తెలంగాణ వ్యవసాయంలో సాంకేతిక విప్లవం – జర్మనీ సహకారంతో ఆధునిక సాగుకు శ్రీకారం!
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జర్మనీ ప్రతినిధుల బృందంతో గురువారం సచివాలయంలో సమావేశమై, నూతన సాంకేతికతల వినియోగం, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తాం” అని అన్నారు. సిరిసిల్లలో పైలట్ ప్రాజెక్ట్: సిరిసిల్ల జిల్లా వేములవాడలో జర్మనీ సంస్థ…