అమెజాన్ అడవి బిడ్డల గోడు – ఐరాస సదస్సులో ఆదివాసీల రచ్చ
సహనం వందే, బ్రెజిల్:బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్30) ఈసారి ఆదివాసీల ఆందోళనలతో వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో వేలాది మంది ఆదివాసీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆండిస్, అమెజాన్ అడవి ప్రాంతాల నుంచి నెల రోజుల పాటు యకు మామా (నీటి తల్లి) పేరుతో సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన ఈ అడవి బిడ్డలు తమ అరణ్యాలు బంగారు మైనింగ్, చమురు తవ్వకాలతో నాశనం అవుతున్నా ప్రపంచ దేశాలు మొసలి…