ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులా? అడ్డమీది కూలీలా?

సహనం వందే, హైదరాబాద్:ఆధునిక ప్రపంచంలో సమాన పనిచేసే ఉద్యోగుల వేతనాల మధ్య వివక్ష ఉండటం అనాగరికం. ఇది ఫ్యూడల్ వ్యవస్థ లక్షణానికి నిదర్శనం. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ తరుణంలో సమాన పనికి – సమాన వేతనం అనే ప్రాథమిక సూత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు ఔట్‌సోర్సింగ్ విధానం పేరుతో తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయించుకుంటూ శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం స్వయంగా ఇలాంటి అన్యాయానికి పాల్పడితే ఆ…

Read More

వైద్య విద్యార్థులకు బానిస సంకెళ్లు…భవిష్యత్తు అతలాకుతలం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాఫియా కేంద్రాలుగా మారిపోయాయి. వాటి యాజమాన్యాలు అనేకమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా రాజకీయ నాయకులు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, రాజకీయం వంటి రంగాల్లో ఉన్నటువంటి ఈ పెద్దలు బ్లాక్ మనీతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాళ్లకు వైద్య విద్య వ్యాపారమే తప్ప… అది సేవకు అంకితమైన వృత్తిగా భావించడం లేదు. తక్కువ మౌలిక సదుపాయాలు కల్పించి… ఎక్కువ ఫీజులు వసూలు చేసి…

Read More

రుచుల విందులో ‘అదుర్స్’ – ప్రపంచంలో 50వ స్థానం హైదరాబాద్

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచ ఆహార పటంలో భారతదేశం తన విశిష్టమైన వంటకాలతో మరోసారి సగర్వంగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 ఆహార నగరాల జాబితాలో ఆరు భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇది భారతదేశపు అద్భుతమైన, వైవిధ్యమైన వంటకాల వారసత్వానికి నిదర్శనం. ఈ జాబితాలో ముంబై (5వ స్థానం) అగ్రగామిగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో అమృత్‌సర్ (43వ స్థానం), ఢిల్లీ (45వ స్థానం), హైదరాబాద్ (50వ స్థానం), కోల్‌కతా…

Read More

చలమేడ ఆనందరావు మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్లపై ఉక్కుపాదం

సహనం వందే, కరీంనగర్:కరీంనగర్‌లోని చలమేడ ఆనందరావు మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం వైద్య విద్యా రంగంలో ప్రైవేట్ సంస్థల నిరంకుశ పోకడలకు, విద్యార్థుల హక్కుల అణచివేతకు నిదర్శనం. తమ పెండింగ్ స్టైపెండ్‌ల గురించి మేనేజ్‌మెంట్‌ను నిలదీసినందుకు వారిపై ఉక్కు పాదం మోపారు. స్టైపెండ్‌ల జాప్యంపై నిరసన…డాక్టర్స్ డే రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులు తమ స్టైపెండ్లు నెలల తరబడి చెల్లించకపోవడంపై గళమెత్తారు….

Read More

సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ మారణహోమంపై మౌనం

సహనం వందే, హైదరాబాద్:కాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక ప్రజలను ఉగ్రవాదులు కాల్చి చంపితే… కేంద్ర ప్రభుత్వం ఏకంగా పాకిస్తాన్ తో యుద్ధమే చేసింది. అందుకు సహకరించిన వారిపై దేశద్రోహం కేసు పెట్టి లోన పడేసింది. ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలంటే ఇలా చేయాల్సిందే. కానీ హైదరాబాదు శివారు పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ లో పేలుడు సంభవించి ఏకంగా 43 మందికి పైగా చనిపోవడం… దాదాపు అంతే సంఖ్యలో గల్లంతు…

Read More

యూరియా ‘అధికారి’ దయ – ఎక్కడికక్కడ బ్లాక్…

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో యూరియా కొరత ఉందని… కేంద్రం అవసరమైనంత కేటాయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. సీజన్ ఊపందుకోవడంతో ఆయన కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారు. 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇంకేం ఇదే అదనుగా భావించిన మార్క్ ఫెడ్ లోని ఒక అధికారి దళారులతో చేతులు కలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేయిస్తున్నట్టు పెద్ద ఎత్తున…

Read More

ఆయిల్ పామ్ అక్రమార్కులకు చుక్కలే

సహనం వందే, అశ్వారావుపేట: ఆయిల్ పామ్ మొక్కల్లో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (ఐఐఓపీఆర్) బృందం మూడు రోజులు పర్యటించింది. గురువారంతో వారి పర్యటన ముగిసింది. వర్షంలోనూ ఆ బృందం పట్టుదలగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం విశేషం. ఈ మూడు రోజుల్లో శాస్త్రవేత్తల బృందం 3 వేల ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించింది. ఇందులో నుంచి 100 నమూనాలను…

Read More

ఆయిల్ ఫెడ్ తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటు.. ఫైనాన్స్ విభాగం తొలగింపు

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ లో ప్రక్షాళన పర్వం ఊపందుకుంది. ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ వరుస కథనాలతో ఈ కార్పొరేషన్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మొక్కల అక్రమాలు, నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణ వివాదం… కొందరు అధికారులు కీలకమైన విభాగాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దోపిడీకి పాల్పడుతుండటం… ఇలాంటి అన్ని విషయాలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కార్పొరేషన్ కొత్త ఎండీ శంకరయ్య…

Read More

ఆయిల్ పామ్ నర్సరీల్లో నాసిరకం మొక్కలా? – తుమ్మల ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగులో నెలకొన్న మందకొడి పరిస్థితిపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నర్సరీల్లో నాసిరకం మొక్కలు (కల్లింగ్ మొక్కలు) ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మొక్కలు ఏ మాత్రం ఉండకూడదని… రైతులకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన వాటినే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో మంగళవారం ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఆయిల్ పామ్ సాగు పురోగతి, ఇతర ఉద్యాన పంటల స్థితిగతులపై…

Read More

పని గంటలు దాటితే హెల్త్ రిమైండర్ – ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

సహనం వందే, న్యూఢిల్లీ:వారానికి 70 గంటలు పని చేయాలని… అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు 1986లో మనదేశంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేసినప్పుడు కూడా ఆయన వ్యతిరేకించారు. ఆయన తీరు పట్ల టెకీలు, కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తన ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులు ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’పై దృష్టి సారించి…

Read More