అప్పలనాయుడికి ‘చంద్ర’హారం – కలిశెట్టి సూపర్… చంద్రబాబు సర్టిఫికెట్

సహనం వందే, విజయనగరం:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. దత్తి గ్రామంలో బుధవారం పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు… ఎంపీ అప్పలనాయుడు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న విధానం ప్రశంసనీయమని కొనియాడారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలను శక్తివంతంగా నిర్వహిస్తూ తెలుగుదేశంను ప్రాణంగా చూసుకుంటున్నారని సభా వేదికగా ప్రశంసించారు. ఈ కామెంట్లతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. సేవ…

Read More

జాతి విద్వేషం… గాంధీ విగ్రహం ధ్వంసం – లండన్‌లో భారతీయులపై హేట్ క్రైమ్‌లు…

సహనం వందే, లండన్:ఒకప్పుడు భారతదేశాన్ని రాచి రంపాన పెట్టి దోపిడీ చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు… ఇప్పుడు మళ్లీ తమ అహంకారాన్ని అప్పుడప్పుడు బయట పెడుతున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా వదలడం లేదు. ఆ దేశంలో ఉన్న కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహ ధ్వంసాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు…

Read More

దసరా హీట్… టూర్ ట్రీట్ – లాంగ్ వీకెండ్ కు టూరిస్టుల ప్లాన్

సహనం వందే, హైదరాబాద్:దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా పర్యాటక డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే లాంగ్ వీకెండ్ కోసం బుకింగ్‌లు గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 20 నుంచి 25 శాతం పెరిగాయి. హోటల్ రిజర్వేషన్లు సైతం 14 నుంచి 16 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పని ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం కోరుకోవడమే. కుటుంబాలు, యువత రెండు మూడు రోజుల వీకెండ్ గెటవేలకు…

Read More

గులాబీ ఐఫిల్… పింక్ చార్మినార్… క్యాన్సర్ పరార్

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ నగరం మంగళవారం అర్ధరాత్రి గులాబీమయం అయింది. ప్రముఖ భవనాలపై పింక్ రంగు మెరిసిపోయింది. అక్టోబర్ క్యాన్సర్ నివారణ నెల నేపథ్యంలో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచంలో వైట్ హౌస్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఐఫిల్ టవర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలతో పాటు మన దేశంలో హైదరాబాదులో మాత్రమే పెయింట్ ది సిటీ పింక్ నిర్వహిస్తుండడం విశేషం. చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్‌ ఐమ్యాక్స్, దుర్గం…

Read More

బేడీలు వేసినా మారని మెడి’కేడీలు’ – ఎన్ఎంసీ అధికారులు ‘మహా’ ముదుర్లు

సహనం వందే, హైదరాబాద్:అదొక డబ్బా మెడికల్ కాలేజ్… నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందులో వసతులు లేవని లోకమంతా కోడై కూసింది. మూడేళ్ల క్రితం ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక బ్యాచ్ రద్దు కూడా చేశారు. అయినా దాని తీరు మారలేదు… జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అధికారుల అక్రమాలు ఆగలేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా… నకిలీ రోగులు ఉన్నారని తేలినప్పటికీ ఆ కాలేజీకి ఎన్ఎంసీ తాజాగా మరో 50 ఎంబీబీఎస్ సీట్లను…

Read More

శాటిలైట్ హ్యాకింగ్… పైరసీ షాకింగ్ – హైడెఫినిషన్ స్థాయిలో సినిమాలు డౌన్లోడ్

సహనం వందే, హైదరాబాద్:సినిమా పైరసీ అంటే ఇప్పటివరకు మనకున్న ఆలోచన వేరు. థియేటర్లకు వెళ్లి కెమెరాతో సినిమాను రికార్డు చేసి పైరసీ చేస్తుంటారని అనుకుంటాం. అయితే అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏకంగా డిజిటల్ శాటిలైట్లనే హ్యాక్ చేసి సినిమాలను పైరసీ చేస్తున్నట్లు తేలింది. అలా పైరసీ చేసిన సినిమాలు ఒరిజినల్ కాపీతో సమానంగా హైడెఫినిషన్ కంటెంట్‌ తో బయటకు వస్తున్నాయి. దీనివల్ల సినిమా టికెట్ కొనుక్కొని వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోతుంది. అటువంటి హైటెక్ పైరసీ ముఠాను…

Read More

రాజకీయ ‘తొక్కిసలాట’లో విజయ్ – ఆయనకు మద్దతు ప్రకటిస్తున్న బీజేపీ

సహనం వందే, చెన్నై:తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపునకు కరూర్ తొక్కిసలాట ఘటన వేదికైంది. ఈ సంఘటనలో తమ తప్పేమీ లేదని చెప్పుకునేందుకు సినీ నటుడు, యువ రాజకీయ నేత విజయ్ ఆరోపణల పర్వం మొదలుపెట్టారు. తమ సభలో అలజడి సృష్టించి తమను ఇరికించేందుకు డీఎంకే ప్రభుత్వమే కుట్ర చేస్తోందని ఆయన నేరుగా ఆరోపించారు. అయితే ఇదంతా రొటీన్ రాజకీయం అయినప్పటికీ… ఈ కేసు విచారణ ఇప్పుడు విజయ్‌కు అసలు పరీక్షగా మారింది. డీఎంకే ప్రభుత్వం విచారణ జరిపితే…

Read More

అందరివాడు… ఎవరూ లేనివాడు – చిరంజీవికి అండగా నిలవని తమ్ముళ్లు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ పెను దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే, సీనియర్ హీరో బాలకృష్ణ ఏపీ అసెంబ్లీ వేదికగా చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ నుంచే సరైన స్పందన కరువైంది. ముఖ్యంగా సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబులు దీనిపై ఏమాత్రం స్పందించకపోవడంపై మెగాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి అండగా నిలవాల్సిన సొంత తమ్ముళ్లు కూడా సైలెంట్‌గా ఉండటంతో……

Read More

పటిష్ట వ్యూహంతో పదేళ్లు పాగా – మరో రెండు మార్లు సీఎం కుర్చీలో కర్చీఫ్

సహనం వందే, హైదరాబాద్:‘నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. హైదరాబాదును న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు ఆ సిటీలకు పోటీగా నిర్మించకూడదు? ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామ’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనూ… రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారాయి. తనకు మరో పదేళ్లు…

Read More

బీ’హోర్’లో తేజస్వీ(ప్) – ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమికే మెజారిటీ

సహనం వందే, న్యూఢిల్లీ:బీహార్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు తాజాగా వెలువడిన లోక్ పోల్ సర్వే ఫలితాలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ సర్వే తీవ్ర హెచ్చరికగా మారింది. బీహార్‌లో రాజకీయం వేగంగా మారుతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి 118 నుండి 126 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుందని అంచనా. మరోవైపు…

Read More