ఉబర్ రైడ్… ఉమెన్ డేంజర్ – ప్రయాణంలో లైంగిక వేధింపులు

సహనం వందే, న్యూయార్క్:ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్-షేరింగ్ సంస్థ ఉబర్ … తన ప్రయాణీకులకు అత్యంత సురక్షితమైన సేవలు ఇస్తున్నట్లు చెబుతున్నా, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం… 2017-22 మధ్య కాలంలో లక్షలాది మంది ప్రయాణీకులు లైంగిక వేధింపులు, దౌర్జన్యాలకు గురైనట్లు తేలింది. అయినా ఈ సమస్యను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక వేధింపు…న్యూయార్క్ టైమ్స్ ప్రకారం… అమెరికాలో ఉబర్‌లో ప్రయాణిస్తున్న…

Read More

మెడిసిటీ విద్యార్థుల ‘మత్తు’ బిజినెస్ – దిక్కులు చూస్తున్న ప్రైవేట్ యాజమాన్యం

సహనం వందే, హైదరాబాద్:మేడ్చల్‌ మెడిసిటీ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యార్థులే గంజాయి బిజినెస్ చేస్తున్నారు. మూడేళ్లుగా కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థులు గంజాయిని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని హైదరాబాద్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రగ్స్‌పై ఈగల్‌ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో మెడిసిటీ వైద్య విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ టెస్టులో గంజాయి పాజిటివ్‌ వచ్చిన పలువురు విద్యార్థుల్ని డీ-అడిక్షన్‌ సెంటర్‌కు పంపించారు. సీనియర్‌ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేశారని,…

Read More

ఢిల్లీలో సీఎంతో జర్నలిస్టుల భేటీ

సహనం వందే, న్యూఢిల్లీ:తెలంగాణలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) కోరింది. ఈ మేరకు ఢిల్లీలో గురువారం డీజేహెచ్ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, డైరెక్టర్ ప్రతాపరెడ్డి, సభ్యులు నవీన్ దుమ్మాజీ, సతీష్ యాదవ్ తదితరులు ఆయన నివాసంలో కలిశారు. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలాగైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని బొల్లోజు రవి, ప్రతాప్ రెడ్డి ప్రత్యేకంగా…

Read More

పార్టీగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు – రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ:వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తమ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. బీసీల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోంది. విద్య, ఉద్యోగావకాశాల్లోనూ, అలాగే స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు కీలక బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లులను తక్షణమే…

Read More

మానవత్వం లేని నిర్మాత – హీరోలకు వందల కోట్లిస్తారు… కార్మికులకు రూ. 100 పెంచమంటే ఏడుస్తారు

సహనం వందే, హైదరాబాద్:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు తెరవెనుక జరుగుతున్న యుద్ధం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సినీ కార్మికులకు వేతనాల పెంపు విషయంలో నిర్మాతల మండలికి, కార్మిక సంఘాలకు మధ్య నెలకొన్న వివాదం కారణంగా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. దీనికితోడు కొన్నిచోట్ల జరుగుతున్న షూటింగ్‌లను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటున్నారు. నిర్మాతల వైఖరిపై కార్మికుల ఆగ్రహం…హీరోలకు వందల కోట్లు ఇచ్చే నిర్మాతలు, తమకు రోజువారీ వేతనం 100 రూపాయలు పెంచడానికి…

Read More

కేసీఆర్ దోషి… హరీష్ పాత్రధారి – కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతులేని అవినీతి

సహనం వందే, హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రిమండలి యధాతథంగా ఆమోదించినట్టు తెలిపారు. జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సమగ్రంగా చర్చించింది. అనంతరం రేవంత్ రెడ్డి…

Read More

ప్రజావాణి … ‘హైడ్రా’బాణి – రంగనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

సహనం వందే, హైద‌రాబాద్‌:హైడ్రా ప్రజల పక్షాన నిలుస్తోంది. ప్రజా గొంతుకగా మారుతుంది. అందుకోసం హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా ప్రజావాణి చేపట్టారు. సోమవారం నిర్వహించిన ప్ర‌జావాణికి 58 ఫిర్యాదులందాయి. ఇందులో అధిక‌భాగం పార్కుల క‌బ్జాలు, ర‌హ‌దారుల ఆక్ర‌మ‌ణ‌లు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల కాజేత ప్ర‌యత్నాల‌పై ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. గూగుల్ మ్యాప్స్‌, లేఔట్ల‌తో పాటు.. ఎన్ఆర్ ఎస్‌సీ, స‌ర్వే ఆఫ్ ఇండియా, గ్రామ రికార్డుల‌ను ఫిర్యాదుదారుల ముందే ఆన్‌లైన్లో…

Read More

నటులకు కోట్లు… కార్మికులకు పాట్లు – టాలీవుడ్ ఇండస్ట్రీలో విచిత్ర పరిస్థితి

సహనం వందే, హైదరాబాద్:టాలీవుడ్ పరిశ్రమలో పెద్ద పెద్ద నటులకు వందల కోట్లు చెల్లించే బడా నిర్మాతలు… సినిమా షూటింగ్ లలో పాల్గొనే కార్మికులకు మాత్రం రోజువారి కూలీ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారు. హీరో హీరోయిన్లకు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చే నిర్మాతలు… కార్మికుల ఆకలి తీర్చడానికి కూడా ముందుకు రావడం లేదు. దీనిపై తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, కోశాధికారి టీవీ…

Read More

టీఆర్ఎస్ (డి) గౌరవ అధ్యక్షురాలిగా ప్రసన్న

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) (టీఆర్ఎస్ (డి)) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని, సమస్యలపై పోరాడే మహిళగా గుర్తింపు పొందిన ప్రసన్నను తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పరిచయం అవసరం లేని పేరుగా తెలంగాణలో సుపరిచితులైన ప్రసన్న, ఇకపై పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఆమె పోరాట స్ఫూర్తి పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Read More

‘సృష్టి’ అధికారులపై ఉక్కుపాదం – వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ హెచ్చరిక

సహనం వందే, హైదరాబాద్: ‘సృష్టి’ ఫెర్టిలిటీ వంటి సెంటర్లలో అక్రమాలకు వీలు కల్పించిన ప్రభుత్వ అధికారులు, మెడికల్ కౌన్సిల్ వంటి సంస్థల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని… అందులో బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. మాతృత్వం ఆశతో వచ్చేవారిని వ్యాపార వస్తువులుగా మార్చిన కొన్ని ఐవీఎఫ్ కేంద్రాలు, సరోగసి సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సృష్టి తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని…

Read More