స్మార్ట్ సర్జరీ.‌‌.. ‘బ్రెస్ట్’ రికవరీ- రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స

సహనం వందే, హైదరాబాద్:రొమ్ము క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానాలను ఎంఎన్ జే క్యాన్సర్‌ ఆసుపత్రి అందుబాటులోకి తెచ్చింది. రొమ్ము క్యాన్సర్‌కు పెరుగుతున్న ముప్పు, చికిత్సలో నూతన విధానాలు, ప్రభుత్వ ఆసుపత్రుల పాత్రపై ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సర్జికల్ ఆంకాలజీ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌ మాటూరితో ‘సహనం వందే’ ప్రత్యేక ఇంటర్వ్యూ… సహనం వందే: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? దీని పెరుగుదల ఆందోళన కలిగిస్తోందా? డాక్టర్ రమేష్: భారతీయ మహిళలకు…

Read More

గోల్కొండ వజ్రం… ఫ్రాన్స్ రక్తసిక్తం – రత్నం వెనుక శాపం…‌ రక్తపాతం… విప్లవం

సహనం వందే, పారిస్:ప్రపంచ ప్రసిద్ధి చెందిన రీజెంట్ వజ్రం చుట్టూ అల్లుకున్న రహస్యాలు… దాని భారతీయ మూలాల శాపం తాజాగా జరిగిన లూవ్ర్ మ్యూజియం దొంగతనంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కోట్ల విలువైన ఇతర ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు… గోల్కొండ గనుల నుంచి వచ్చిన ఈ రీజెంట్ రాణి వజ్రాన్ని మాత్రం తాకకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చరిత్రలోని ఈ అపురూప వజ్రం కేవలం రత్నం కాదు… రక్తపాతంతో మొదలైన ఒక శాపగ్రస్త కథకు…

Read More

పాలకుల ఆటలో ‘కోటా’కు బీటలు – రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీల మెగా ధర్నా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగారి పోతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం కోటా బిల్లు కోర్టుల కారణంగా ఒక్కసారిగా మాయమైపోయింది. ఈ అన్యాయానికి నిరసనగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం (24న) ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌లు, ర్యాలీలు పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చినా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభ్యర్థనలను అణచివేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మహాధర్నా బీసీల…

Read More

అనారోగ్య దళితుడిపై అగ్రకుల దమనకాండ – ఆలయం పరిసరాల్లో మూత్రం పోశాడని ఫైర్

సహనం వందే, లక్నో:లక్నో సమీపంలోని కాకోరి పట్టణంలో జరిగిన దారుణ ఘటన దేశంలో కుల వివక్ష ఎంత వికృతంగా ఉందో మరోసారి బట్టబయలు చేసింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల దళిత వృద్ధుడు రంపాల్ రావత్..‌. దీపావళి రోజున శీత్ల మాతా ఆలయం సమీపంలో అనుకోకుండా మూత్ర విసర్జన చేస్తే… ఒక స్థానికుడు అతనిపై దాడి చేసి అవమానించడం మానవత్వానికే సిగ్గుచేటు. మందిరానికి కనీసం 40 మీటర్ల దూరంలో జరిగిన ఈ చిన్నపాటి అనుకోని ఘటనను…

Read More

బ్రిటీషర్ల కంటే ఇస్లామీస్ డేంజర్ – యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, లక్నో:ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోరఖ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆయన రాజకీయ ఇస్లాంను బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదంతో పోల్చడమే కాకుండా… సనాతన ధర్మాన్ని బలహీనపరిచేందుకు దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందనే ఆరోపణలు చేశారు. గోరఖ్‌పూర్ వేదికగా యోగి సంధించిన ఈ విమర్శనాస్త్రాలు దేశ ప్రజల దృష్టిని మతపరమైన విభజనల వైపు మళ్లిస్తున్నాయనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో మొదలైంది. బ్రిటిష్,…

Read More

ఆకలితో అమ్మ… చనిపోయెనమ్మా – మరణించన 70 ఏళ్ల వృద్ధురాలు

సహనం వందే, హైదరాబాద్:దేశమంతా దీపావళి వెలుగులు, ఆనందాల నడుమ మునిగి తేలుతున్న వేళ, హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలు ఆకలితో మరణించడం అత్యంత హృదయ విదారకరం. విశ్వనగరంగా పేరుగాంచిన నగరంలో గోపన్ పల్లి అక్షిత హాస్పిటల్ వద్ద 70 ఏళ్ళున్న ఒక నిస్సాయ మహిళ మృతదేహం దొరకడం గుండెలవిసేలా చేసింది. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న ఆమె గత కొన్ని రోజులుగా కనీసం పట్టెడన్నం లేక ఆకలి బాధలతో అలమటించి చివరికి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మరణం…

Read More

కలిశెట్టి రాక… చిన్నారుల కేక – విజయనగరం ఎంపీ వినూత్న దీపావళి వేడుక

సహనం వందే, రణస్థలం:విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ప్రతి ఏటా ప్రభుత్వ బాలికల వసతి గృహం విద్యార్థినులతో దీపావళి సంబరాలు జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. ఆయన స్వతహాగా పిల్లలతో గడపడానికి, వారి నిష్కల్మషమైన ఆనందాన్ని చూసి మురిసిపోవడానికి ఎంతో ఇష్టపడతారు. వారికి కావాల్సినవన్నీ చేసిపెట్టడం, అడగకముందే అవసరాలను తీర్చడం ఆయన సహజ శైలి. ఈ మానవీయ కోణం ఆయన రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకతను చాటుతోంది. సొంత బిడ్డతో వచ్చి తీపి పంచిన ఎంపీసోమవారం…

Read More

ఓల్డ్ లేడీ… గోల్డ్ రూల్ – 117 ఏళ్ల బతికిన మరియా జీవిత రహస్యం

సహనం వందే, స్పెయిన్:ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలుగా గుర్తింపు పొందిన మరియా బ్రాన్యాస్ మొరెరా 117 ఏళ్ల 168 రోజుల బతికి గత ఏడాది కన్నుమూశారు. ఆమె 1918 ఫ్లూ మహమ్మారిని తట్టుకున్నారు. అలాగే కరోనా నుంచి బయటపడ్డారు. రెండు ప్రపంచ యుద్ధాలు చూశారు. ఆమె చిరకాలం బతకడానికి గల రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదించారు. స్పెయిన్‌లోని బార్సిలోనా విశ్వవిద్యాలయంలో జన్యుశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ మానెల్ ఎస్టెల్లర్ నేతృత్వంలో జరిగిన ఈ అపూర్వ అధ్యయనం మరియా జీవన మంత్రంలోని…

Read More

భరించలేం… బతకలేం – కొండపై నుంచి దూకిన 9వ తరగతి బాలికలు

సహనం వందే, కేరళ:కేరళలో మారుతిమల కొండపై జరిగిన దారుణం అందరి హృదయాలను పిండేస్తుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న మీను, శివర్ణ అనే ఇద్దరు బాలికలు మనసు కకావికలమై వెయ్యి అడుగుల ఎత్తున్న కొండపై నుంచి దూకగా ఒక అమ్మాయి చనిపోయింది. ఒక బాలిక ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. స్నేహం, చదువు, కలలతో కళకళలాడాల్సిన ఆ చిన్న హృదయాలను ఆత్మహత్యకు పురిగొల్పేంతటి క్రూరమైన ఒత్తిడి, ఆవేదనను ఎవరు కలిగించారు? వారి మౌనం వెనుక దాగిన బాధే ఈ విషాదానికి…

Read More

అమెరికా అల్లకల్లోలం- 70 లక్షల గొంతులు ఒక్కటై పిక్కటిల్లేలా‌…

సహనం వందే, అమెరికా:అమెరికా అల్లకల్లోలంగా మారింది. 2700 పట్టణాలు, నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ట్రంప్ విధానాలపై గళమెత్తుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలతో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. ట్రంప్ రాచరిక పద్ధతులకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ పేరుతో ఈ ఉద్యమం జరుగుతుంది. గత జూన్‌లో 20 లక్షల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయగా… ఇప్పుడు దాదాపు నాలుగింతల మంది…

Read More