‘చెత్త’ వాడితో ఐపీఎస్ దోస్తీ – ఢిల్లీలో మారువేషంలో ఏడు రోజులు
సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా నడుపుతున్న భారీ నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ బృందం, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఛేదించాయి. ఈ మెగా ఆపరేషన్ విజయానికి ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఐపీఎస్ చేపట్టిన సాహసోపేతమైన అండర్‌కవర్ మిషన్. ఈ డ్రగ్స్ దందా మూలాలను వెలికితీయడానికి ఆయన ఏకంగా ఏడు రోజులపాటు మారువేషంలో నైజీరియన్ల డ్రగ్స్ అడ్డాలోనే మకాం వేశారు. ఈ బృందం స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా…