగత జీవితంపై మీడియా, అభిమానుల ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ ఆసక్తి కొన్నిసార్లు హద్దులు దాటి సెలబ్రిటీల ప్రైవసీని ఉల్లంఘిస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం బాలీవుడ్‌ను కుదిపేసిన రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఫొటోల లీక్ సంఘటన వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు బయటపడింది. ఆ ఫోటోలను టూరిస్టులో, పాపరాజీలో తీయలేదని… వారికి అత్యంత దగ్గరి వ్యక్తి లీక్ చేశాడని…

Read More

గురువుల పాఠమే ‘విజయ’ పీఠం – మాస్టార్లకు ఎంపీ అప్పలనాయుడు సన్మానం

సహనం వందే, రణస్థలం:విజయనగరం ఎంపీగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ అప్పలనాయుడు తన గురువులను ఏమాత్రం మర్చిపోలేదు. రోజువారీ బిజీగా ఉన్నప్పటికీ తనకు విద్యాబుద్ధులు నేర్పిన మాస్టార్లను గౌరవించడం మానలేదు.‌ గురువులు నేర్పిన పాఠమే తను ‘విజయ’నగరం ఎంపీ స్థాయికి ఎదగడానికి తోడ్పడిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురు పూజోత్సవం రోజున శుక్రవారం తనకు తొలి అక్షరాలు దిద్దిన గురువులను మర్చిపోని నిరాడంబరతను ప్రదర్శించారు. రణస్థలం మండలంలో ఉన్న తన ఆది గురువులు మేడూరి…

Read More

ఐఏఎస్ కామకేళిలో ఒక మహిళ బలి!

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌కి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని గత కొంతకాలంగా ఆమెతోనే ఎక్కువ సమయం గడిపిన ఏపీకి చెందిన ఓ కీలక ఐఏఎస్ అధికారి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. గత ఏపీ ప్రభుత్వంలో ఓ కీలక శాఖకు అధిపతిగా పనిచేసిన సదరు అధికారి, తన కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల ఆ ఐఏఎస్ అధికారి వివాహేతర సంబంధంలో చోటు చేసుకున్న అనుమానాలు, కలహాలు ఒక మహిళ ప్రాణాన్ని…

Read More

విస్కీ పీక పిస్కీ – సిగరెట్లు, మద్యం, పాన్లపై 40 శాతం పన్ను

సహనం వందే, న్యూఢిల్లీ:పన్నుల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 నుంచి జీఎస్టీలో ప్రధానంగా రెండు స్లాబ్‌లు (5 శాతం, 18 శాతం) ఉండబోతున్నాయి. కానీ సామాజిక శ్రేయస్సుకు హాని కలిగించే వస్తువులు (సిన్ గూడ్స్), అలాగే లగ్జరీ ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యాన్ని, సామాజిక సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనూహ్య నిర్ణయం దేశవ్యాప్తంగా…

Read More

ముంబై గణపతికి షాక్ – నిమజ్జనం ప్రాథమిక హక్కు కాదు

సహనం వందే, ముంబై:గణపతి విగ్రహాల నిమజ్జనం కంటే పర్యావరణ పరిరక్షణ ముఖ్యం అని బాంబే హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ముంబైలోని చారిత్రక పవిత్ర బంగంగా తలావ్‌లో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. పర్యావరణ అనుకూల విగ్రహాలను కూడా బంగంగాలో నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం ప్రజల హక్కుల కంటే సమాజ శ్రేయస్సు, వారసత్వ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. పర్యావరణానికి పెద్దపీట…బంగంగా తలావ్‌లో గణపతి…

Read More

పోలీస్ గుట్టుపై సుప్రీం చివాట్లు – సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ:పట్టణాలు, నగరాల్లోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఐదేళ్ల నాటి ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో విచారణ గదుల్లో కెమెరాలు ఉండాల్సిన చోట లేకపోవడం, కొన్నిచోట్ల ఉన్నా పనిచేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల పెరుగుతున్న కస్టడీ మరణాల నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు తిరిగి తెరపైకి తెచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి…

Read More