సీబీఐ వలలో డాక్టర్ రజినీరెడ్డి – మాజీ సూపరింటెండెంట్ పై కేసు

సహనం వందే, హైదరాబాద్:నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనలను ఉల్లంఘించి పలు వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేయడంలో జరిగిన భారీ అవినీతి కుంభకోణంలో మరో కీలక పేరు వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, పేట్లబుర్జ్ మాజీ సూపరింటెండెంట్ రజినీరెడ్డి ఈ ఆరోపణల జాబితాలో చేర్చారు. తనిఖీ బృందంలో పాత్ర…ఎన్‌ఎంసీ తనిఖీ బృందంలో మాజీ సూపరింటెండెంట్ సభ్యులుగా ఉన్నారు. గత నెల 30న…

Read More

ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినం – మంత్రివర్గం కీలక నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్:ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఆ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర అభివృద్ధికి, పారదర్శక పాలనకు దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ మేరకు బుధవారం జరిగిన…

Read More

తెలంగాణలో ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుమతికి 500 కోట్లు?

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేటు మెడికల్ కాలేజీల మాఫియా వైద్య విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. డబ్బా కాలేజీలు పెట్టి విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ వందల కోట్లకు పడగలెత్తుతున్నాయి. వాటిని పర్యవేక్షించాల్సిన జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) లంచాలకు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటం సంచలనంగా మారింది. వైద్య విద్యా వ్యవస్థను కుదిపేసిన భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), వైద్య…

Read More

ఆయిల్ ఫెడ్ తిరుమలేశునికి దెబ్బ మీద దెబ్బ

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ మేనేజర్ తిరుమలేశ్వర్ రెడ్డి పెత్తనానికి కత్తెరలు పడుతున్నాయి. ఆయన అధికారాలను ఒక్కొక్కటి తగ్గించే కార్యక్రమానికి ఆ సంస్థ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. నాలుగు విభాగాలను తన చేతుల్లో ఉంచుకొని ఆడించిన నాటకానికి తెరపడుతుంది. ‘నేను ఏం చేస్తే అదే చెల్లుబాటు’ అన్న ఆయన ధోరణికి చెక్ పడుతుంది. మొన్నటి వరకు ఫైనాన్స్, మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ ఫ్యాక్టరీ… ఈ నాలుగింటినీ తన చేతిలో ఉంచుకున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా వీటిపై…

Read More

చంద్రబాబుతో రేవంత్ రె’డ్ఢీ’ – వరద జలాలపై ఆంధ్రప్రదేశ్ వాదన

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అనేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ‘కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టం. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతం. దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతాం. ప్రజల హక్కులను తాకట్టు పెట్టం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వరద…

Read More

పాడ్‌కాస్ట్‌లపై జెన్ జెడ్ (1997-12) జోరు

సహనం వందే, హైదరాబాద్:ఆధునిక యువతరం… ముఖ్యంగా జెన్ జెడ్ కేవలం సోషల్ మీడియా, వీడియో కంటెంట్‌లకే పరిమితం కావడం లేదు. ప్రస్తుతం వారి ఆసక్తి కొత్త ధోరణి వైపు మళ్లింది – అదే పాడ్‌కాస్ట్‌. ఈ ఆడియో కంటెంట్ రూపం జెన్ జెడ్ తరంలో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. డిజిటల్ యుగంలో పెరిగిన ఈ తరానికి చెందినవారు పాడ్‌కాస్ట్‌లలో కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని, సమాచారాన్ని వెతుకుతున్నారు. పాడ్‌కాస్ట్‌లపై అమిత ఆకర్షణ…జెన్ జెడ్ అంటే 1997…

Read More

ఆయిల్ పామ్ కంపెనీలకు విత్తన ‘చుట్టం’

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఆయిల్ పామ్ రైతులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంటను ప్రోత్సహించాలని ప్రయత్నాలు చేస్తున్నా… ఆ మేరకు రైతులకు భరోసా కల్పించే విషయంలో ఆయిల్ ఫెడ్ అధికారులు విఫలం అవుతున్నారు. ఇతర పంటలకు బదులు లక్షలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని చెబుతూనే… మరోవైపు ఆ పంటకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అవుతున్నారు. ఈ పంటకు నష్టం జరిగితే పరిహారం ఉంటుందా? అన్న రైతుల…

Read More

యూరియా సకాలంలో సరఫరా చేయాలి – నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి

సహనం వందే, న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర రైతుల అవసరాల కోసం యూరియా సకాలంలో సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యను వివరించారు. రైతుల ఇబ్బందులపై దృష్టి…వానాకాలం సీజన్‌లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర…

Read More

మార్క్’ఫ్రాడ్’ అధికారి గుప్పిట్లో 50 వేల టన్నుల యూరియా

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందించే యూరియా రైతన్నల పాలిట ఓ కన్నీటి గాథగా మారింది. మార్క్‌ఫెడ్ సంస్థలో కీలకస్థానంలో ఉన్న ఓ అధికారి తన గుప్పిట్లో ఏకంగా 50 వేల టన్నుల యూరియాను పెట్టుకుని, దళారులతో కుమ్మక్కై అధిక ధరలకు అమ్ముకుంటూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్న వైనం సంచలనం సృష్టిస్తోంది. మార్క్‌ఫెడ్ కార్యాలయం నుంచే ఈ అక్రమ దందాకు చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దోపిడీలో జిల్లా మేనేజర్లు పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి…

Read More

10 గంటలు ‘మరణ’శాసనం – పని గంటలు పెంచిన కార్మిక ‘వ్యతిరేక’ శాఖ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పనివేళలను 8 గంటల నుండి 10 గంటలు కు పెంచుతూ తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయంపై కార్మిక, ఉద్యోగ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో తెచ్చిన ఈ కొత్త నిబంధన కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశ్రాంతితో కలుపుకుని ఏకంగా 12 గంటల వరకు పని చేయించుకోవచ్చని జారీ చేసిన ఉత్తర్వులు కార్మికులను బానిసలుగా మార్చేస్తాయని…

Read More