ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు-బుసలు కొడుతున్న అక్రమాలు

సహనం వందే, వేంసూర్: ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు వెలుగు చూస్తున్నాయి. ఆ పుట్టలను తవ్వుతుంటే అక్రమాల విషపు నాగులు బుసలు కొడుతున్నాయి. ఆయిల్ ఫెడ్ అధికారుల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్కడి రైతుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారు. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు మరిగిన కొందరు అధికారులు రైతులకు నాసిరకం మొక్కలు అంటగట్టడంపై నిరసన వ్యక్తం అవుతుంది. ఆయిల్ పామ్ మొక్కల్లో ఎక్కువ సంఖ్యలో జన్యు లోపం ఉన్నట్టు…

Read More

కృష్ణా, గోదావరి నదీ జలాలపై కీలక ఒప్పందం

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై నెలకొన్న సమస్యలకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, దీనిని తెలంగాణకు ఒక విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

ఇండియా కూటమి బీసీ నినాదం – ముఖ్యమంత్రి రేవంత్ చొరవ

సహనం వందే, హైదరాబాద్:ఇండియా కూటమి పార్టీలలో బీసీ చర్చను లేవనెత్తేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. కూటమి పార్టీల ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లును ఆమోదింప చేసుకోవాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీ అయినందున… దాని అధినేత రాహుల్ గాంధీ అనుమతి తీసుకుని సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున…

Read More

ఆర్ఎంపీల గుప్పిట్లో ఆసుపత్రులు

సహనం వందే, హైదరాబాద్:ఆర్ఎంపీల పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చేస్తున్న దాడులు ప్రతి నిత్యం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులైన వైద్యులను పట్టుకోవడంలో మెడికల్ కౌన్సిల్ నిర్విరామంగా కృషి చేస్తోంది. ఆర్ఎంపీలను ఏరివేయడమే లక్ష్యంగా ఆ కౌన్సిల్ ఏర్పడిందా అన్న విధంగా దాడులు నిర్వహిస్తోంది. అర్హత లేకుండా వైద్యం చేయడాన్ని ఎవ్వరూ ఆమోదించరు. కానీ అదే ఆర్ఎంపీల నీడలో అనేక ఆసుపత్రులు నడుస్తున్నాయంటే అతిశయోక్తికాదు. ఇలా చేస్తున్నందువల్లే రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు రోగులతో రోగాలతో కళకళలాడుతున్నాయి. చిన్న…

Read More

ఆయిల్ ఫెడ్ లో సుధా’కత్తెర’రెడ్డి… బాల’కష్టాలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రధాన కార్యాలయంలో కీలక స్థాయిలో ఉన్న జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి అధికారాలకు కత్తెర వేశారు. కొన్ని నెలల్లో ఉద్యోగ విరమణ ఉండటంతో ఆయనను డమ్మీ చేయడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అంతేకాదు ఆయన హోదాకు తగిన పోస్ట్ లేనటువంటి నర్మెట్ట ఫ్యాక్టరీకి బదిలీ చేయడం… దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆదేశాలను నిలిపివేయడం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనను పక్కన పెట్టినట్లు సమాచారం. దీనిపై సుధాకర్ రెడ్డి…

Read More

ఆయిల్‌ఫెడ్ ‘విజయ హైదరాబాద్’ బ్రాండ్ కు బీటలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణకు చెందిన ‘విజయ హైదరాబాద్’ బ్రాండ్‌ను కాపాడుకునే పేరుతో ఆయిల్‌ఫెడ్ ఓ ప్రైవేటు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ‘విజయ హైదరాబాద్’ నూనెలను విక్రయిస్తున్న టీఎస్‌-ఆయిల్‌ఫెడ్… కేవలం బ్రాండ్ పేరును, తమ గోదామును అత్యంత తక్కువ అద్దెకు ఇచ్చి చేతులు దులుపుకుందనే విమర్శలు వచ్చాయి. ప్రైవేటుకు అపరిమిత లబ్ధి…ఆయిల్‌ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ గా తిరుమలేశ్వర్ రెడ్డి ఈ కీలకమైన వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో విలువైన విజయ హైదరాబాద్…

Read More

మార్మోగిన ఔట్ సోర్సింగ్ గళం – మహా ధర్నా సక్సెస్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఉద్యోగ భద్రత, సమాన వేతనం కోసం పోరాడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గళం శనివారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మార్మోగింది. రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చి తమ ఐక్యతను చాటారు. ఉద్యోగుల డిమాండ్లకు మద్దతుగా పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సమాన వేతనం రాజ్యాంగ హక్కు:…

Read More

‘నాడి’పట్టే చెయ్యి’గాడి’తప్పుతోంది-డబ్బు కోసం వైద్యులు గడ్డి

సహనం వందే, హైదరాబాద్: ______________________________________________________________________________________________________________________ ఇలా అనేకమంది వైద్యులు డబ్బు కోసం గడ్డి తింటున్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఇప్పటికే లక్షల్లో సంపాదిస్తున్నారు. లక్షల రూపాయలు జీతాలు అందుతున్నా… ప్రైవేటు ప్రాక్టీస్ ఉన్నా కొందరు ఇంకా కోట్ల సంపాదనకు కుయుక్తులు చేస్తున్నారు. అందుకోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా పేట్ల బుర్జు ఆసుపత్రి సూపరింటెండెంట్ గా గతంలో పనిచేసిన డాక్టర్ రజనీరెడ్డి ఎన్ఎంసీ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఆమె ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఒక ప్రైవేట్ మెడికల్…

Read More

తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వివ(క)క్ష

సహనం వందే, హైదరాబాద్:ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అవమాన భారం మోస్తున్నారు. జీతం తక్కువ… ఛీత్కారాలు ఎక్కువ. నిబద్ధతతో సేవ చేస్తున్నప్పటికీ అవమానంతో మనుగడ సాగిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా… కనీసం విచారణ, నోటీసు లేకుండా ఒక సాధారణ ఫోన్ కాల్ ద్వారా తొలగిస్తున్నారు. వేతనంతో కూడిన సెలవు లేదు. వీరి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధుల్లో 25-30% ఏజెన్సీలు తినేస్తున్నాయి. తెలంగాణలో రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సరైన వేతనాలు లేక అర్ధాకలితో జీవితాలను నెట్టుకొస్తున్నారు….

Read More

ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల పోరుబాట -12వ తేదీన మహాధర్నా

సహనం వందే, హైదరాబాద్:తమ సమస్యల పరిష్కారం కోసం ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు గళం విప్పుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఏజెన్సీలు కాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరాట బాట పట్టారు. ఈ మేరకు శనివారం (12వ తేదీన) హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల నుంచి వందలాదిమంది ఈ ధర్నాకు…

Read More