మైనారిటీ గురుకులాల్లో జీతాల గోస

సహనం వందే, ఖమ్మం:తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, డైలీ వేజెస్ ఉద్యోగుల బతుకులు మూడు నెలలుగా అగమ్యగోచరంగా మారాయి. ప్రజాపాలనలో జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు షేక్ మక్బూల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. గత ప్రభుత్వం గురుకుల ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో…

Read More

అల్లు అర్జున్ కు మరో షాక్ – అల్లు బిజినెస్ పార్క్‌ పై జీహెచ్ఎంసీ కన్నెర్ర

సహనం వందే, హైదరాబాద్:పుష్ప-2 సినిమా విడుదలైనప్పటినుంచి అల్లు కుటుంబాన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అల్లు అర్జున్ ఏకంగా జైలుకు వెళ్లి రావాల్సి వచ్చింది. తాజాగా ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్‌ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెంట్‌హౌస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తీవ్రంగా స్పందించింది. అనుమతులు లేకుండా…

Read More

న్యూ యా’ఫీల్’ – నేటి రాత్రి 10.30 గంటలకు ఐఫోన్ 17 ఆవిష్కరణ

సహనం వందే, అమెరికా:టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ ఈవెంట్ కోసం టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 వంటి గాడ్జెట్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాపిల్ ఈసారి టెక్ ప్రపంచంలో ఏ సంచలనాలు సృష్టిస్తుందో అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది. ఐఫోన్ 17 సిరీస్… సన్నగా,…

Read More

జ’గన్’పై రాజారెడ్డి మిస్సైల్ – రాజకీయాల్లోకి జగన్ మేనల్లుడు రాజారెడ్డి

సహనం వందే, విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే వై.ఎస్. కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు, ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్. షర్మిల కుమారుడు వై.ఎస్. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై షర్మిల కీలక ప్రకటన చేశారు. కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించేందుకు రాజారెడ్డిని తీసుకువెళ్లి ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… వై.ఎస్. రాజారెడ్డికి ఎప్పుడు అవసరం అయితే…

Read More

నేపాల్‌లో ‘జెన్-జెడ్’ విప్లవం – సోషల్ మీడియా నిషేధంపై కన్నెర్ర

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో యువత చేపట్టిన నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. అవినీతి, సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ‘జెన్-జెడ్’ యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ఈ ఉద్యమం మొదలైంది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంట్ సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడితో సహా 19 మంది మరణించారు. 300 మందికి పైగా…

Read More

వేటు కోసం వెయిట్ – బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల రగడ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం సంచలనం సృష్టించింది. ఈ ఫిరాయింపులపై వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో…

Read More

కూలీ వేషంలో కాకీ – ముంబై పోలీసుల అనూహ్య వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక వాడ కేంద్రంగా నడుస్తున్న ఒక భారీ డ్రగ్స్ రాకెట్‌ను ముంబై పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనే రసాయన కర్మాగారం ముసుగులో మెఫడ్రోన్ డ్రగ్స్ తయారవుతున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. రజనీకాంత్ సినిమా తరహాలో ఒక కానిస్టేబుల్‌ను కార్మికుడిగా పంపి నెల రోజుల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ మాఫియా గుట్టును రట్టు చేశారు. ఈ ఆకస్మిక దాడిలో రూ.12 వేల…

Read More

పాప కోసం ప్రధాని పంతం – అయినా లెక్క చేయని జర్మనీ దేశం

సహనం వందే, న్యూఢిల్లీ:బెర్లిన్ నగరంలో జర్మనీ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న నాలుగేళ్ల భారతీయ బాలిక అరిహా షా వ్యవహారం అంతర్జాతీయ దౌత్య వివాదంగా మారింది. ఆ పాపను భారత్‌కు అప్పగించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రిని కోరారు. గతంలో స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని జర్మన్ ఛాన్సలర్‌ ముందు ప్రస్తావించారు. దేశం మొత్తం ఒకే గొంతుకగా ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం నడుస్తున్నా జర్మనీ అధికారులు మాత్రం…

Read More

విజయనగరం ఎంపీకి విశిష్ట గౌరవం – మహారాష్ట్ర తెలుగు సంఘం సభకు కలిశెట్టి

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో మహారాష్ట్ర తెలుగు మేళవా కార్యక్రమం ఘనంగా జరిగింది. ముంబైలోని థానే వెస్ట్ వసంత విహారలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖులను సత్కరించి జ్ఞాపికలు అందించారు. కోటికి పైగా సభ్యత్వం ఉన్న ఈ సంఘం నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా…

Read More

వేల కోట్ల డ్రగ్స్… ముంబై దెబ్బ అదుర్స్ – హైదరాబాదులో రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ సీజ్

సహనం వందే, హైదరాబాద్:దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారుతోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్‌లో నిర్వహించిన ఆపరేషన్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో నగరంలో అక్రమ డ్రగ్స్ తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో వెల్లడైంది. ఎక్స్‌టీసీ, మోలీ, ఎండీఎంఏ వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌తో పాటు, వాటి తయారీకి అవసరమైన…

Read More