ఫుల్ బాటి(కి)ల్ – వయసు పెరిగే కొద్దీ మందు విషమే!
సహనం వందే, హైదరాబాద్: యుక్త వయసులో నాలుగు గ్లాసులు తాగినా తేలికగా పనిచేసే శరీరం… ఇప్పుడు రెండు గ్లాసులకే కళ్లు బైర్లు కమ్మి పడక చేరడానికి సిద్ధమవుతుందా? అయితే దానికి కారణం కేవలం వయసు మారుతూ ఉండటమే. వయసు పెరిగే కొద్దీ మందు మన శరీరంపై చూపే ప్రభావం కూడా తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ వ్యవస్థ నెమ్మదించడం… ముఖ్యంగా కాలేయం (లివర్) పనితీరు మందగించడం ఇందుకు ప్రధాన కారణం. 50, 70 ఏళ్ల…